Keerthy Suresh: గోల్డెన్ హార్ట్.. మంచి మనసు చాటుకున్న కీర్తిసురేష్.. ఏం చేసిందంటే
ఇప్పటికే కొంతమంది ప్రత్యక్షంగా మరికొంతమంది పరోక్షంగా సేవాకార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ సమయంలో చిత్రయూనిట్ కు గోల్డ్ కాయిన్స్ పంచిన విషయం తెలిసిందే.
సినిమా తారలు కేవలం సినిమాలతోనే కాదు సేవ కార్యక్రమాలతో కూడా పాపులారిటీ సొంతం చేసుకుంటూ ఉంటారు. ఇప్పటికే కొంతమంది ప్రత్యక్షంగా మరికొంతమంది పరోక్షంగా సేవాకార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఇదిలా ఉంటే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప షూటింగ్ సమయంలో చిత్రయూనిట్ కు గోల్డ్ కాయిన్స్ పంచిన విషయం తెలిసిందే. ఆతర్వాత సూపర్ స్టార్ రజినీకాంత్, అలాగే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా షూటింగ్ మెంబర్స్ కు గిఫ్ట్ లు ఇచ్చి సర్ ప్రైజ్ చేశారు. తాజాగా అందాల భామ కీర్తిసురేష్ కూడా మంచి మనసు చాటుకుంది. షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఆ షూటింగ్ లో పాల్గొన్న వారికి గోల్డ్ కాయిన్స్ పంచి పెట్టింది. సినిమా కోసం షూటింగ్ లో కార్మికులు పడే కష్టానికి కీర్తి సురేష్ గుర్తించి వారికి ఇలా గోల్డ్ కాయిన్స్ ఇచ్చి ఆనందపరిచింది .
కీర్తిసురేష్ ప్రస్తుతం నేచురల్ స్టార్ నాని తో కలిసి సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దసరా అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తయ్యింది. సింగరేణి నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నాని మాస్ పాత్రలో కనిపించనుండగా.. కీర్తి డీ గ్లామర్ రోల్ చేస్తోంది.
ఇక ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన సందర్భంగా సినిమా కోసం పనిచేసిన 130 మంది స్టాఫ్ కు ఒక్కొక్కరికీ 2 గ్రాముల బంగారు నాణాలను పంచింది. ఇందుకోసం ఆమె ఏకంగా రూ.13 లక్షలు ఖర్చు చేసిందని తెలుస్తోంది. దాంతో కీర్తిసురేష్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు అందరు.