AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Anukul Roy : ఒకే ఒక్కడు.. రెండు కీలక వికెట్లు.. ముంబై ఓపెనర్లను దెబ్బకొట్టిన అనుకుల్ రాయ్

Anukul Roy : ఐపీఎల్ 2026లో కేకేఆర్ ఫీల్డర్ అనుకూల్ రాయ్ అద్భుత ఫీల్డింగ్‌తో రోహిత్ శర్మ, రాయన్ రికల్టన్ సెంచరీలను అడ్డుకున్నాడు. ముంబై విజయం సాధించినా అనుకూల్ మెరుపు క్యాచ్, డైరెక్ట్ త్రో మ్యాచ్‌కే హైలైట్‌గా నిలిచాయి. వీరి అవుట్ తో స్టేడియం అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.

Anukul Roy : ఒకే ఒక్కడు.. రెండు కీలక వికెట్లు.. ముంబై ఓపెనర్లను దెబ్బకొట్టిన అనుకుల్ రాయ్
Rohit Sharma Ryan Rickelton
Rakesh
|

Updated on: Mar 30, 2026 | 6:50 AM

Share

Anukul Roy : ఐపీఎల్ 2026 సీజన్ రెండో మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు ఆరంభం నుంచే శివాలెత్తారు. 221 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి రోహిత్ శర్మ, రాయన్ రికల్టన్ అదిరిపోయే ఆరంభాన్ని ఇచ్చారు. కేకేఆర్ బౌలర్లను ఉతికేస్తూ కేవలం 11.5 ఓవర్లలోనే 148 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. హిట్ మ్యాన్ తన ట్రేడ్ మార్క్ షాట్లతో విరుచుకుపడగా, రికల్టన్ అతనికి ధీటుగా బౌండరీల వర్షం కురిపించాడు. ఇద్దరూ సులభంగా సెంచరీలు పూర్తి చేసుకుంటారని అందరూ భావించిన తరుణంలో కోల్‌కతా ఫీల్డర్ అనుకూల్ రాయ్ ఒక అద్భుతంలా రంగప్రవేశం చేశాడు.

హిట్ మ్యాన్ కొంపముంచిన సూపర్ క్యాచ్

రోహిత్ శర్మ 38 బంతుల్లోనే 78 పరుగులు చేసి సెంచరీ వైపు దూసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో వైభవ్ అరోరా వేసిన 12వ ఓవర్లో రోహిత్ ఒక భారీ షాట్‌కు ప్రయత్నించాడు. బంతి బ్యాట్ టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేచింది. మిడ్-ఆన్ వద్ద ఉన్న అనుకూల్ రాయ్ వెనక్కి పరిగెత్తుకుంటూ వెళ్లి, నమ్మశక్యం కాని రీతిలో ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి ఆ క్యాచ్‌ను అందుకున్నాడు. ఈ మెరుపు క్యాచ్‌తో రోహిత్ ఇన్నింగ్స్‌కు తెరపడటమే కాకుండా, స్టేడియం అంతా ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది.

రికల్టన్ పతనం.. డ్రామా మధ్య రన్ అవుట్

మరోవైపు 43 బంతుల్లో 81 పరుగులు చేసి జోరుమీదున్న రాయన్ రికల్టన్‌ను కూడా అనుకూల్ రాయ్ తన ఫీల్డింగ్ మాయాజాలంతో పెవిలియన్ పంపాడు. బ్లెస్సింగ్ ముజరబానీ వేసిన 16వ ఓవర్లో రికల్టన్ లాంగ్-ఆఫ్ వైపు బంతిని పంపి రెండు పరుగుల కోసం ప్రయత్నించాడు. అయితే నాన్-స్ట్రైకర్ ఎండ్‌లోకి తిరిగి వచ్చే సమయంలో బౌలర్ ముజరబానీ అనుకోకుండా రికల్టన్ దారికి అడ్డువచ్చాడు. ఈ గందరగోళాన్ని క్యాష్ చేసుకున్న అనుకూల్ రాయ్, డీప్ నుంచి మెరుపు వేగంతో డైరెక్ట్ త్రో విసిరి స్టంప్స్‌ను ఎగరగొట్టాడు. అంపైర్లు దీనిని అబ్స్ట్రక్టింగ్ ద ఫీల్డ్ కింద కాకుండా సాధారణ రన్ అవుట్‌గానే ప్రకటించడంతో రికల్టన్ నిరాశగా వెనుదిరిగాడు.

