AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోకేష్ కనగరాజ్ మాస్టర్ ప్లాన్.. ఖైదీ2 సినిమాలో స్టార్ హీరోయిన్ కూడా..

019 లో రిలీజై బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఖైదీ సినిమాలో హీరో పాత్ర పేరు ఢిల్లీ. ఈ పాత్రను అద్భుతంగా పోషించాడు కార్తీ. తన అసమాన్య నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. సినిమాకు కూడా భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇక డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. ఇలా ఎన్నో విశేషాలున్న ఖైదీ సినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తోంది.

లోకేష్ కనగరాజ్ మాస్టర్ ప్లాన్.. ఖైదీ2 సినిమాలో స్టార్ హీరోయిన్ కూడా..
Kaithi 2
Rajeev Rayala
|

Updated on: Jun 28, 2025 | 2:45 PM

Share

తమిళ్ టాలెంటెడ్ హీరో కార్తీ ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తమిళ్ ఆడియన్స్ కంటే తెలుగు ప్రేక్షకులే కార్తీని ఎక్కువ అభిమానిస్తారు. ఆయన నటించిన సినిమాలన్నీ తెలుగులోకి డబ్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా యుగానికొక్కడు సినిమాకు తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ సినిమాలో కార్తీ నటన చాల సహజంగా ఉంటుంది. ఆతర్వాత ఆవారా సినిమాతో అమ్మాయిల మనసు దోచేశాడు. ఇక హిట్లు ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తున్న కార్తీ త్వరలోనే నాని ప్రొడక్షన్ లో సినిమా చేయనున్నాడు. నాని నిర్మిస్తున్న హిట్ ఫ్రాంచెజ్ లో భాగంగా హిట్ 4 సినిమాలో కార్తీ హీరోగా నటిస్తున్నాడు. ఇటీవల విడుదలైన హిట్ 3 ఎండ్ ఓ కార్తీ హిట్ 4లో హీరో అని అనౌన్స్ చేశారు.

ఇది కూడా చదవండి : దీన స్థితిలో టాలీవుడ్ కమెడియన్..! నీ ముఖం కూడా గుర్తులేదంటూ అవమానాలు

ఈ సినిమాతో పాటు లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో ఖైదీ2 సినిమా చేస్తున్నాడు. గతంలో వచ్చిన ఖైదీ సినిమా ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలైన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇక ఇప్పుడు ఈ సినిమాకు సీక్వెల్ తెరకెక్కిస్తున్నాడు లోకేష్ కానగరాజ్. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. అయితే ఖైదీ సినిమాలో హీరోయిన్ లేదు.. పాటలు లేవు.. ఓన్లీ హీరో మీదే సినిమాను నడిపించాడు లోకేష్..

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి : 400 కోట్ల హీరోయిన్.. కానీ ఇప్పటికీ అద్దె ఇంట్లోనే.. కారణం ఇదేనా..?

కానీ ఖైదీ 2లో మాత్రం ఓ స్టార్ హీరోయిన్ నటిస్తుందని తెలుస్తుంది. ఓ స్టార్ హీరోయిన్ ను లోకేష్ ఖైదీ 2కోసం సంప్రదిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు అందాల భామ అనుష్క శెట్టి.. ఖైదీ 2లో అనుష్క కీలక పాత్రలో నటిస్తుందని కోలీవుడ్ లో టాక్ వినిపిస్తుంది. త్వరలోనే దీని పై క్లారిటీ ఇవ్వనున్నారు. ప్రస్తతం అనుష్క ఘాటీ అనే సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఇది కూడా చదవండి : హిట్ కొట్టి ఆరేళ్ళు.. మూడు సినిమాలు చేస్తే ఒకే ఒక్క హిట్.. కానీ క్రేజ్ మాత్రం పీక్

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
ఉత్తర భారతాన్ని వణికించిన భూకంపం.. ఢిల్లీలో ప్రకంపనలతో జనం..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
పగిలిన మడమలు సాఫ్ట్‌గా అవుతాయ్.. జస్ట్ ఈ చిట్కాలు పాటిస్తే చాలు..
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
అమ్మాయిలను హత్య చేసే ఆటోడ్రైవర్.. OTTలో రియల్ సైకో కిల్లర్ స్టోరీ
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
శ్రేయాస్ సూపర్ ఇన్నింగ్స్.. తొలి టీ20లో భారత్ ఘన విజయం..
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
ఏం క్యాచ్ రా ఛోటా ప్యాకెట్.. బౌండరీ లైన్‌లో అదుర్స్ అంతే..!
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
విపక్ష ఎంపీల నిరసనపై ఎన్నికల సంఘం క్లారిటీ..
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
దేశమంతటా ఫామ్‌-సిక్స్ రచ్చ.. ‘గో జ్ఞానూ గో’..!
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
పండగ వేళ రైలు ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..ఈ రూట్లో ప్రత్యేక రైళ్లు
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
న్యూజిలాండ్ టూర్‌కు టీమిండియా.. స్క్వాడ్‌లో వైభవ్‌కి చోటు..!
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..
మాధురి రాథోడ్ ఈజ్ బ్యాక్.. మరో ఫోక్ సాంగ్‌తో అదరగొట్టేసిందిగా..