Kantara: కొనసాగుతున్న కాంతార హవా.. మరో అరుదైన రికార్డు సొంతం చేసుకున్న మూవీ
కన్నడ ఇండస్ట్రీ హీరో రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది.
ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ గా వినిపిస్తోన్న సినిమా కాంతార. చిన్న సినిమాగా వచ్చి సంచలన హిట్ గా నిలిచింది ఈ మూవీ. కన్నడ ఇండస్ట్రీ హీరో రిషబ్ శెట్టి హీరోగా దర్శకుడిగా వ్యవహరించిన ఈ సినిమా విడుదలైన అన్ని భాషల్లో మంచి విజయాన్ని అందుకుంది. అంతే కాదు 16 కోట్లతో తెరకెక్కిన ఈ సినిమా ఇప్పుడు 300కోట్లకు పైగా వసూల్ చేసింది. అలాగే చాలా రికార్డులను కాంతార సినిమా బ్రేక్ చేసింది. ఐఏండిబి భారతదేశంలోని ప్రస్తుత టాప్ 250 చిత్రాల జాబితాలో కాంతార మొదటి స్థానంలో నిలిచింది. కన్నడలో రిలీజ్ తరువాత దాదాపు 15 రోజులకు ఇతర భాషల్లో విడుదలైన ఈ సినిమా అన్ని చోట్ల తన సత్తాను చాటుకుంది.
యావత్ దేశ వ్యాప్తంగా ఉన్న సెలబ్రిటీలు కాంతార చిత్రంపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. సినీ పరిశ్రమతో పాటు రాజకీయ నాయకులు సైతం ఈ సినిమాను వీక్షిస్తూ చిత్ర యూనిట్‌ను ప్రశంసిస్తున్నారు.. ఈ సినిమా తర్వాత కర్ణాటక ప్రభుత్వం 60 ఏళ్లు పైబడిన ‘దైవ నర్తకుల’కి నెలవారీ పెన్షన్ రూ. 2,000 ప్రకటించింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ సినిమా మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది.
క్క కర్ణాటకలోనే కోటికి పైగా టిక్కెట్లు అమ్ముడైనట్టుగా చెబుతూ, మేకర్స్ ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. కన్నడిగుల సంప్రదాయమైన భూత కోల ఆచారం నేపథ్యంలో ఎంతో ఆసక్తికరంగా కాంతార సినిమాను తెరకెక్కించారు. ఇక ఈ సినిమా రోజు రోజుకు క్రేజ్ పెంచుకుంటూ కలెక్షన్స్ సాధిస్తోంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి నటన హైలైట్ అనే చెప్పాలి.. వన్ మ్యాన్ షో గా ఈ సినిమాను అద్భుతంగా తెరకెక్కించడమే కాకుండా అదే రేంజ్ లో నటించి ఆకట్టుకున్నాడు.