MAA Elections 2021: నటి హేమకు ఊరట.. హెచ్చరించి వదిలేసిన క్రమశిక్షణ కమిటీ.. మరోసారి రిపీట్ అయితే..
మా పంచాయితీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గొడవలు విమర్శలతో నానా రచ్చ చేస్తున్నారు మా సభ్యులు. మా అధ్యక్ష పదవి కోసం ఐదుగురు సభ్యులు..
MAA Elections 2021: మా పంచాయితీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు గొడవలు విమర్శలతో నానా రచ్చ చేస్తున్నారు మా సభ్యులు. మా అధ్యక్ష పదవి కోసం ఐదుగురు సభ్యులు పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే నటి హేమ చేసిన ఆరోపణలు మా లో పెద్ద దుమారాన్నే రేపాయి. హేమ సంచలన విమర్శలు.. ఆరోపణలు చేయటం.. అందుకు సంబంధించిన ఆడియో క్లిప్ ఒకటి బయటకు రావటం తెలిసిందే. మా నిధులను కొందరు దుర్వినియోగం చేశారంటూ హేమ ఆరోపణలు చేశారు. దీన్ని సభ్యులు, సినీ పెద్దలు సైతం ఖండించారు. `మా` ప్రతిష్టని దెబ్బతీసే విధంగా బహిరంగంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకోవాలని మెగాస్టార్ చిరంజీవి కూడా కృష్ణంరాజుకు లేఖ రాసారు. ఈ క్లిప్ మీద ‘మా’ ప్రస్తుత అధ్యక్షుడు నరేశ్.. కార్యదర్శి జీవితా రాజశేఖర్‌లు కలిసి క్రమశిక్షణ కమిటీకి కంప్లైంట్ ఇచ్చారు. దీనిసై స్పందించి.. ‘మా’ అసోసియేషన్ బైలాస్‌లో సెక్షన్ 8 కింద హేమకు నోటీసులు జారీ అయ్యయి.
ఈ నేపథ్యంలో నటి హేమపై చర్యలు తీసుకుంటారని అంతా అనుకున్నారు. కానీ . క్రమశిక్షణ సంఘం నుంచి హేమ్‌కి ఓ రకంగా ఊరట లభించిందని చెప్పొచ్చు. ఇదే మొదటి తప్పిదంగా హేమని హెచ్చరిస్తూ ఆమెపై ఎలాంటి క్రమశిక్షణ చర్యలు తీసుకోలేదని తెలుస్తుంది. డీఆర్‌సీ కోరినట్లుగా హేమ తన వివరణను ఇవ్వగా.. ఆ వివరణకు సంతృప్తి చెందని డీఆర్‌సీ ఇది ఆమె మొదటి తప్పుగా భావించి వదిలేస్తున్నామని, మరోసారి రిపీట్ అయితే మాత్రం కఠిన చర్యలు తప్పవని హెచ్చరించిందని తెలుస్తోంది.
మరిన్ని ఇక్కడ చదవండి :