Nithiin’s Maestro: గన్ పట్టుకొని కిల్లర్ లేడీగా మారిన మిల్కీ బ్యూటీ.. మాస్ట్రో నుంచి న్యూ పోస్టర్..

యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాస్ట్రో సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే చెక్, రంగ్ దే సినిమాలతో పేక్షకుల ముందుకు

Nithiin's Maestro: గన్ పట్టుకొని కిల్లర్ లేడీగా మారిన మిల్కీ బ్యూటీ.. మాస్ట్రో నుంచి న్యూ పోస్టర్..
Nithin '
Follow us
Rajeev Rayala

|

Updated on: Aug 15, 2021 | 1:19 PM

Nithiin’s Maestro: యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం మాస్ట్రో సినిమాతో రావడానికి సిద్దమవుతున్నాడు. ఇప్పటికే చెక్, రంగ్ దే సినిమాలతో పేక్షకుల ముందుకు వచ్చిన నితిన్.. ఇప్పుడు ఓ బాలీవుడ్ రీమేక్‌‌‌తో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధం అవుతున్నాడు. హిందీలో మంచి విజయాన్ని అందుకున్న థ్రిల్లర్ మూవీ ‘అంధాధూన్’ పలు భాషల్లో రీమేక్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు మాస్ట్రోగా తెలుగులో రానుంది. మేర్లపాక గాంధీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలున్నాయి. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, పాటలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌‌‌లో విడుదలకు సిద్ధంగా ఉంది. OTTలో విడుదల తేదీని త్వరలోనే ప్రకటించనున్నారు. ఇక ఈ సినిమాలో హీరోయిన్‌‌గా ఇస్మార్ట్ బ్యూటీ నభా నటేష్ నటిస్తుండగా మరో కీలక పాత్రల్లో మిల్కీ బ్యూటీ తమన్నా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుంచి తమన్నా లుక్‌‌‌‌ను రిలీజ్ చేశారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా చిత్ర బృందం నితిన్ -తమన్నాల కొత్త పోస్టర్‌‌‌ను విడుదల చేసింది. నితిన్ గ్రే బ్లేజర్ ధరించి సన్ గ్లాసెస్‌‌‌లో స్టైలిష్‌‌‌గా కనిపిస్తుండగా.. తమన్నా గన్ పట్టుకొని కనిపిస్తోంది. ఇప్పుడు ఈ  పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి మహతి స్వర సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.ఎన్‌. సుధాకర్‌రెడ్డి, నిఖితారెడ్డిలు నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఠాగూర్ మధు సమర్పించనున్నారు. నితిన్ కెరీర్లో ఇదే పూర్తిస్థాయి ప్రయోగాత్మక చిత్రం.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Keerthy Suresh: స్టార్ హీరో బ్యానర్‌‌‌‌లో నటిస్తున్న కీర్తి సురేష్.. హీరో మాత్రం అతడుకాదంట..

Allu Sirish: ‘అయ్యో ఏమైంది బ్రో.. ప్రేమలో వెనుకడుగు వేయకూడదు’… అభిమానిని ఓదార్చిన అల్లు శిరీష్‌.

మరోసారి మెగాస్టార్- నటసింహం మధ్య బాక్సాఫీస్ వార్ తప్పదా.. పోటీకి సై అంటున్న సినిమాలు..