Keerthy Suresh: కీర్తిసురేష్‌ను కృతి అని పిలిచిన కెమెరామెన్.. అదిరిపోయే రిప్లే ఇచ్చిన అమ్మడు
టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్స్ చాలా మంది బాలీవుడ్ లో వెళ్లి అక్కడ సినిమాలు చేసి.. ప్రేక్షకులను మెప్పిస్తున్నాయి. ఇప్పుడు ఎక్కడ చూసిన టాలీవుడ్ పేరే వినిపిస్తుంది. టాలీవుడ్ సినిమాలు హిందీలో రికార్డ్ స్థాయిలో కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. బాలీవుడ్ లో అడుగు పెట్టిన స్టార్ హీరోయిన్స్ లో కీర్తిసురేష్ కూడా చేరిపోయింది. బేబీ జాన్ సినిమాతో ఈ చిన్నది హిందీలోకి అడుగుపెట్టింది.
సౌత్ ఇండియన్ సినిమా గురించి, టాలీవుడ్ గురించి నిత్యం బాలీవుడ్ లో చర్చ జరుగుతూనే ఉంటుంది. ఇదిలావుండగా దక్షిణాది హీరోలు, హీరోయిన్లు బాలీవుడ్‌కి వెళ్లి రాణిస్తున్నారు.. సౌత్ నుంచి ఇప్పటికే చాలా మంది హిందీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. తెలుగు సినిమాలు ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ లో సక్సెస్ సాధిస్తున్నాయి. అంతే కాదు కొన్ని సినిమాలు తెలుగు రాష్ట్రాల కంటే బాలీవుడ్ లోనే ఎక్కువగా కలెక్షన్స్ సొంతం చేసుకుంటున్నాయి. ఇప్పటికే పుష్ప 2 సినిమా బాలీవుడ్ లో రికార్డ్ బ్రేక్ చేసింది. ఇదిలా ఉంటే బాలీవుడ్ లోకి అడుగు పెడుతున్న భామల్లో కీర్తిసురేష్ ఒకరు. రీసెంట్ గా ‘బేబీ జాన్’ సినిమాతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాతో కీర్తిసురేష్ బాలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకుంది. తాజాగా కీర్తిసురేష్ కు సంబందించిన ఓ చర్చకు దారి తీసింది.
బాలీవుడ్‌లో పాపరాజీ సంస్కృతి విస్తృతంగా వ్యాపించింది. దక్షిణాది తారలు అక్కడికి వెళ్లినా.. చాలా మంది వారిని వీడియోలు, ఫొటోలు క్లిక్ చేస్తుంటారు. తాజాగా కీర్తి సురేష్ వీడియోను అక్కడి ఫోటో గ్రాఫర్లు తీశారు. ఛాయాచిత్రకారులు ప్రవర్తించిన తీరు సరికాదని పలువురు అభిప్రాయపడ్డారు. ఇంతకూ వారు ఏం చేశారంటే.. రీసెంట్ గా కీర్తి సురేష్ ఓ రెస్టారెంట్ లో కనిపించింది. అప్పుడు పాపారాజీ కీర్తి సురేష్ ఫోటోలు, వీడియోలు తీశారు. ఈ సమయంలో అక్కడున్నకెమెరామెన్ కీర్తి సురేష్‌ని కృతి..కృతి అని పిలిచాడు.
కృతి సనన్ బాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్. తికమక పడిన వ్యక్తి ఇలా పిలిచి ఉండవచ్చు అని అనుకుందాం.. కానీ, కీర్తిని మరో కెమెరామెన్ ‘దోసే’ అని పిలిచాడు. దోస మన సౌత్ ఫెమస్ టిఫిన్. ఇంతకుముందు కీర్తి మాట్లాడుతూ, తనకు దోస అంటే చాలా ఇష్టం అని చెప్పింది. అందుకే కీర్తిని అతన్ని దోస అని పిలిచి వెక్కిరించాడు. అయితే దానికి కీర్తి అదిరిపోయే రీప్లే ఇచ్చింది. ‘కీర్తి దోస కాదు కీర్తి సురేష్. కానీ, నాకు దోసె అంటే ఇష్టం’ అని కీర్తి సురేష్ రిప్లే ఇచ్చింది. ప్రస్తుతం ‘బేబీ జాన్’ సినిమా థియేటర్స్ లో ఆకట్టుకుంటుంది.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.