AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Khaidi Sequel: కార్తీ సూపర్ హిట్ ‘ఖైదీ’ సినిమా సీక్వెల్ లో ఆ స్టార్ హీరో కూడా..

తమిళ్ స్టార్ హీరో కార్తీ సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. సినిమా చేస్తూ మెప్పిస్తున్నాడు.

Khaidi Sequel: కార్తీ సూపర్ హిట్ 'ఖైదీ' సినిమా సీక్వెల్ లో ఆ స్టార్ హీరో కూడా..
Khaidi Movie
Rajeev Rayala
|

Updated on: May 13, 2022 | 4:30 PM

Share

తమిళ్ స్టార్ హీరో కార్తీ(Karthi) సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ బిగినింగ్ నుంచి విభిన్నమైన కథలను ఎంచుకుంటూ.. సినిమా చేస్తూ మెప్పిస్తున్నాడు. ఈ క్రమంలోనే కార్తీ నుంచి వచ్చిన ఖైదీ(Khaidi) సినిమా మంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. తమిళంతో పాటు తెలుగులో కూడా ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో సీక్వెల్ చేయాలని ప్లాన్ చేశారు. ఖైదీ సినిమాకు దర్శకత్వం వహించిన లోకేష్ కనగరాజ్ సీక్వెల్ పనులు మొదలు పెట్టాడు. ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ బడ్జెట్ లో సింగిల్ కాస్ట్యూమ్ తో హీరోయిన్ , పాటలు లేకుండా వచ్చిన ఖైదీ సినిమా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. దాంతో ఈ సినిమా సీక్వెల్ పై ఆసక్తి పెరిగింది. తాజాగా ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించిన ఓ ఇంట్రస్టింగ్ వార్త కోలీవుడ్ లో చక్కర్లు కొడుతోంది.

ఖైదీ సినిమా  సీక్వెల్ లో కార్తీ బ్రదర్ హీరో సూర్య కూడా నటించనున్నాడని టాక్ వినిపిస్తుంది. ఖైదీ’ సినిమాను నిర్మించిన ఎస్.ఆర్.ప్రభు ఈ సీక్వెల్ ను కూడా నిర్మించనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. సూర్య – కార్తి కలిసి ఈ హిట్ మూవీ సీక్వెల్లో నటిస్తే మరింత క్రేజ్ పెరుగుతుందని భావిస్తున్నారు.ఖైదీ సీక్వెల్ లో ఒక పాత్ర కీలకంగా ఉంటుందట. ఆ పాత్రను సూర్య తో చేయిస్తే బాగుంటుందని దర్శకుడు భావిస్తున్నాడట. ఇదే విషయాన్నీ సూర్య చెప్పడంతో ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని తెలుస్తుంది. వచ్చే నెల 3 న విడుదల కాబోతున్న విక్రమ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో ఉన్న లోకేష్ కనగరాజ్ జులై లోనే ఖైదీ సీక్వెల్ ను పట్టాలెక్కిస్తాడనే వార్తలు వస్తున్నాయి. Karthi Surya

మరిన్ని ఇక్కడ చదవండి : 

ఇవి కూడా చదవండి

Hebah Patel: క్లాస్ లుక్ లో హెబ్బా పటేల్.. చూడముచ్చటగా ఉందంటున్న ఫ్యాన్స్

Bhala Thandhanana: విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి.. భళ తందనాన స్ట్రీమింగ్ ఎప్పుడంటే..

Anasuya Bharadwaj: ఖతర్నాక్ ఫోజులతో కవ్విస్తున్న అను.. లేటెస్ట్ ఫోటోస్ వైరల్

ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
ఆ క్రికెట్ ఆడితేనే ఒప్పుకుంటా..వైభవ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?
మీ ఇంట్లో ఉండే బెడ్‌షీట్‌ ఎన్ని రోజులకు మార్చాలో తెలుసా?
కొడుకు బూతు పాటపై వివాదం.. స్పందించిన నటుడు ప్రభాకర్..
కొడుకు బూతు పాటపై వివాదం.. స్పందించిన నటుడు ప్రభాకర్..
పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు
పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..46 పరుగులకే 4 కీలక వికెట్లు
ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా?.. ఈ బెనిఫిట్స్ తెలుసుకోవాల్సిందే
ఇంట్లో పిల్లిని పెంచుతున్నారా?.. ఈ బెనిఫిట్స్ తెలుసుకోవాల్సిందే
రూ. 34 వేల జీతం వచ్చే వ్యక్తి నెలకు ఎంత SIP పెట్టొచ్చు.!
రూ. 34 వేల జీతం వచ్చే వ్యక్తి నెలకు ఎంత SIP పెట్టొచ్చు.!
'ఆ తాగుబోతు అలా ప్రవర్తించడంతో'.. విశాల్‌ ప్రేయసి కామెంట్స్ వైరల్
'ఆ తాగుబోతు అలా ప్రవర్తించడంతో'.. విశాల్‌ ప్రేయసి కామెంట్స్ వైరల్
ఫ్లాపుల నుంచి బయటపడడానికి పెద్ద ప్లానే వేసిన మెగా ప్రిన్స్
ఫ్లాపుల నుంచి బయటపడడానికి పెద్ద ప్లానే వేసిన మెగా ప్రిన్స్
దేశంలో 4 రకాల హిందువులు ఉన్నారుః మోహన్ భగవత్
దేశంలో 4 రకాల హిందువులు ఉన్నారుః మోహన్ భగవత్
ఇక ఎటువంటి హామీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు..
ఇక ఎటువంటి హామీ లేకుండా రూ.20 లక్షల వరకు రుణాలు..