AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఈసారి హిస్టారికల్ కథతో.. జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..

యాక్షన్ హీరో గోపీచంద్ వరుస ఫ్లాప్స్ తర్వాత రీసెంట్‌గా విశ్వం సినిమాతో హిట్ అందుకున్నాడు. విలన్ గా కెరీర్ మొదలు పెట్టి ఆతర్వాత హీరోగా మారి ప్రేక్షకులను అలరిస్తున్నారు. నిజానికి గోపీచంద్ హీరోగా సినీ కెరీర్ మొదలు పెట్టాడు. తొలివలపు సినిమాతో హీరోగా మారాడు. తరువాత జయం, నిజం, వర్షం వంటి విజయ వంతమైన చిత్రాలలో ప్రతినాయక పాత్రలను పోషించాడు.

ఈసారి హిస్టారికల్ కథతో.. జెట్ స్పీడ్‌లో గోపీచంద్ నయ మూవీ షూటింగ్..
Gopichand
Rajeev Rayala
|

Updated on: Jan 23, 2026 | 7:33 PM

Share

మ్యాచో స్టార్ టి గోపీచంద్ చాలా కాలంగా సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. వరుసగా సినిమాలు చేస్తున్నా కూడా హిట్స్ మాత్రం అందుకోలేకపోతున్నాడు ఈ స్టార్ హీరో. ప్రస్తుతం విజనరీ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో, శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి భారీ స్థాయిలో నిర్మిస్తున్న హిస్టారికల్ మూవీ  గోపీచంద్33 అనే వర్కింగ్ టైటిల్ తో రాబోతున్నారు. పవన్ కుమార్ ప్రజెంట్స్ చేస్తున్న ఈ చిత్రం గోపీచంద్ కెరీర్‌లోనే అత్యంత భారీ చిత్రాలలో ఒకటిగా రూపొందుతోంది. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో చిత్ర బృందం భారీ, హై ఇంటెన్సిటీ క్లైమాక్స్ సీక్వెన్స్ ని షూటింగ్‌ను ప్రారంభించింది.

రాత్రిపూట చిత్రీకరించే క్లైమాక్స్ కోసం ప్రత్యేకంగా ఒక భారీ సెట్‌ను నిర్మించారు. దీనిని 25 రోజుల లెన్తీ షెడ్యూల్‌లో పూర్తి చేయబోతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ క్లైమాక్స్ టాలీవుడ్‌లో ఇప్పటివరకు ఎప్పుడూ చూడని విధంగా, స్కేల్, ఎగ్జిక్యూషన్ పరంగా ఫస్ట్-ఆఫ్-ఇట్స్-కైండ్‌గా ఉండబోతుంది. ప్రేక్షకులకు మరచిపోలేని అనుభూతిని అందించనుంది. ఇప్పటికే విడుదలైన గోపీచంద్ బర్త్‌డే స్పెషల్ పోస్టర్, గ్లింప్స్‌లో, పొడవైన జుట్టు, రగ్డ్ గడ్డం, వారియర్ గెటప్‌లో కనిపించడం భారీ అంచనాలను పెంచింది

ఇవి కూడా చదవండి

ఇన్నోవేటివ్ కథనాలు, టెక్నికల్ ఫినెస్‌కు పేరుగాంచిన సంకల్ప్ రెడ్డి, భారత చరిత్రలో వెలుగులోకి రాని ఒక శక్తివంతమైన అధ్యాయాన్ని తెరపై ఆవిష్కరించబోతున్నారు. సినిమా విజువల్ వండర్ గా ఉండబోతోంది. గోపీచంద్ ఇప్పటివరకు చేయని పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు టాప్ టెక్నికల్ టీమ్ పనిచేస్తోంది. సౌందర్ రాజన్ సినిమాటోగ్రాఫర్‌, అనుదీప్ దేవ్ సంగీత అందిస్తున్నారు.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ చూడండి..

Follow Us
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
పెద్ద కలలు కనండి.. కష్టపడండి.. కానీ అస్సలు వెనక్కి తగ్గకండి
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
ఇకపై ఢిల్లీ స్టేట్ గెస్ట్ హౌస్ గా షీష్ మహల్ !
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
అందుకే శ్రీలీల ప్లేస్‌లో భాగ్యశ్రీ.. అసలు విషయం చెప్పిన నాగవంశీ
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..
బాలయ్య సరసన భార్యగా, అమ్మగా నటించిన కుర్ర బ్యూటీ ఎవరో తెలుసా..
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
51 ఏళ్లవుతున్నా ఇప్పటికీ సింగిల్‌గానే
సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!
సీఎం విజయ్ 'జన నాయగన్' సినిమా సెన్సార్ పూర్తి.. రిలీజ్ డేట్ ఇదే!
మాటలే తూటాలు.. ఏపీలో జోరుగా పక్కా లోకల్‌ పాలిటిక్స్‌
మాటలే తూటాలు.. ఏపీలో జోరుగా పక్కా లోకల్‌ పాలిటిక్స్‌
భారీ రెమ్యునరేషన్ తో 'బిగ్‌బాస్' ఆఫర్ వచ్చింది: జబర్దస్త్ బ్యూటీ
భారీ రెమ్యునరేషన్ తో 'బిగ్‌బాస్' ఆఫర్ వచ్చింది: జబర్దస్త్ బ్యూటీ
చిగుళ్ల నుంచి రక్తస్రావమా? వెంటనే ఈ రక్త పరీక్ష చేయించుకోండి..
చిగుళ్ల నుంచి రక్తస్రావమా? వెంటనే ఈ రక్త పరీక్ష చేయించుకోండి..
గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టమే..
గోల్డ్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే నష్టమే..