AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Keerthy Suresh: స్టార్ హీరో బ్యానర్‌‌‌‌లో నటిస్తున్న కీర్తి సురేష్.. హీరో మాత్రం అతడుకాదంట..

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం..

Keerthy Suresh: స్టార్ హీరో బ్యానర్‌‌‌‌లో నటిస్తున్న కీర్తి సురేష్.. హీరో మాత్రం అతడుకాదంట..
Rajeev Rayala
|

Updated on: Aug 16, 2021 | 10:08 PM

Share

Keerthy Suresh : ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ ఎవరు అంటే ముందుగా గుర్తొచ్చే పేరు కీర్తి సురేష్. నేను శైలజ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ఈ చిన్నది. ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌‌‌గా మారిపోయింది. చేసింది తక్కువ సినిమాలే అయినప్పటికీ మంచి క్రేజ్‌‌‌‌ను సొంతం చేసుకుంది ఈ బ్యూటీ. నేను శైలజ సినిమా తర్వాత కీర్తికి తెలుగులో ఆఫర్లు క్యూ కట్టాయి. ఇక మహానటి సినిమాతో ఒక్కసారిగా స్టార్ రేంజ్‌‌‌కు చేరుకుంది. సావిత్రి జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి నటన అద్భుతమనే చెప్పాలి. ఈ సినిమాతో జాతీయ స్థాయి గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఆ తర్వాతవరుసగా స్టార్ హీరోల సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. తెలుగు, తమిళ్, మలయాళ భాషల్లో ఈ అమ్మడు బిజీ హీరోయిన్‌‌‌గా మారిపోయింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న సర్కారు వారి పాట సినిమాలో హీరోయిన్‌‌‌గా నటిస్తుంది ఈ చిన్నది.

ఇక తమిళ్‌‌‌లో ఈ బ్యూటీకి యమ క్రేజ్ ఉంది. ఇప్పటికే రజనీకాంత్ నటిస్తున్న ‘అన్నాత్తే’ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ క్రమంలో కీర్తి సురేశ్‌‌‌కి తాజాగా తమిళంలో మరో అవకాశం వచ్చిందని తెలుస్తోంది. స్టార్ హీరో సూర్య నిర్మిస్తున్న సినిమాలో కీర్తి హీరోయిన్‌‌‌‌గా ఛాన్స్ దక్కించుగుకుందని తెలుస్తోంది. సూర్య సొంత చిత్ర నిర్మాణ సంస్థ అయిన 2డి ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ నిర్మిస్తున్న చిత్రంలో కీర్తిని హీరోయిన్‌‌‌గా ఎంపిక చేశారట. ఇక హీరోగా అధర్వ  నటిస్తుండగా జాతీయ ఉత్తమ దర్శకుడు అవార్డు గ్రహీత బాల ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారని తెలుస్తోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Chiranjeevi : మీ పోరాటాలకు,త్యాగాలకు ఎప్పుడూ రుణపడి ఉంటాం.. మెగాస్టార్ ఎమోషన్ ట్వీట్

Partition On Film Screen: భారతీయ హృదయాలను తాకిన విభజనపై వచ్చిన ఐదు సినిమాలు.. అలనాటి మరుపురాని చిత్రాలు..

MAA Elections 2021: నటి హేమకు ఊరట.. హెచ్చరించి వదిలేసిన క్రమశిక్షణ కమిటీ.. మరోసారి రిపీట్ అయితే..