AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pushpa 2: సంధ్య థియేటర్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప రాజ్..

సుకుమారన్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రైజ్ చిత్రం 2021లో పాన్-ఇండియన్ భాషల్లో విడుదలైంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్‌తో పాటు రష్మిక మందన, ఫహద్ ఫాజిల్, సునీల్ ననటించారు. ఈ సినిమా విడుదలై అన్ని భాషల్లో సూపర్ హిట్ అయింది. ముఖ్యంగా ఈ చిత్రానికి సౌత్ ఇండియా కంటే నార్త్ ఇండియాలోనే ఎక్కువ ఆదరణ లభించింది

Pushpa 2: సంధ్య థియేటర్‌లో రికార్డ్ క్రియేట్ చేసిన పుష్ప రాజ్..
Pushpa 2
Rajeev Rayala
|

Updated on: Dec 31, 2024 | 10:40 AM

Share

‘పుష్ప 2’ సినిమా రికార్డులు బద్దలు కొడుతూ దూసుకుపోతుంది. డిసెంబర్ 5న విడుదలైన పుష్ప2 సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఇప్పటికే ఈ సినిమా 17వేలకోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో అల్లు అర్జున్ అభిమానులు ఆనందంలో తేలిపోతున్నారు. అయితే హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ సినిమా వివాదం సృష్టించిన విషయం తెలిసిందే. సంధ్య థియేటర్ కు ‘పుష్ప 2’ సినిమా చూసేందుకు అల్లు అర్జున్ వచ్చినప్పుడు తొక్కిసలాట జరిగింది. దీంతో ఆ మహిళ మృతి చెందింది. ఇది చాలా సంచలనం సృష్టించింది. దీనికి అల్లు అర్జున్ కూడా కారణమని, అతడ్ని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో ఉంది. అల్లు అర్జున్ బెయిల్ పై బయటకు వచ్చాడు. ఇక ఇప్పుడు ఈ థియేటర్‌లో సినిమా రికార్డు సృష్టించింది పుష్ప 2.

డిసెంబర్ 5న ‘పుష్ప 2’ సినిమా విడుదలైంది. అప్పటి నుంచి సంధ్య థియేటర్‌లో ‘పుష్ప 2’ సినిమా దూసుకుపోతుంది. సంధ్య థియేటర్ లో పుష్ప2 సినిమా రూ.1.59 కోట్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఈ థియేటర్ నెల రోజుల్లో ఇంత పెద్ద మొత్తం రాబట్టడం ఇదే తొలిసారి. 2001లో పవన్ కళ్యాణ్ నటించిన ‘ఖుషి’ చిత్రం రూ.1.53 కోట్లు రాబట్టి రికార్డును తన పేరిటే ఉంచుకుంది. అయితే ఈ రికార్డును ‘పుష్ప 2’ చిత్రం బద్దలు కొట్టింది.

2021లో విడుదలైన పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యింది. విడుదలైన అన్ని భాషల్లో పుష్ప సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పుష్ప సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటించింది. అలాగే ఈ సినిమాలో ఫహద్ ఫాజిల్ విలన్ గా నటించాడు. అలాగే సునీల్, అనసూయ కీలక పాత్రల్లో నటించారు. ఇక ఇప్పుడు పుష్ప 2 సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు నార్త్ లోనూ భారీ కలెక్షన్స్ సొంతం చేసుకుంటుంది. అలాగే బాలీవుడ్ లో వందేళ్ల రికార్డ్ ను బ్రేక్ చేసింది పుష్ప 2.

ఇవి కూడా చదవండి

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us