కోల్‌కతా పోరాడినా.. ముంబైకే విజయం

అనుకూల్ రాయ్ చేసిన ఈ రెండు కీలకమైన ఫీల్డింగ్ విన్యాసాలు ముంబైని కాస్త ఒత్తిడిలోకి నెట్టినప్పటికీ, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. భారీ భాగస్వామ్యం కారణంగా ముంబై ఇండియన్స్ ఈ లక్ష్యాన్ని ఛేదించి సునాయాస విజయాన్ని అందుకుంది. అయినప్పటికీ, మ్యాచ్ ముగిసిన తర్వాత అందరూ చర్చించుకున్న పేరు మాత్రం అనుకూల్ రాయ్. ఒక్కడే ఇద్దరు సెంచరీ సాధించాల్సిన బ్యాటర్లను అవుట్ చేసి మ్యాచ్‌లో హైలైట్‌గా నిలిచాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
కొబ్బరి నూనె తలస్నానానికి ముందా, తర్వాతా వాడాలా? జుట్టు ఆరోగ్యంగా
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ముద్రగడ పద్మనాభం మృతి.. పవన్ కళ్యాణ్ ఎమోషనల్ పోస్ట్!
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
ఎంతకు తెగించార్రా.. మఫ్టీ పోలీసుల పేరుతో రైతుల నిలువుదోపిడీ..
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కళ్లు కాయలుకాసేలా ఎదురుచూస్తే.. కాసేపైనా ఆడకపోతిరి!
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
కోర్టులో జడ్జి కుర్చీపైనే క్షుద్రపూజలు, ఆవాలు చల్లుతూ చేతబడి..
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
'బలగం' మూవీని రిజెక్ట్ చేసిన హీరోలు, హీరోయిన్స్ ఎవరో తెలుసా?
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
30 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్.. 90's కుర్రాళ్ల ఫేవరేట్ లవ్ సాంగ్..
హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..?
హోండా SP 125 vs టీవీఎస్ రైడర్ 125.. రేసులో అసలైన కింగ్ ఎవరు..?
రోడ్డు పక్కన టీ తాగే ముందు ఈ వీడియో చూడండి..!
రోడ్డు పక్కన టీ తాగే ముందు ఈ వీడియో చూడండి..!
బరువు తగ్గడానికి రన్నింగ్ బెస్టా? సైక్లింగ్ మంచిదా..?
బరువు తగ్గడానికి రన్నింగ్ బెస్టా? సైక్లింగ్ మంచిదా..?
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
రజినీ హిట్ మంత్రం ఇదే.. ప్రతి సినిమాలో స్టార్‌ల సైన్యమే!
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
100 ఏళ్ళ తెలుగు ఇండస్ట్రీలో సమంత అరుదైన రికార్డ్
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
జపాన్‌లో తెలుగు హీరోలదే మ్యాజిక్.. ‘ధురంధర్’ ఎందుకు తేలిపోయింది?
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
టికెట్ రేట్లే హిట్ మంత్రమా? ‘లెనిన్’తో మళ్లీ మొదలైన టాలీవుడ్ చర్చ
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
స్టైల్ మార్చేస్తున్న లెక్కల మాస్టారు.. చరణ్ కోసం కొత్త ప్లాన్!
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
ఆలయ గర్భగుడి తెరవగానే షాకింగ్‌ దృశ్యం..
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
మనిషి ఊపిరి ఆగిపోయే చోట అద్భుతం మహా శాస్త్రవేత్తలకే సవాల్
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
బీఎస్‌ఎన్‌ఎల్‌ సంచలనం.. సరికొత్త శాటిలైట్‌ ఫోన్‌ వచ్చేసింది
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
పాతికేళ్ల తర్వాత అప్పు తీర్చడానికి కేరళ నుంచి తెలంగాణకు
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం
స్కూటీ ఇంజిన్‌లో వింతశబ్దాలు..తృటిలో తప్పిన ప్రమాదం