Pushpa 2: యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న ‘సూసేకి అగ్గిరవ్వ’ సాంగ్.. ఇరగదీసిన అల్లు అర్జున్, రష్మిక
పుష్ప 2 దేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇండియాలో ఈ సినిమా వసూళ్ల సంఖ్య దాదాపు 1200 కోట్లకు చేరుకుంది. అదే సమయంలో, ఉత్తర అమెరికాలో ఆదాయాలు కూడా భారీగా ఉన్నాయి. అక్కడ పుష్ప 2 14.9 మిలియన్ డాలర్లు అంటే 127 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ఇక ఈ సినిమా నుంచి వీడియో సాంగ్స్ ను రిలీజ్ చేస్తున్నారు మేకర్స్.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 డిసెంబర్ 5 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా ఇప్పటికీ థియేటర్స్ లో దుమ్మురేపుతోంది. సంచలన విజయం సాధించిన పుష్ప 2 కలెక్షన్స్ పరంగానూ దూసుకుపోతుంది. ఇప్పటికే ఈ సినిమా నయా రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. 2021లో విడుదలైన పుష్ప సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మిక హీరోయిన్ గా నటించింది. ఇక పుష్ప సినిమా మంచి విజయం సాధించడంతో పుష్ప 2 పై భారీ అంచనాలు నెలకొన్నాయి. పుష్ప 2: ది రూల్’ 2024లో అతిపెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటిగా నిలిచింది. ఇది ఇండియాలోనేకాదు ప్రపంచవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొడుతోంది.
సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో అల్లు అర్జున్ తో పాటు ఫహద్ ఫాజిల్, సునీల్, అనసూయ కీలకపాత్రల్లో నటించి మెప్పించారు. ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా విడుదలై నాలుగో వారం కావస్తున్నా బాక్సాఫీస్ వద్ద ‘పుష్ప’ వేగం తగ్గే సూచనలు కనిపించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.1700 కోట్ల మార్క్‌ను క్రాస్ చేసి సంచలనం సృష్టించింది. ‘పుష్ప 2’ చిత్రం భారతదేశంలోనే కాకుండా ఉత్తర అమెరికా బాక్సాఫీస్ వద్ద కూడా దూసుకుపోతోంది.
తాజాగా ఈ సినిమా నుంచి “సూసీకి అగ్గి రవ్వలా” అనే వీడియో సాంగ్ ను విడుదల చేశారు. ఈ సాంగ్ మిలియన్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది ఈ పాట. పుష్ప 2 రూ. 1710 కోట్లకు పైగా వసూలు చేసింది. 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన భారతీయ చిత్రాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది పుష్ప 2. పుష్ప 1లో నటి సమంత చేసిన స్పెషల్ డ్యాన్స్ చేయగా ఆ సాంగ్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కాగా పార్ట్ 2లో నటి శ్రీ లీల కిస్సిక్ పాటకు స్పెషల్ డ్యాన్స్ చేసింది. ఈ సినిమా విడుదలై 23 రోజులు కావస్తున్నా ఇప్పుడు థియేటర్ల దగ్గర హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. పుష్ప ది రూల్ చిత్రం త్వరలో 2000 కోట్ల రూపాయలను వసూలు చేస్తుందని అంచనా వేస్తున్నారు.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి