AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF Chapter 3: కేజీఎఫ్ 3 కథ అదేనా? నెట్టింట ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్

కేజీఎఫ్ 3కి ఇంకా చాలా టైమ్ ఉందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. కానీ స్టోరీ లైన్ గురించి మాత్రం ఆసక్తికర న్యూస్ సోషల్ మీడియాలో సర్కులేట్ అవుతుంది.

KGF Chapter 3:  కేజీఎఫ్ 3 కథ అదేనా? నెట్టింట ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్
Hero Yash KGF3
Ram Naramaneni
|

Updated on: Nov 14, 2022 | 6:16 PM

Share

కేజీఎఫ్ 2 రిలీజ్ అయి ఐదు నెలలవుతోంది. అయినా ఇంకా రాకీభాయ్‌ లుక్‌లోనే ఉన్నారు యష్‌. నెక్ట్స్ సినిమా విషయంలో రకరకాల న్యూస్ వైరల్‌ అవుతున్నా రాకీ మాత్రం వెయిట్ అండ్ సీ అంటూ ఊరిస్తున్నారు. ఈ టైమ్‌లోనూ కేజీఎఫ్ 3కి సంబంధించి ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సాండల్‌వుడ్‌లో సర్క్యులేట్ అవుతోంది. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కేజీఎఫ్ వైబ్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్‌గా ప్రూవ్ చేసుకున్న యష్… ఇంకా రాకీ భాయ్‌ లుక్‌లోనే కనిపిస్తున్నారు. దీంతో యష్ నెక్ట్స్ మూవీ కేజీఎఫ్ పార్ట్ 3 అన్న టాక్ బలంగా వినిపించింది. కానీ ఈ రూమర్స్‌కు చెక్ పెట్టేశారు యష్‌… ఇప్పట్లో కేజీఎఫ్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చే ఆలోచన లేదని ఆల్రెడీ క్లారిటీ ఇచ్చేశారు.

యష్, టైమ్ ఉందని చెబుతున్నా నిర్మాతలు మాత్రం కేజీఎఫ్ 3కి గ్రౌండ్ రెడీ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కేజీఎఫ్ సినిమాకు ముందు అనుకున్న కథ వేరు. పీరియాడిక్ ఎలిమెంట్స్‌ను మిక్స్‌ చేస్తూ కాస్ట్యూమ్ డ్రామాగా ఓ కథను సిద్దం చేశారు ప్రశాంత్‌ నీల్‌. కానీ యష్ ఐడియాతో పూర్తి కథను పక్కన పెట్టి అందులో కొంత భాగాన్నే కేజీఎఫ్‌ 1, 2గా తెరకెక్కించారు.

రెండు భాగాలు సూపర్ హిట్ కావటంతో ఇప్పుడు మిగత కథను మూడోభాగంగా తెరకెక్కించే ఆలోచనలో ఉన్నారట మేకర్స్. గతంలో పక్కన పెట్టిన పీరియాడిక్‌ కాన్సెప్ట్‌ మీద మరోసారి వర్క్ చేసి ఆ కథతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నారట. అంతేకాదు థర్డ్ ఇన్‌స్టాల్మెంట్‌లో యష్… రాజుగా కనిపిస్తారన్న ప్రచారం కూడా జరుగుతోంది. అయితే ఈ విషయంలో అఫీషియల్‌ ఎనౌన్స్‌మెంట్‌ రావాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరిన్ని టాలీవుడ్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మన ఫుడ్ టేస్ట్‌కు ఎంతటివారైనా ఫ్లాట్ కావాల్సిందేగా మరి
మన ఫుడ్ టేస్ట్‌కు ఎంతటివారైనా ఫ్లాట్ కావాల్సిందేగా మరి
గోవా వెళ్లారా? ఈ ఫుడ్స్ మిస్సైతే ట్రిప్ వేస్ట్ అయినట్టే..
గోవా వెళ్లారా? ఈ ఫుడ్స్ మిస్సైతే ట్రిప్ వేస్ట్ అయినట్టే..
బ్యాంక్ లోన్ కట్టలేకపోతున్నారా? మీరు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు
బ్యాంక్ లోన్ కట్టలేకపోతున్నారా? మీరు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు
సముద్రంలో పడవ సీన్ షూటింగ్‌లో ప్రమాదం.. ప్రముఖ నటుడు మృతి!
సముద్రంలో పడవ సీన్ షూటింగ్‌లో ప్రమాదం.. ప్రముఖ నటుడు మృతి!
CSK vs RR: ధోనీ లేకుండానే బరిలోకి.. ప్లేయింగ్ 11 ఇదే..?
CSK vs RR: ధోనీ లేకుండానే బరిలోకి.. ప్లేయింగ్ 11 ఇదే..?
మీ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతోందా? ఈ చిన్న ఉప్పు చిట్కాతో మళ్లీ
మీ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతోందా? ఈ చిన్న ఉప్పు చిట్కాతో మళ్లీ
రైతు అద్భుత ప్రయోగానికి ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.. ప్రశంసల వర్షం
రైతు అద్భుత ప్రయోగానికి ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.. ప్రశంసల వర్షం
ముంబై ఓపెనర్లను దెబ్బకొట్టిన అనుకుల్ రాయ్
ముంబై ఓపెనర్లను దెబ్బకొట్టిన అనుకుల్ రాయ్
పబ్లిక్ మీటింగ్స్‌లో స్పీచ్‌తో మనసు దోచుకునే టిప్స్
పబ్లిక్ మీటింగ్స్‌లో స్పీచ్‌తో మనసు దోచుకునే టిప్స్
ఉల్లిపాయలు రోజుల తరబడి ఫ్రెష్‌గా ఉండాలా..? అద్భుతమైన ట్రిక్స్‌
ఉల్లిపాయలు రోజుల తరబడి ఫ్రెష్‌గా ఉండాలా..? అద్భుతమైన ట్రిక్స్‌