KGF-2: కేజీఎఫ్-2 నుంచి ఇంట్రెస్టింగ్ రూమర్.. ఆ వింటేజ్ సాంగ్ రీమిక్స్ చేశారా..!
కేజీఎఫ్ చాప్టర్-2 కోసం కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ కొనసాగుతోంది...
కేజీఎఫ్ చాప్టర్-2 కోసం కోట్ల మంది ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పటికీ కొనసాగుతోంది. ఈ సిక్వెల్ పై భారీ అంచనాలు ఉన్నాయి. దానికి తగ్గట్లుగానే టీజర్, పోస్టర్స్ ఉన్నాయి. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. కేజీఎఫ్ మూవీ మొదటి భాగం హిందీ వెర్షన్‌లో ‘త్రిదేవ్’ చిత్రంలోని జాకీ ష్రాఫ్, సోనమ్ నర్తించిన ‘గలీ గలీ మే’ పాటను రీమిక్స్ చేశారు. ఈ సాంగ్‌లో బుల్లితెర హాట్ బ్యూటీ మౌనీ రాయ్ డ్యాన్స్ చేసి మెప్పించింది. తెలుగులో మాత్రం ‘దోచెయ్’ అంటూ తమన్నాతో ఐటమ్ సాంగ్ చేయించారు.
ఇప్పుడు కేజీఎఫ్ 2 చిత్రానికి ఒక వింటేజ్ సూపర్ హిట్ సాంగ్‌ను రీమిక్స్ చేశారని తెలుస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, ధర్మేంద్ర కలిసి నటించిన షోలే సినిమాలోని ‘మెహబూబా.. మెహబూబా’ సాంగ్. ఈ సాంగ్ చిత్రీకరణ కూడా హైదరాబాద్‌లో జరిగినట్లు గుసగుసలు వస్తున్నాయి. ‘KGF చాప్టర్ 1′ దేశవ్యాప్తంగా 2018 విడుదలైంది. ఈ చిత్రాన్ని కన్నడ, హిందీ, మలయాళం, తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేశారు. ఈ చిత్రం భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. కేజీఎఫ్ చాప్టర్-2 కూడా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నాడు.
Read Also.. Mohan Babu: ఇక మోహన్‌బాబుదేనా ఇండస్ట్రీ పెద్దన్న పాత్ర ?? లైవ్ వీడియో