మరోసారి మెగాస్టార్- నటసింహం మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదా.. పోటీకి సై అంటున్న సినిమాలు..

మరోసారి మెగాస్టార్- నటసింహం మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదా.. పోటీకి సై అంటున్న సినిమాలు..

కరోనా సెకండ్ వేవ్ తరవాత సినిమా ఇండస్ట్రీ ఊపందుకుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా సినిమాల రీలిజ్‌‌‌లు ఆగిపోయాయి...

Rajeev Rayala

|

Aug 16, 2021 | 10:07 PM

acharya and akhanda: కరోనా సెకండ్ వేవ్ తరవాత సినిమా ఇండస్ట్రీ ఊపందుకుంది. కరోనా లాక్ డౌన్ కారణంగా చాలా సినిమాల రీలిజ్‌‌‌లు ఆగిపోయాయి. మరికొన్ని సినిమాల షూటింగ్‌‌లకు బ్రేక్ లు పడ్డాయి. ఇక ఇప్పుడు కరోనా ప్రభావం తగ్గడంతో సినిమాలన్నీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే చిన్న సినిమాలు ఒకొక్కటిగా విడుదలవుతుండగా.. పెద్ద సినిమాలన్నీ మంచి రోజులు చేసుకుంటున్నాయి. మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య , నట సింహం బాలయ్య నటిస్తున్న అఖండ సినిమాలు కూడా రిలీజ్‌‌‌కు రెడీగా ఉన్నాయి. అయితే ఈ రెండు సినిమాలు ఒకే సారి రిలీజ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరో సార్ బాలకృష్ణ -చిరంజీవి మధ్య బాక్సాఫీస్ వార్ ఉండనుందని తెలుస్తుంది.

మెగాస్టార్ చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ప్రస్తుతం ఈ షూటింగ్ క్లైమాక్స్‌‌‌‌కు చేరుకుందని తెలుస్తుంది. మరో వైపు బాలకృష -బోయపాటి కాంబినేషన్‌‌లో తెరకెక్కుతున్న అఖండ సినిమా కూడా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఉంది. ఈ సినిమా ప్రస్తుతం చివరి దశకు వచ్చేసింది. త్వరలోనే అఖండ షూటింగ్ కు గుమ్మడికాయ కొట్టనున్నారు చిత్రయూనిట్. ఇప్పుడు ఈ రెండు సినిమాలు దసరాను టార్గెట్ చేసినట్టు సమాచారం. దసరా.. దీపావళి.. సంక్రాంతికి విడుదల తేదీలను కొన్ని సినిమాలు ఇప్పటికే ఫిక్స్ చేసుకోవడంతో అఖండ, ఆచార్య  విడుదల ఎప్పుడనేది ఆసక్తికరంగా మారింది. అయితే అక్టోబర్ 8 వ తేదీన ‘అఖండ’ను … అక్టోబర్ 13వ తేదీన ‘ఆచార్య’ను విడుదల చేసే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. దాంతో మరోసారి చిరు- బాలయ్య మధ్య బాక్సాఫీస్ వార్ జరిగే అవకాశం కనిపిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Keerthy Suresh: స్టార్ హీరో బ్యానర్‌‌‌‌లో నటిస్తున్న కీర్తి సురేష్.. హీరో మాత్రం అతడుకాదంట..

Allu Sirish: ‘అయ్యో ఏమైంది బ్రో.. ప్రేమలో వెనుకడుగు వేయకూడదు’… అభిమానిని ఓదార్చిన అల్లు శిరీష్‌.

 

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu