Tollywood: ఆ తెలుగు హీరో ఫోటోని రెండున్నరేళ్లు డీపీగా పెట్టుకున్న కార్తీ.. ఎందుకంటే
సూర్య, కార్తీలు తమిళ హీరోలు అని కూడా చాలామందికి తెలీదు. వారిని మనవాళ్లు అంతలా ఓన్ చేసుకున్నారు. వారి సినిమాలు కొన్ని అక్కడ ఫ్లాప్ అయినప్పటికీ ఇక్కడ హిట్ అయ్యాయి. వారు కూడా తెలుగు ప్రజలపై అంతే అభిమానాన్ని కలిగి ఉంటారు. అయితే హీరో కార్తీ ఓ అరుదైన విషయాన్ని పంచుకున్నారు.

నటుడు కార్తీ తన సినిమా సిరుతై (విక్రమార్కుడు తమిళ రీమేక్) వెనుక ఉన్న ఆసక్తికరమైన అనుభవాలను పంచుకున్నారు. విక్రమార్కుడు చిత్రాన్ని మొదటిసారి చూసినప్పుడు, దానిని డెఫినిట్‌గా చేయాలని తనకు ఆత్మవిశ్వాసం వచ్చిందని కార్తీ తెలిపారు. ఈ పాత్రలోకి ప్రవేశించడానికి, ఆయన రవితేజ విక్రమార్కుడు లుక్‌ను తన ఫోన్‌లో రెండన్నరేళ్లు డిస్‌ప్లే పిక్చర్‌గా ఉంచుకున్నానని వెల్లడించారు. ఈ చిత్రం చేయడం తనకు కాస్త భయంగా ఉన్నప్పటికీ, ఎంతో ఆనందించానని కార్తీ పేర్కొన్నారు. విక్రమార్కుడు చిత్రాన్ని తమకు అందించినందుకు రాజమౌళికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. సిరుతై చిత్రం తమిళంలో ఘన విజయం సాధించిందని కార్తీ గుర్తు చేసుకున్నారు.
ఇదే సందర్భంగా తన రీమేక్ చిత్రాలు తమిళనాడులో గతంలో అంతగా ఆడనప్పటికీ, సిరుతై మొదటిసారి అక్కడ విజయవంతం కావడంతో తన చిత్రాలు అక్కడ కూడా ఆడతాయని తనకు నమ్మకం కలిగిందని అన్నారు దర్శకుడు రాజమౌళి. ఈ విజయం తనకు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందని, కార్తీకి థ్యాంక్స్ చెప్పారు. కాగా విక్రమార్కుడు సంచలన విజయాన్ని నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా విడుదలైన ప్రతి భాషలోనూ భారీ విజయాన్ని తెచ్చిపెట్టింది. రవితేజ కెరీర్‌లో ఇది బెస్ట్ హిట్ అని చెప్పుకోవాలి. చిత్రాన్ని తెరకెక్కించిన రాజమౌళికి కూడా ఈ చిత్రం చాలా ఇష్టం.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..
