Tollywood: అయ్యారే.. కేరింత మూవీలో నటించిన ఈ అమ్మాయి ఇప్పుడు.. మతి పోగొట్టేలా..
2015లో వచ్చిన కేరింత మూవీ మంచి హిట్ అయింది. ముఖ్యంగా యూత్‌కు బాగా కనెక్ట్ అయింది. మూవీలో భావన పాత్ర చేసిన అమ్మాయి ఎవరో గుర్తుందా… తన పేరు సుకృతి అంబటి. ఆ అమ్మాయి నటనకు మంచి మార్కులు పడ్డాయి. తను ఇప్పుడు ఏం చేస్తుంది.. ఎలా ఉంది.. తెలుసుకుందాం పదండి...

సినిమాలో విషయం ఉంటే చాలు ఎలాంటి బేదాలు లేకుండా ఈ చిత్రాన్ని అక్కున చేర్చుకుంటారు తెలుగు జనాలు. అందులో పాత్రధారులు తెలియకపోయినా.. ఎంకరేజ్ చేస్తారు. మాకు కావాల్సింది మంచి సినిమా బై అన్నది తెలుగు ఆడియెన్స్ వెర్షన్. అలానే గప్ చుప్‌గా రిలీజై సంచలన విజయాలు సాధిస్తాయి కొన్ని చిత్రాలు. ముఖ్యంగా యువతను మెప్పించే సినిమాలకు సక్సెస్ రేట్ ఉంటుంది. అందుకే నిర్మాత దిల్ రాజు ఆ జోనర్ సినిమాలనే ఎంకరేజ్ చేస్తారు. పెద్ద హీరోలతో హై రేంజ్ సినిమాలు తీస్తూ కూడా.. మరోవైపు చిన్న కథలతో సర్‌ప్రైజ్ చేస్తుంటారు. ఆయన తీసిన అలాంటి ఓ హిట్ చిత్రం.. కేరింత. సాయి కిరణ్ అడవి దర్శకుడు. ఈ మూవీలో విశ్వంత్ దుడ్డుంపూడి, సుమంత్ అశ్విన్, పార్వతీశం, తేజస్వి మదివాడ, సుకృతి అంబటి, శ్రీదివ్య ప్రధాన పాత్రల్లో నటించారు.
యువతీ యువకుల మధ్య బాండింగ్, స్నేహం, ప్రేమ అంశాలను హైలెట్ చేస్తూ ఈ సినిమాను తీశారు. ఈ సినిమాలో మిక్కి జే మేయర్ అందించిన సంగీతం కూడా బాగుంటుంది. ఇక ఈ చిత్రంలో పార్వతీశంకు జోడీగా నటించిన అమ్మాయి గుర్తుందా.? ఆమె పేరు సుకృతి అంబటి.
కేరింత తర్వాత పెద్ద సినిమాలు ఏం చేయలేదు. మ్యారేజ్ చేసుకుని సెటిల్ అయిపోయింది. కేరింత మూవీలో ఆమె చేసిన భావన పాత్ర అందరికీ గుర్తుండుపోతుంది. కాగా చిన్నతనంలోనే తల్లి మరణించడంతో తండ్రి పెంపకంలోనే పెరిగిన సుకృతి.. ఢిల్లీలోని కులచి హన్స్ రాజ్ స్కూల్లో చదివింది. రాజస్థాన్‌లోని బనస్థలి యూనివర్సిటీలో ఇంజనీరింగ్. ఇండస్ట్రీకి దూరంగా ఉన్నా, సోషల్ మీడియాలో మాత్రం చాలా ఫోటోలు షేర్ చేస్తూ ఫాలోవర్స్‌కు టచ్‌లోనే ఉంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి