Kannappa First Day Collections: తిన్నడుగా అదరగొట్టిన మంచు విష్ణు.. కన్నప్ప ఫస్ట్ డే కలెక్షన్ ఎంతంటే..
ప్రస్తుతం థియేటర్లలో విజయవంతంగా దూసుకుపోతున్న సినిమా కన్నప్ప. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్టుగా వచ్చిన ఈ సినిమాను మోహన్ బాబు నిర్మించారు. డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు అడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. జూన్ 27న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.

భారీ అంచనాల మధ్య విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న సినిమా కన్నప్ప. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో మోహన్ బాబు నిర్మించారు. రామాయణ్, మహాభారత వంటి సీరియల్స్ రూపొందించిన డైరెక్టర్ ముకేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఇందులో తమిళ్ బ్యూటీ ప్రీతి ముకుందన్ కథానాయికగా నటించారు. అలాగే ఇందులో ప్రభాస్, మోహన్ లాల్, మోహన్ బాబు, శరత్ కుమార్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ కీలకపాత్రలు పోషించారు. జూన్ 27న విడుదలైన ఈ సినిమాకు మొదటి నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే ఈ సినిమాలో ప్రతి ఒక్కరి యాక్టింగ్ అదిరిపోయిందని.. అలాగే బీజీఎమ్, సాంగ్స్ సినిమాలకు మరో హైలెట్ అయ్యాయి. ఇక క్లైమాక్స్ లో విష్ణు నటవిశ్వరూపం చూపించారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. ట్రేడ్ నివేదికల ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా మొదటి రోజు రూ.20 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం.కేవలం మన దేశంలోనే మొత్తం రూ.10 కోట్లకు పైగా వసూళ్లు వచ్చినట్లు సమాచారం. మంచు విష్ణు కెరీర్ లోనే అత్యధిక ఓపెనింగ్స్ రాబట్టిన సినిమా ఇదే అంటున్నారు. ఇక శనివారం, ఆదివారం ఈ రెండు రోజులు ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ డే కలెక్షన్స్ అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఈ చిత్రాన్ని అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ప్యాక్టరీ బ్యానర్స్ పై మోహన్ బాబు భారీ బడ్జెట్ తో నిర్మించారు. ఈ సినిమాను తెలుగుతోపాటు కన్నడ, తమిళం, మలయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషలలో రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాకు ప్రభాస్, మోహన్ లాల్ ఇద్దరు ఎలాంటి పారితోషికం తీసుకోలేదు. ఈ చిత్రాన్ని న్యూజిలాండ్ లో దాదాపు ఎనిమిది నెలలు చిత్రీకరించారు. మొత్తం 800 మంది సిబ్బంది ఈ చిత్రానికి వర్క్ చేసినట్లు సమాచారం.
#Kannappa emerges as an Industry Hit 💥An unstoppable saga of faith and power now ruling the silver screen! The divine has spoken — audiences have blessed it! 🙏
🎟️ Book Now: https://t.co/pc2g1Rrjtt
Har Har Mahadev 🔱Har Ghar Mahadev 🔥#KannappaInCinemas #KannappaMovie… pic.twitter.com/mEMmMbltgf
— AVA Entertainment (@avaentofficial) June 28, 2025
ఇవి కూడా చదవండి :
Tollywood: సినిమాలు వదిలేసి సన్యాసిగా మారిన హీరోయిన్.. కారణం ఇదేనట..








