AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: సముద్రంలో పడవ సీన్ షూటింగ్‌లో ప్రమాదం.. ప్రముఖ నటుడు మృతి!

షూటింగ్‌ సమయంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రముఖ బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ (42) ప్రమాదవశాత్తు మరణించాడు. సముద్రంలో పడవ సీన్ తీస్తుండగా ప్రమాదవశాత్తూ రాహుల్‌ సముద్రంలో పడిపోయాడు. వెంటనే ఆయనను రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించడగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు..

Watch Video: సముద్రంలో పడవ సీన్ షూటింగ్‌లో ప్రమాదం.. ప్రముఖ నటుడు మృతి!
Actor Rahul Arunoday Banerjee
Srilakshmi C
|

Updated on: Mar 30, 2026 | 7:28 AM

Share

సినీ ఇండస్ట్రీలో మరో విషాదం చోటు చేసుకుంది. షూటింగ్‌ సమయంలో జరిగిన పడవ ప్రమాదంలో ప్రముఖ బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీ (42) ప్రమాదవశాత్తు మరణించాడు. సముద్రంలో పడవ సీన్ తీస్తుండగా ప్రమాదవశాత్తూ రాహుల్‌ సముద్రంలో పడిపోయాడు. వెంటనే ఆయనను రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించడగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు దృవీకరించారు. అసలేం జరిగిందంటే..

బెంగాలీ నటుడు రాహుల్ అరుణోదయ్ బెనర్జీతోపాటు చిత్ర యూనిట్‌ షూటింగ్‌ నిమిత్తం తల్సరి సముద్రం వద్దకు చేరుకున్నారు. అక్కడ పడవ సీన్‌ చేస్తుండగా అనుకోకుండా రాహుల్‌ సముద్రంలో పడిపోయాడు. అక్కడే ఉన్న సహాయక బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని రాహుల్‌ను ఒడ్డుకు తీసుకవచ్చారు. అనంతరం సమీపంలోని ఓ ఆస్పత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాన్ని దీఘా స్టేట్ జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన మరింత సమాచారం సేకరించేందుకు పశ్చిమ బెంగాల్ పోలీసులు ఒడిశాలోని బాలాసోర్ పోలీసులతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో బెంగాలీ చిత్ర సీమలో విషాదం చోటు చేసుకుంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

బెనర్జీ 1983 అక్టోబర్ 16న కోల్‌కతాలో జన్మించారు. 2008లో వచ్చిన ‘చిరోదిని తుమీ జే అమర్’ మువీలో ఆయన నటనకు మంచి గుర్తింపు దక్కింది. ఈ మువీతో ఆయనకు బెంగాలీ ప్రేక్షకులలో ఆదరణ కూడా దక్కింది. ఆ తర్వాత లవ్ సర్కస్, షోనో మోన్ బోలీ తోమే, నా హన్యతే, కాగోజెర్ బౌ వంటి చిత్రాలలో నటించాడు. సినిమాలతోపాటు రాహుల్‌ పలు టెలివిజన్ షోలు, వెబ్ సిరీస్‌లలో కూడా నటించాడు. ఇవి ప్రేక్షకులతో మమేకమవడానికి అతనికి మరింత సహాయపడ్డాయి. సినిమాలు, టెలివిజన్ రంగంలోకి రాకముందు రాహుల్ అనేక నాటక ప్రదర్శనలలో నటించారు. ఆ తర్వాత నటన వైపు అడుగులు వేశారు. జీ బంగ్లా షో ‘ ఖేలా’లో ఆదిత్య పాత్రతో మంచి గుర్తింపు పొందారు. దీనితో ఆయనకు మొదటి సినిమా అవకాశం లభించింది. ఆ తర్వాత వరుస ఆఫర్లతో దూసుకుపోతున్నారు.

ఇక రాహుల్‌ వ్యక్తిగత విషయానికి వస్తే.. రాహుల్ తొలి మువీ ‘ చిరోడిని తుమీ జే అమర్’లో తన సహనటి అయిన ప్రియాంక సర్కార్‌ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు షోహోజ్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే వీరు మనస్పర్ధల కారణంగా 2017లో విడిపోయారు. 2023లో మళ్లీ కలిసిపోయారు. నటుడు రాహుల్‌ మృతి పట్ల పలువురు సినీ సెలబ్రెటీలు సోషల్‌ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.

మరిన్ని సినీ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
JEE Main 2026 సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ లింక్
JEE Main 2026 సెషన్‌ 2 అడ్మిట్‌ కార్డులు విడుదల.. డౌన్‌లోడ్ లింక్
కేకేఆర్ మీద గెలిచిన తర్వాత ఎమోషనల్ అయిన హార్దిక్ పాండ్యా
కేకేఆర్ మీద గెలిచిన తర్వాత ఎమోషనల్ అయిన హార్దిక్ పాండ్యా
దారుణం.. ప్రేయసిని ముక్కలు ముక్కలుగా నరికి.. బాడీ పార్ట్స్‌ను
దారుణం.. ప్రేయసిని ముక్కలు ముక్కలుగా నరికి.. బాడీ పార్ట్స్‌ను
చట్టంగా మారిన పేరెంట్స్ బాధ్యత.. ఈ కొత్త చట్టం ఎలా పనిచేస్తుంది
చట్టంగా మారిన పేరెంట్స్ బాధ్యత.. ఈ కొత్త చట్టం ఎలా పనిచేస్తుంది
అంత కొట్టినా ముంబైపై ఓడిపోయాం.. తప్పంతా రూ. 25 కోట్ల ప్లేయర్‌దే..
అంత కొట్టినా ముంబైపై ఓడిపోయాం.. తప్పంతా రూ. 25 కోట్ల ప్లేయర్‌దే..
మన ఫుడ్ టేస్ట్‌కు ఎంతటివారైనా ఫ్లాట్ కావాల్సిందేగా మరి
మన ఫుడ్ టేస్ట్‌కు ఎంతటివారైనా ఫ్లాట్ కావాల్సిందేగా మరి
గోవా వెళ్లారా? ఈ ఫుడ్స్ మిస్సైతే ట్రిప్ వేస్ట్ అయినట్టే..
గోవా వెళ్లారా? ఈ ఫుడ్స్ మిస్సైతే ట్రిప్ వేస్ట్ అయినట్టే..
బ్యాంక్ లోన్ కట్టలేకపోతున్నారా? మీరు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు
బ్యాంక్ లోన్ కట్టలేకపోతున్నారా? మీరు తెలుసుకోవాల్సిన కీలక విషయాలు
సముద్రంలో పడవ సీన్ షూటింగ్‌లో ప్రమాదం.. ప్రముఖ నటుడు మృతి!
సముద్రంలో పడవ సీన్ షూటింగ్‌లో ప్రమాదం.. ప్రముఖ నటుడు మృతి!
CSK vs RR: ధోనీ లేకుండానే బరిలోకి.. ప్లేయింగ్ 11 ఇదే..?
CSK vs RR: ధోనీ లేకుండానే బరిలోకి.. ప్లేయింగ్ 11 ఇదే..?