AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kichcha Sudeep: కిచ్చా సుదీప్ ఫేవరేట్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..? వీడియో వైరల్..

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ కు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉందన్న సంగతి తెలిసిందే. ఈగ సినిమాతో ప్రతినాయకుడి పాత్రతో అడియన్స్ ముందుకు వచ్చి అద్భుతమైన నటనతో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ప్రస్తుతం కన్నడలో వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నాడు.

Kichcha Sudeep: కిచ్చా సుదీప్ ఫేవరేట్ టాలీవుడ్ హీరోయిన్ ఎవరో తెలుసా..? వీడియో వైరల్..
Sudeep
Rajitha Chanti
|

Updated on: Oct 25, 2024 | 10:38 AM

Share

కన్నడ స్టార్ హీరో కిచ్చా సుదీప్ సౌత్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్. ఎన్నో హిట్ చిత్రాలతో తనకంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సుదీప్… ఇటు తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అటు హీరోగా అలరిస్తునే.. ఇటు బుల్లితెరపై బిగ్ బాస్ హోస్టింగ్ చేస్తున్నాడు. ప్రస్తుతం కిచ్చా సుదీప్ తీవ్ర దుఃఖంలో ఉన్నాడు. ఇటీవలే తన తల్లిని కోల్పోయిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ఇండస్ట్రీతోపాటు ఇతర భాషలోని నటీనటులు కూడా సుదీప్ కు ధైర్యం చెప్పారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా కిచ్చా సుదీప్ కు ధైర్యం చెప్పారు. ఇదిలా ఉంటే.. సుదీప్ పాత వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. అందులో సుదీప్ తన ఫేవరేట్ హీరోయిన్ గురించి మాట్లాడాడు.

‘సమంత, నయనతార, సాయి పల్లవి లేదా తమన్నా. వారిలో మీకు ఇష్టమైన వారు ఎవరు’ అని యాంకర్ అడగ్గా.. సమంత పేరు చెప్పాడు. ‘సమంత ఎప్పుడూ నా ఫేవరెట్‌. ఆమె ఒక మధురమైన అమ్మాయి. తన సినిమాలు చూస్తుంటాను. అద్భుతంగా నటిస్తుంది. ఆమె తనను తాను మరింత అందంగా, ప్రొఫెషనల్ గా మార్చుకుంది’ అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరలవుతుంది.

ఇది చదవండి :  Teen Maar: హాట్ ఫొటోలతో మెంటలెక్కిస్తోన్న తీన్ మాన్ హీరోయిన్.. పెళ్లైన తర్వాత పెరిగిన జోరు..  

డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో న్యాచురల్ స్టార్ నాని నటించిన ఈగ మూవీతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు సుదీప్. ఇందులో విలన్ పాత్రలో అదరగొట్టాడు. అలాగే ఈ సినిమాలో సమంత హీరోయిన్. ఈగ మూవీ షూటింగ్ నుంచి వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడింది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం సమంత తన సిటాడెల్ సిరీస్ ప్రమోషన్లలో పాల్గొంటుంది.

ఇది చదవండి :  Ram Charan: అప్పుడేమో క్యూట్‏గా.. ఇప్పుడేమో హాట్‏గా.. చరణ్ చెల్లిగా నటించిన ఈ బ్యూటీని ఇప్పుడు చూస్తే..

Tollywood: ఒక్క సినిమాతోనే సెన్సెషన్ అయిన నీలికళ్ల సుందరి.. అదృష్టం కలిసిరాని వయ్యారి.. ఎవరంటే..

Nadhiya : ద్యావుడా.. అందంలో తల్లిని మించిపోయిన కూతుళ్లు.. నదియా డాటర్స్ ఎంత అందంగా ఉన్నారో..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.