అధీర లుక్ వెనుక సీక్రెట్ అదే !

ఇటీవల సంజయ్‌దత్ బ‌ర్త్ డే సందర్భంగా 'కేజీఎఫ్: చాప్టర్‌-2'లోని ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది.

అధీర లుక్ వెనుక సీక్రెట్ అదే !

Sanjay Dutt As Adheera : ఇటీవల సంజయ్‌దత్ బ‌ర్త్ డే సందర్భంగా ‘కేజీఎఫ్: చాప్టర్‌-2’లోని ఆయన పాత్రకు సంబంధించిన పోస్టర్‌ను మూవీ యూనిట్ రిలీజ్ చేసింది. అప్పటివరకు ‘కేజీఎఫ్‌-1’లోని గరుడను మించిన క్రూరమైన వ్య‌క్తిగా ఆ పాత్ర రూపం ఎలా ఉంటుందన్న ఇంట్ర‌స్ట్ అందరిలోనూ నెలకొంది. అయితే, సంజయ్‌దత్‌ స్టిల్ విడుద‌ల కాగానే మూవీ బ‌జ్ ఒక్క‌సారిగా పెరిగిపోయింది. కాగా ఈ పాత్ర గెట‌ప్ పై సంజయ్‌ దత్‌ ఎంతో కేర్ తీసుకున్నార‌ని డైరెక్ట‌ర్ ప్రశాంత్‌ నీల్‌ తెలిపారు.

“అధీర పాత్రను చూస్తే వెన్నులో వ‌ణుకుపుట్టేలా ఉండాలని మేం అనుకున్నాం. అందుకే వైకింగ్‌ లుక్‌వైపు అడుగులు వేశాం. ఇదే విషయాన్ని సంజయ్‌ సర్‌కు తెలియ‌జేస్తే, అందుకు తగ్గ‌ట్లుగ‌తా మారడానికి ఎంతో శ్ర‌మించారు. మాకు ఎంతో హెల్ప్ చేశారు. ఈ విషయంలో ఆయన కేరింగ్ గురించి ఎంత చెప్పినా త‌క్కువే” అని ప్రశాంత్‌ నీల్ వెల్ల‌డించారు.

తొలి భాగంలో అధీర పాత్రను అసలు రివీల్ చేయ‌లేదు. కేవలం సింహపు ఉంగరం ధరించిన వ్యక్తిని ముఖం కనిపించ‌కుండా సస్పెన్స్ క్రియేట్ చేశారు. దీంతో ఆ పాత్ర ఎవరు పోషించ‌బోతున్నార‌న్న‌ ఆసక్తి నెలకొంది. కేజీఎఫ్‌-2 స్టార్ట్ చెయ్య‌గానే సంజయ్‌ ఆ పాత్ర చేస్తారనే సరికి మరింత బ‌జ్ పెరిగింది. దీనిపై కూడా ప్రశాంత్ స్పందించారు.

“కేజీఎఫ్‌-1 తీసే సమయంలో మాకు చాలా అడ్డంకులు, అవరోధాలు ఎదుర‌య్యాయి. అయితే సినిమా విజయం సాధించిన తర్వాత సెకండ్ పార్ట్ పై మరింత ఫోక‌స్ పెట్టాం. ఆడియెన్స్ దీనిపై ఎన్ని అంచనాలు పెట్టుకుంటారో మాకు తెలుసు. అయితే వారి అంచ‌నాల‌కు ఏమాత్రం తగ్గ‌దు. చాప్టర్‌-2 అత్యుత్తమంగా తీర్చిదిద్దుతున్నాం” అని వివరించారు. వేగంగా షూటింగ్ జరుపుకొంటున్న ఈ సినిమాలో యశ్, శ్రీనిధి శెట్టి హీరోహీరోయిన్లుగా న‌టిస్తున్నారు. ప్రధానిగా రవీనా ఠాండన్ క‌నిపించ‌నుండ‌గా, ఓ కీలక పాత్రలో తెలుగు నటుడు రావు రమేశ్ న‌టిస్తున్నారు.

 

Read More : సుశాంత్ మరణంపై సీబీఐ విచార‌ణ‌కు కేంద్రం గ్రీన్ సిగ్న‌ల్

Click on your DTH Provider to Add TV9 Telugu