AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK vs RR: రాజస్థాన్‌తో ధోనీ లేకుండానే బరిలోకి.. చెన్నై ప్లేయింగ్ 11 ఇదే..?

Chennai Super Kings Playing XI: ఐపీఎల్ 2026 సీజన్ ఆరంభంలోనే క్రికెట్ అభిమానులకు అసలైన మజా అందనుంది. గౌహతి వేదికగా జరగనున్న మూడో మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ తలపడనున్నాయి. గత సీజన్ చేదు జ్ఞాపకాలను చెరిపివేస్తూ, భారీ మార్పులు, సంచలన ట్రేడింగ్‌ల తర్వాత ఇరు జట్లు ఈ పోరుకు సిద్ధమయ్యాయి. గెలుపే లక్ష్యంగా సాగే ఈ పోరు ఆసక్తికరం కానుంది.

CSK vs RR: రాజస్థాన్‌తో ధోనీ లేకుండానే బరిలోకి.. చెన్నై ప్లేయింగ్ 11 ఇదే..?
Csk Playing Xi Ipl 2026
Venkata Chari
|

Updated on: Mar 30, 2026 | 6:55 AM

Share

IPL 2026, CSK vs RR: ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత భారీ ట్రేడింగ్ ఒప్పందాల తర్వాత చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడుతుండటం గమనార్హం. సంజూ శాంసన్‌ను చెన్నై దక్కించుకోగా, రవీంద్ర జడేజా, సామ్ కరన్‌లు రాజస్థాన్ గూటికి చేరారు. సోమవారం జరిగే ఈ మ్యాచ్‌లో ట్రేడ్ అయిన ఆటగాళ్లందరూ బరిలోకి దిగుతుండటంతో మ్యాచ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత సీజన్‌లో పట్టికలో చివరి స్థానాల్లో నిలిచిన ఈ జట్లు, ఈసారి శుభారంభం చేయాలని పట్టుదలగా ఉన్నాయి.

మహేంద్ర సింగ్ ధోనీ దూరం.. సీఎస్కేకు భారీ ఎదురుదెబ్బ..

సీజన్ ప్రారంభానికి ముందే చెన్నై సూపర్ కింగ్స్‌కు ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మొదటి రెండు వారాల పాటు టోర్నీకి దూరమయ్యాడు. అలాగే బౌలర్ నాథన్ ఎల్లిస్ కూడా అందుబాటులో లేకపోవడం జట్టును కొంత బలహీనపరిచింది. ధోనీ స్థానంలో ఇంగ్లండ్ ఆల్‌రౌండర్ జేమీ ఓవర్టన్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. డెవాల్డ్ బ్రెవిస్ కూడా గాయపడటంతో ఆస్ట్రేలియా బ్యాటర్ మాట్ షార్ట్ జట్టులో చేరనున్నాడు.

బలమైన బ్యాటింగ్ లైనప్.. ఓపెనర్లుగా రుతురాజ్, సంజూ

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ఈసారి సంజూ శాంసన్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్నాడు. సంజూ దూకుడుగా ఆడుతూ స్కోరు బోర్డును పరిగెత్తించే బాధ్యత తీసుకోగా, రుతురాజ్ యాంకర్ రోల్ పోషించనున్నాడు. మూడో స్థానంలో యువ సంచలనం ఆయుష్ మ్హత్రే బ్యాటింగ్‌కు రానున్నాడు. మిడిల్ ఆర్డర్‌లో శివమ్ దూబే పవర్‌ హిట్టింగ్‌తో పాటు గౌహతి పిచ్‌పై బౌలింగ్‌లోనూ కీలక పాత్ర పోషించనున్నాడు.

భారీ ధర పలికిన కుర్రాళ్లపైనే భారం..

వేలంలో చెన్నై జట్టు ఒక్కొక్కరికి 14.2 కోట్ల రూపాయలు వెచ్చించిన కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్ ఈ మ్యాచ్‌లో ఫినిషర్లుగా బరిలోకి దిగనున్నారు. ధోనీ లేని లోటును వీరు భర్తీ చేస్తారని మేనేజ్‌మెంట్ భావిస్తోంది. బౌలింగ్ విభాగంలో ఖలీల్ అహ్మద్, అన్షుల్ కంబోజ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పిన్ విభాగంలో ఆఫ్ఘన్ స్టార్ నూర్ అహ్మద్ ప్రధాన ఆయుధంగా మారనున్నాడు.

రాజస్థాన్ రాయల్స్‌తో తలపడే చెన్నై సూపర్ కింగ్స్ అంచనా జట్టు: రుతురాజ్ గైక్వాడ్ (కెప్టెన్), సంజూ శాంసన్, ఆయుష్ మ్హత్రే, మాట్ షార్ట్, శివమ్ దూబే, కార్తీక్ శర్మ, ప్రశాంత్ వీర్, జేమీ ఓవర్టన్, ఖలీల్ అహ్మద్, నూర్ అహ్మద్, అన్షుల్ కంబోజ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
CSK vs RR: ధోనీ లేకుండానే బరిలోకి.. ప్లేయింగ్ 11 ఇదే..?
CSK vs RR: ధోనీ లేకుండానే బరిలోకి.. ప్లేయింగ్ 11 ఇదే..?
మీ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతోందా? ఈ చిన్న ఉప్పు చిట్కాతో మళ్లీ
మీ ఇంట్లోని తులసి మొక్క ఎండిపోతోందా? ఈ చిన్న ఉప్పు చిట్కాతో మళ్లీ
రైతు అద్భుత ప్రయోగానికి ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.. ప్రశంసల వర్షం
రైతు అద్భుత ప్రయోగానికి ఫిదా అయిన ఆనంద్ మహీంద్రా.. ప్రశంసల వర్షం
ముంబై ఓపెనర్లను దెబ్బకొట్టిన అనుకుల్ రాయ్
ముంబై ఓపెనర్లను దెబ్బకొట్టిన అనుకుల్ రాయ్
పబ్లిక్ మీటింగ్స్‌లో స్పీచ్‌తో మనసు దోచుకునే టిప్స్
పబ్లిక్ మీటింగ్స్‌లో స్పీచ్‌తో మనసు దోచుకునే టిప్స్
ఉల్లిపాయలు రోజుల తరబడి ఫ్రెష్‌గా ఉండాలా..? అద్భుతమైన ట్రిక్స్‌
ఉల్లిపాయలు రోజుల తరబడి ఫ్రెష్‌గా ఉండాలా..? అద్భుతమైన ట్రిక్స్‌
వీరు ఎంత సంపాదించినా డబ్బు చేతిలో ఉండవు.. కొంచెం జాగ్రత్త.!
వీరు ఎంత సంపాదించినా డబ్బు చేతిలో ఉండవు.. కొంచెం జాగ్రత్త.!
పిల్లల ముందు పేరెంట్స్‌ ప్రవర్తనే వాళ్ల ఫ్యూచర్
పిల్లల ముందు పేరెంట్స్‌ ప్రవర్తనే వాళ్ల ఫ్యూచర్
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..
దిగి వస్తున్న బంగారం, వెండి ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే..
ఐస్‌క్రీం అమ్ముకునే వ్యక్తి తల నరికి.. నేరుగా ఇంటికి తీసుకెళ్లాడు
ఐస్‌క్రీం అమ్ముకునే వ్యక్తి తల నరికి.. నేరుగా ఇంటికి తీసుకెళ్లాడు