AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Shahana Death: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు.. అనుమానాలకు దారితీస్తున్న నటి మరణం

కేరళకు చెందిన ప్రముఖ మోడల్‌ , నటి షహానా(Shahana) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. కాసర్‌ఘడ్‌ లోని తన నివాసంలో షహానా మృతదేహం ఉరి వేసుకున్న స్థితిలో కన్పించింది.

Shahana Death: పుట్టినరోజే తిరిగిరాని లోకాలకు.. అనుమానాలకు దారితీస్తున్న నటి మరణం
Shahana Death
Rajeev Rayala
|

Updated on: May 13, 2022 | 7:01 PM

Share

కేరళకు చెందిన ప్రముఖ మోడల్‌ , నటి షహానా(Shahana) అనుమానాస్పద స్థితిలో చనిపోయారు. కాసర్‌ఘడ్‌ లోని తన నివాసంలో షహానా మృతదేహం ఉరి వేసుకున్న స్థితిలో కనిపించింది. అయితే ఇది ముమ్మాటికి హత్యేనని ఆమె బంధువులు ఆరోపిస్తున్నారు. షహానాను భర్త సజ్జద్‌ హత్య చేసినట్టు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. షహానాకు గత ఏడాది పెళ్లయ్యింది. 20 ఏళ్ల చిన్న వయస్సు లోనే ఆమో మోడలింగ్‌ రంగంలో టాప్‌గా నిలిచింది. భర్త నుంచి తనకు ప్రాణహానీ ఉందని చాలాసార్లు పేరంట్స్‌కు ఫిర్యాదు చేశారు షహానా. సజ్జద్‌ను పోలీసులు విచారిస్తున్నారు. గత కొంతకాలంగా ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు ఉన్నట్టు తెలుస్తోంది . షహానాను చాలా కాలం నుంచి భర్త సజ్జద్‌ చిత్రహింసలు పెట్టినట్టు కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. షహానా ఇంట్లో పోలీసులు తనిఖీలు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు.

షహానా మృతి పై పోలీసులు మాట్లాడుతూ.. ‘షహానా ఓ తమిళసినిమాలో నటించినందుకు ఆమెకు పారితోషికం వచ్చింది. ఆ డబ్బు గురించి భార్యాభర్తల మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. అలాగే షహానా బర్త్‌డే రోజు కూడా సజ్జద్‌ ఆలస్యంగా రావడంతో మరోసారి తీవ్రస్థాయిలో గొడవపడ్డారు. ఆ తర్వాత బాత్రూమ్‌లో ఆమె శవమై కనిపించింది. ఇది హత్యా? ఆత్మహత్యా? అన్నది విచారిస్తున్నాం’ అని తెలిపారు పోలీసులు. అత్తింట్లో వేధింపులు భరించలేక కొద్ది రోజుల క్రితమే ఇంటి నుంచి బయటకు వచ్చేసి భర్తతో కలిసి అద్దెంట్లో నివసిస్తోంది షహానా. ఇదే సమయంలో ఆమె మృతి చెందడం పలు అనుమానాలకు దారితీస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

ఇవి కూడా చదవండి

Hebah Patel: క్లాస్ లుక్ లో హెబ్బా పటేల్.. చూడముచ్చటగా ఉందంటున్న ఫ్యాన్స్

Bhala Thandhanana: విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి.. భళ తందనాన స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Anasuya Bharadwaj: ఖతర్నాక్ ఫోజులతో కవ్విస్తున్న అను.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
గోల్డ్‌ లవర్స్‌కి బ్యాడ్‌ న్యూస్‌! ఆల్‌టైమ్ హైకి చేరుకున్న బంగారం
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.
రజినీకాంత్‏తో బ్లాక్ బస్టర్.. సైడ్ క్యారెక్టర్స్ మాత్రమే వచ్చాయి.