Yash: యష్ అసలు పేరు ఏంటో తెలుసా.? అసలు పేరు ఎందుకు మార్చుకున్నడంటే..

నటుడు యష్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్. అతను KGF సినిమా ద్వారా తనను మరియు కన్నడ సినిమాని భారతదేశ స్థాయికి తీసుకెళ్లాడు. ‘కేజీఎఫ్’ సినిమా తర్వాత సామాన్య సినీ ప్రియులే కాదు సినీ తారలు కూడా యశ్‌కి అభిమానులుగా మారిపోయారు. యష్ మరియు ‘కెజిఎఫ్’ గురించి దేశంలోని ఏదో ఒక వేదికలో చర్చలు జరుగుతూనే ఉన్నాయి.

Yash: యష్ అసలు పేరు ఏంటో తెలుసా.? అసలు పేరు ఎందుకు మార్చుకున్నడంటే..
Actor Yash
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 31, 2024 | 11:11 AM

రాకింగ్ స్టార్ యష్ పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సొంతం చేసుకున్నాడు. ఒకే ఒక్క సినిమా యష్ ను అన్ని భాషలకు దగ్గర చేసింది. ఆ సినిమానే కేజీఎఫ్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన కేజీఎఫ్ సినిమా సంచలన విజయం సాధించింది. ఈ సినిమా తర్వాత వచ్చిన కేజీఎఫ్ 2 సినిమా కూడా బేటీ విజయాన్ని అందుకుంది. ఈ రెండు సినిమాలు   యష్ కెరీర్‌ని మార్చేసింది. యష్ ఇంత పెద్ద స్థాయిలో పేరు తెచ్చుకున్నా.. కన్నడ భాషలో సినిమాలు చేస్తూ స్టార్ హీరోగా మారాడు. ఆతర్వాత ఇప్పుడు పాన్ ఇండియా స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు.  కాగా యష్ అసలు పేరు ఏంటో తెలుసా.? చాలా మందికి ఈ విషయం తెలియదు. యష్ అసలు పేరు వేరే ఉంది.

యష్ అసలు పేరు నవీన్. ఇండస్ట్రీలోకి వచ్చాక దాన్ని యష్‌గా మార్చుకున్నాడు. ఇలా చేయడానికి గల కారణాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. యశ్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఆసక్తికర కామెంట్స్ చేశాడు. తన పేరు నవీన్ నుండి యష్ గా ఎందుకు మార్చుకున్నాడో చెప్పాడు. జాతకం ప్రకారం ఒక పేరు మార్చాలి అన్నారు. ఇది ‘y’ అక్షరంతో మొదలవ్వాలి. అందువలన, అతనికి యశ్వంత్ అని పేరు పెట్టారు అని తెలిపాడు.  ఇది తన అసలు పేరు కాదని.. కానీ సినిమాల్లోకి యష్ గా వచ్చాను అని తెలిపాడు.

అతను జనవరిలో జన్మించాడు కాబట్టి అతనికి నవీన్ అని పేరు పెట్టారు తల్లిదండ్రులు. ఇండస్ట్రీకి వచ్చేసరికి పేరు మారిపోయింది. ముందుగా ఓ సీరియల్ లో నటించడానికి వెళ్ళినప్పుడు. అక్కడ నవీన్ అని చాలా మంది ఉండేవారు. గందరగోళం కారణంగా తన పేరు యష్ అని మార్చుకున్నాను. అప్పటి నుంచి యష్ గా మారిపోయింది’ అని యశ్ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం యష్ ‘టాక్సిక్’ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాతో పాటు రామాయణం చిత్రం కూడా నటిస్తున్నాడు. ఈ సినిమాలో యష్ రావణుడి పాత్రను పోషిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
అజ్మీర్ షరీఫ్ దర్గాకు ఛాదర్‌ను పంపిన ప్రధాని మోదీ..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్