AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kitchen Tips: ఉల్లిపాయలు రోజుల తరబడి ఫ్రెష్‌గా ఉండాలా..? అద్భుతమైన ట్రిక్స్‌ మీ కోసం!

Kitchen Tips: భారతీయ వంటకాల్లో ఉల్లిపాయ, బంగాళదుంప, వెల్లుల్లి లేనిదే ముద్ద దిగదు. అయితే వీటిని నిల్వ చేసేటప్పుడు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఇవి త్వరగా పాడైపోతుంటాయి. వాటిని తాజాగా ఉంచడానికి ఈ క్రింది పద్ధతులు పాటించండి..

Subhash Goud
|

Updated on: Mar 30, 2026 | 6:35 AM

Share
 Kitchen Tips: మీరు ఉల్లిపాయను ఎక్కువ కాలం తాజాగా ఉంచాలనుకుంటే, దానిని చల్లని, పొడి వాతావరణంలో ఉంచండి. చల్లని గాలి వచ్చే ప్రదేశంలో ఉంచండి. బంగాళదుంపలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి భారతీయ వంటగదికి జీవనాధారం. ఈ మూడు లేనిదే ఆహారం అసంపూర్ణం.

1 / 6
 అయితే ఈ మూడింటిని సరిగ్గా ఉంచుకోకపోతే ముఖ్యంగా వేసవిలో కుళ్లిపోతుంటాయి. ఉల్లిపాయలను ఎలా నిల్వ చేయాలో తెలుసుకుందాం. ఎల్లప్పుడూ పొడి ఉల్లిపాయను ఎంచుకోండి. ఉల్లిపాయలు ఎక్కడ ఉంచితే అక్కడ గాలి రావాలి.

2 / 6
మీరు ఉల్లిపాయను కుళ్ళిపోకుండా కాపాడుకోవాలనుకుంటే దానిని చల్లని వాతావరణంలో ఉంచడం మంచిదంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయలు కుళ్లిపోకుండా ఎక్కువ కాలం ఉంటుంది. బంగాళదుంపలు, ఉల్లిపాయలను వంటగదిలో వెంటిలేషన్ ప్రదేశంలో ఉంచండి. వేడి, సూర్యకాంతి నుండి రెండింటినీ దూరంగా ఉంచండి. అవసరమైతే తప్ప ఉల్లిపాయలను కడగవద్దు.

3 / 6
 ఉల్లిపాయను పొడి గుడ్డతో తుడిచి, ఆపై నిల్వ చేయండి. ఉల్లిపాయలను ప్లాస్టిక్ బ్యాగ్‌లో ఉంచకుండా, వాటిని బుట్టలో నిల్వ చేయండి. అన్ని వైపుల నుండి గాలి వచ్చే అటువంటి కంటైనర్‌ను ఉపయోగించండి. ఇతర పండ్లు, కూరగాయల నుండి దూరంగా ఉంచండి.

4 / 6
 తడిగా ఉన్న ప్రదేశాల నుండి దూరంగా ఉంచండి. లేకపోతే అది వెంటనే కుళ్ళిపోతుంది. ఉల్లిపాయను మెష్ బుట్టలో ఉంచండి. తద్వారా అన్ని వైపుల నుండి గాలి వస్తుంది. ఇంకో విషయం ఏంటంటే  బంగాళదుంపలు, ఉల్లిపాయలను కలిపి ఉంచవద్దు. చాలామంది చేసే అతిపెద్ద పొరపాటు ఇది. ఉల్లిపాయలు విడుదల చేసే ఇథిలీన్ వాయువు వల్ల పక్కనే ఉన్న బంగాళదుంపలు త్వరగా మొలకలు వచ్చి కుళ్లిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిని వేర్వేరు బుట్టల్లో ఉంచడం మంచిది.

5 / 6
ఫ్రిజ్‌లో పెట్టవచ్చా?: ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెడితే అందులోని తేమ వల్ల అవి మెత్తబడి, బూజు పట్టే అవకాశం ఉంది. అయితే, మీరు ఉల్లిపాయను సగం కోసినట్లయితే, మిగిలిన భాగాన్ని గాలి చొరబడని డబ్బాలో పెట్టి ఫ్రిజ్‌లో ఉంచవచ్చు. కానీ దానిని 1-2 రోజుల్లోనే వాడేయాలి.  ముఖ్య గమనిక: ఉల్లిపాయ పొట్టు (Skin) తీయకుండా ఉంచినప్పుడే అది సహజమైన రక్షణను కలిగి ఉంటుంది. అందుకే వాడే ముందు మాత్రమే పొట్టు తీయండి.  చిన్న జాగ్రత్తలు పాటిస్తే మీ వంటగదిలోని ఈ నిత్యావసర వస్తువులు వేసవిలో కూడా కనీసం 2 నుండి 4 వారాల పాటు తాజాగా ఉంటాయి.

6 / 6
Follow Us