Year Ender 2024: ఈ ఏడాది కుర్రకారు గుండెల్లో బాణాలు గుచ్చిన భామలు వీరే
2024 ఏడాది ముగింపుకు ఇంకా రెండు రోజుల సమయమే ఉంది. ఇప్పటికే ప్రపంచం మొత్తం న్యూఇయర్ వేడుకలకు సిద్ధమయ్యింది. మరోవైపు దేశవ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలకు నగర వీధులు అందంగా ముస్తాబవుతున్నాయి. అయితే ఈ ఏడాది మాత్రం ఎంతో మందికి కలిసి వచ్చింది. అలాగే ఈ దడి తమ నటనతో ప్రేక్షకులను మెప్పించిన హీరోయిన్స్ వీరే..
ఈ ఏడాదికి మరి కొన్ని గంటల్లో ముగిసిపోనుంది.. 2024కు గుడ్ బై చెప్పి.. 2025కు వెల్కమ్ చెప్పనున్నాం.. దాంతో ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధం అవుతుంది. ఇక ఈ ఏడాది విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న భామల్లో సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాలి. 2024లో ప్రేక్షకులను మెప్పించిన స్టార్ హీరోయిన్ ఎవరు అంటే టక్కున చెప్పే పేరు సాయి పల్లవి. మలయాళ ఇండస్ట్రీ నుంచి ఎంట్రీ ఇచ్చిన సాయి పల్లవి ఆతర్వాత తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి దూసుకుపోతుంది. తమిళం, తెలుగు, మలయాళం సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఇక ఈఏడాది అక్టోబర్ 31న విడుదలైన అమరన్ సినిమా సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది. రాజ్‌కుమార్ పెరియసామి దర్శకత్వం వహించిన ఈ చిత్రం దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ జీవితానికి సంబంధించినది. ఈ సినిమాలో సాయి పల్లవి ముకుంద్ భార్య “ఇందు రెబెక్కా వర్గీస్” పాత్రను పోషించింది. ఈ సినిమాలో తన నటనతో విశేషంగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో తన రియలిస్టిక్ పెర్ఫార్మెన్స్ తో ప్రేక్షకుల గుండెల్లో స్థానం సంపాదించుకుంది. ప్రస్తుతం తెలుగులో తండేల్ సినిమా చేస్తుంది. హిందీలో రామాయణం అనే సినిమాల్లో నటిస్తుంది.
తమన్నా :
తమన్నా 18 ఏళ్లుగా తమిళ చిత్ర పరిశ్రమలోస్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది . ఈ బ్యూటీ శ్రీ సినిమాతో తెలుగులోకి అడుగుపెట్టింది. ఇప్పటికీ ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుంది. ఈ సంవత్సరం తమిళ చిత్రం బాక్ లో నటించి మెప్పించింది. ఈ సినిమా మంచి విజయం సాధించింది. సుందర్ సి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఒక్క తమిళనాడులోనే 75 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగులోనూ మంచి టాక్ తెచ్చుకుంది. అంతకుముందు 2023లో విడుదలైన జైలర్ సినిమాలోని “కావలయ్యా” పాటతో బాగా పాపులర్ అయ్యింది. దీని తరువాత, తమన్నా బాక్ చిత్రంలో “అచాచో” పాటలో రాశి ఖన్నాతో కలిసి డ్యాన్స్ చేసి ప్రేక్షకులను మెప్పించింది.
మంజు వారియర్ :
మంజు వారియర్ వేటిమారన్ దర్శకుడు అసురన్ లో తన నటనతో కట్టిపడేసింది. ఈ మలయాళ నటి ఈ ఏడాది తమిళంలో రెండు సినిమాల్లో నటించింది. దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వం వహించిన వేట్టయన్ చిత్రంలో ఆమె సూపర్ స్టార్ రజనీకాంత్ భార్య పాత్రను పోషించింది. “మనసిలాయో” పాటలో తన డ్యాన్స్ తో ఆడియన్స్ మనసుల్లో స్థానం సంపాదించుకుంది. అలాగే డిసెంబర్ 20 న విడుదలైన వెట్రిమారన్ విడుదల పార్ట్ 2 లో విజయ్ సేతుపతి సరసన నటించింది రెండు సినిమాలు మంచి విజయం సాధించింది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి