Actress: పెళ్లైన 2 ఏళ్లకే విడాకులు.. 12 మందితో ఎఫైర్.. ఈ స్టార్ హీరోయిన్ ఎవరో తెలుసా.?
సినీ ఇండస్ట్రీలో ఎఫైర్‌లు, డేటింగ్‌లు అనేవి సర్వసాధారణం. ఈ హీరోయిన్ కూడా అంతే.! తన 30 ఏళ్ల సినీ కెరీర్‌లో చాలామందితో డేటింగ్ చేసింది.. ఆ తర్వాత పెళ్లైన 2 ఏళ్లకే విడాకులు తీసుకుంది. ఆమె ఎవరో.? ఇప్పుడు తెలుసుకుందామా మరి.

ఈ అందాల భామ హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పలువురు అగ్రనటులతో కలిసి నటించింది. అందం, నటనతో ఎంతోమంది ఫ్యాన్స్‌ను తన సొంతం చేసుకుంది. సుమారు 30 ఏళ్ల సినీ కెరీర్ ఉన్న ఈమెకు.. వ్యక్తిగత జీవితం మాత్రం ఓ చేదు జ్ఞాపకం అని చెప్పొచ్చు. ఏకంగా 12 మందితో ఎఫైర్, ఆపై పెళ్లైన 2 ఏళ్లకే విడాకులు.. ఇలా జరగరానివి అన్ని జరిగాయి. మరి ఆమె ఎవరో అని అనుకుంటున్నారా.. ఆమె మరెవరో కాదు బాలీవుడ్ హీరోయిన్ మనీషా కొయిరాలా.90sలో స్టార్ హీరోయిన్‌గా చక్రం తిప్పిన ఈ బ్యూటీ సరసన అప్పట్లో స్టార్ హీరోలు సైతం నటించడానికి ఆసక్తి చూపేవారు.
మనీషా కోయిరాలా 1991లో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. సౌదాగర్ సినిమాతో అరంగేట్రం చేసిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు. వరుస అవకాశాలతో.. కొద్దికాలంలోనే స్టార్ స్టేటస్ సంపాదించింది. 30 ఏళ్లు సినీ కెరీర్‌లో దాదాపుగా 70కిపైగా చిత్రాల్లో నటించింది ఈ బ్యూటీ. తెలుగులో మనీషా కోయిరాలా నటించిన ‘బాంబే’ చిత్రం పెద్ద హిట్. ఆ తర్వాత భారతీయుడు, ఒకే ఒక్కడు లాంటి బ్లాక్‌బస్టర్ హిట్స్ బాక్సాఫీస్ దగ్గర సాధించింది. ఇంతటి సక్సెస్ సాధించిన ఈమె.. తన వ్యక్తిగత జీవితాన్ని మాత్రం సరిగ్గా మలుచుకోలేకపోయింది.
మనీషా కోయిరాలా తన కెరీర్‌లో ఎంతోమంది నటులతో డేటింగ్ చేసిందని టాక్. అందులో వివేక్ ముశ్రన్, నానా పటేకర్, వ్యాపారవేత్త సెసిల్ ఆంథోనీ.. ఇలా ఒకరి తర్వాత మరొకరు ఏకంగా 12 మందితో ఈమె సన్నిహితంగా ఉందని వార్తలు వచ్చాయి. అయితే ఈ భామ మాత్రం వీరెవ్వరిని పెళ్లి చేసుకోలేదు. 2010లో వ్యాపారవేత్త సామ్రాట్ దహల్‌ను పెళ్లి చేసుకుంది మనీషా కోయిరాలా.. కానీ ఆ తర్వాత వీరిద్దరూ వ్యక్తిగత కారణాల వల్ల 2 ఏళ్లకే విడిపోయారు. ఇక 53 ఏళ్ల వయస్సులోనూ ఒంటరిగా గడుపుతోన్న మనీషా కోయిరాలా.. ఇటీవలే క్యాన్సర్ బారి నుంచి బయటపడింది.
View this post on Instagram




