Dinesh Mangaluru: కేజీఎఫ్ మూవీ విలన్ కన్నుమూత.. విషాదంలో సినీపరిశ్రమ..
సినిమా పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. నాటక నేపథ్యం నుంచి సినీరంగంలోకి వచ్చి నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న దినేష్ మంగళూరు కన్నుమూశారు. నటుడిగా, కళా దర్శకుడిగా ఆయనకు మంచి గుర్తింపు లభించింది. కన్నడ చిత్రాల్లో డిమాండ్ ఉన్న నటుడిగా క్రేజ్ సంపాదించుకున్నారు. సోమవారం కుందాపూర్ లో ఆయన తుదిశ్వాస విడిచారు.

కన్నడ సినిమా పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. కేజీఎఫ్ మూవీ విలన్, నటుడు దినేష్ మంగళూరు కన్నుమూశారు. ఆగస్ట్ 25న కుందాపూర్‌లోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కన్నడలో ఆ డింగి’, ‘కేజీఎఫ్’ , ‘ ఉలిదవరు కందంటే’, ‘కిచ్చా’, ‘కిరిక్ పార్టీ’ వంటి చిత్రాల్లో నటించారు. కన్నడ సినిమా ప్రపంచంలో అత్యధిక డిమాండ్ ఉన్న నటులలో ఆయన ఒకరు. అనేక చిత్రాల్లో నటించి సహాయ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. దినేష్ మంగళూరు మరణం పట్ల చిత్ర పరిశ్రమలోని చాలా మంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు .
ఇవి కూడా చదవండి : Shilpa Shetty: ఏం అందం రా బాబూ.. 50 ఏళ్ల వయసులో పాతికేళ్ల అమ్మాయిలా.. ఫిట్నెస్ సీక్రెట్ చెప్పిన శిల్పా శెట్టి..
దినేష్ మంగళూరుకు రంగుల ప్రపంచంలో అపారమైన అనుభవం ఉంది. ‘కాంతారా’ సినిమా షూటింగ్ సమయంలో ఆయనకు స్ట్రోక్ వచ్చింది. బెంగళూరులో చికిత్స పొందిన తర్వాత ఆయన కోలుకున్నారు. కానీ వారం క్రితం ఆయన మళ్ళీ అనారోగ్యానికి గురయ్యారు. అంకడకట్టే సర్జన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సోమవారం ఆరోగ్య పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూశారు.
ఇవి కూడా చదవండి : Cinema : ఏం సినిమా రా బాబూ.. 90 కోట్లతో తీస్తే 9 కోట్లు లేదు.. బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్..
దినేష్ 1964 లో జన్మించారు. అసలు పేరు దినేష్ కలససి వెంకటేష్ పాయ్ (దినేష్ కెవి పాయ్). చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించిన తర్వాత దినేష్ మంగళూరు అనే పేరుతో ప్రసిద్ధి చెందారు. కాలేజీ రోజుల నుంచే నాటకాలపై ఆసక్తి పెంచుకున్నారు. ఆ తర్వాత యాక్టింగ్ శిక్షణ తీసుకుని సినిమా ప్రపంచంలోకి అడుగుపెట్టారు.
ఇవి కూడా చదవండి : Serial Actress : తస్సాదియ్యా.. సీరియల్లో పద్దతిగా.. నెట్టింట అందాల అరాచకంగా.. అమ్మడు ఫాలోయింగ్ చూస్తే..
ఇవి కూడా చదవండి : Chandramukhi: వామ్మో.. ఈ అమ్మడు చంద్రముఖి చైల్డ్ ఆర్టిస్టా.. ? ఇప్పుడు క్రేజీ హీరోయిన్ గురూ..
ఇవి కూడా చదవండి : Actress : కుర్రాళ్ల ఆరాధ్య దేవత.. యాక్టింగ్ మానేసి వ్యవసాయం చేసుకుంటున్న హీరోయిన్.. ఎందుకంటే..








