AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Karate Kalyani: దేవీకి శిక్ష తప్పదు.. అవసరమైతే యుద్ధం చేస్తాం.. సీరియన్ వార్నింగ్ ఇచ్చిన కరాటే కళ్యాణి

ఇప్పటికే 'ఇదేం హరే రామ' అంటూ.. కరాటే కళ్యాణీ ఆయనపై.. ఆయన పాటపై వివాదం చెలరేగేలా చేసిన క్రమంలో... ఆ వివాదంపై బీజేపీ నాయకులు కూడా స్పందిస్తున్నారు. దేవుడిపై దేవీ తీరును తప్పుబడుతూ..

Karate Kalyani: దేవీకి శిక్ష తప్పదు.. అవసరమైతే యుద్ధం చేస్తాం.. సీరియన్ వార్నింగ్ ఇచ్చిన కరాటే కళ్యాణి
Devi Sri Prasad, Karate Kal
Rajeev Rayala
|

Updated on: Nov 04, 2022 | 5:43 PM

Share

దేవీ శ్రీ ప్రసాద్ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.. దేవీ శ్రీ ప్రసాద్‌ను దేవుడు విడిచిపెట్టాలనుకున్నా… ఆయన భక్తులు మాత్రం ఇప్పట్లో విడిచిపెట్టేలా కనిపించడం లేదు. ఇప్పటికే ‘ఇదేం హరే రామ’ అంటూ.. కరాటే కళ్యాణీ ఆయనపై.. ఆయన పాటపై వివాదం చెలరేగేలా చేసిన క్రమంలో… ఆ వివాదంపై బీజేపీ నాయకులు కూడా స్పందిస్తున్నారు. దేవుడిపై దేవీ తీరును తప్పుబడుతూ.. సీరియస్ వార్నింగ్ ఇస్తున్నారు. ఇక తాజాగా బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణు వర్ధన్‌ రెడ్డి.. కూడా దేవీ శ్రీ ప్రసాద్‌ పై తీరుపై మండిపడ్డారు. ఇదిలా ఉంటే ఇప్పుడు కరాటే కళ్యాణి ఇచ్చిన కంప్లెయింట్ ఆధారంగా పోలీసులు దేవీ శ్రీ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. దీని పై ఇప్పటివరకు దేవీశ్రీ అయితే స్పందించలేదు కానీ కరాటే కళ్యాణి మాత్రం ఈ విషయాన్నీ వదిలేది లేదు అంటున్నారు. తాజాగా ఆమె మాట్లాడుతూ..

హిందువుల మనోభావాలు కించ పరిచే విధంగా గా ఉంది పరి అనే పాట. అసభ్యకరంగా గా ఉన్న బట్టలు వేసుకొని, రామ కృష్ణ అనే పదాలను పిచ్చిపిచ్చి పాటలాగా పాడుతూ డాన్స్ చేయడం అభ్యంతరకరం అని ఆమె అన్నారు. ఈ విషయమై దేవిశ్రీప్రసాద్ ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశాం అయినా స్పందించలేదు. దేవి శ్రీ ప్రసాద్ మీద 153A,295A నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. నాతో పాటు చాలా హిందూ సంఘాలు ఈ పాట మీద ఆగ్రహంగా ఉన్నాయి. మేమంతా కలిసి దేవి శ్రీ ప్రసాద్ మీద యుద్ధానికి సిద్ధంగా ఉన్నాం అని కరాటే కళ్యాణి అన్నారు.

అలాగే దేవి శ్రీ ప్రసాద్ హిందువులకి క్షమాపణలు చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు. ఇక ఈ కేసులో దేవి శ్రీ ప్రసాద్ కి శిక్ష తప్పదు. ఇంతకుముందు కూడా ఒక పాటలో కూడా ఇలాగే ఇష్టం వచ్చినట్టు చేశారు. దేవిశ్రీప్రసాద్ పోకడ చూస్తుంటే మతం మార్చుకొని కావాలని ఇదంతా చేస్తున్నాడా అనే అనుమానం కలుగుతుందని ఆమె అన్నారు. అలాంటిది ఏమైనా ఉంటే చెప్పండి. హిందువులలో ఇప్పుడు చాలా చైతన్యం వచ్చింది. ఇంతకుముందు పాటల్లో కూడా ఇలాంటివి జరిగాయి కానీ అప్పుడు హిందువుల్లో ఇంత చైతన్యం లేదు అంటూ కరాటే కళ్యాణి చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..