AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sai Pallavi: ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన సాయి పల్లవి

క్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా మారిన ముద్దుగుమ్మల్లో సాయి పల్లవి ఒకరు. ప్రేమమ్ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈ ముద్దుగుమ్మ .. తెలుగులోకి ఫిదా సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతోంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తోన్న సాయి పల్లవి ఇప్పుడు హిందీలోనూ సినిమాలు చేస్తోంది.

Sai Pallavi: ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిన సాయి పల్లవి
Sai Pallavi
Rajeev Rayala
|

Updated on: Dec 31, 2024 | 9:18 AM

Share

నేచురల్ బ్యూటీ సాయి పల్లవి ఈ మధ్య సినిమాల స్పీడ్ పెంచింది. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేసి మెప్పిస్తుంది. ఫిదా సినిమాతో తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసిన ఈ అమ్మడు. ఆతర్వాత వరుసగా సినిమాలు చేసి ఆకట్టుకుంది. ఇప్పుడు వస్తున్న హీరోయిన్స్ కు భిన్నంగా.. స్కిన్ షో కు దూరంగా ఉంటుంది సాయి పల్లవి. కేవలం నటనతోనే అభిమానులను సొంతం చేసుకుంటుంది ఈ ముద్దుగుమ్మ. మలయాళ సినిమా ప్రేమమ్ తో పరిచయమైనా సాయి పల్లవి ఆతర్వాత తెలుగు, తమిళ్ భాషల్లో సినిమాలు చేసింది. ఇక తెలుగులో చివరిగా విరాటపర్వం సినిమా చేసింది.ఆ అలాగే తమిళ్ లో గార్గి అనే సినిమా చేసింది.

ఆ తర్వాత చాలా రోజులు గ్యాప్ తీసుకుంది సాయి పల్లవి. ఆ టైం లో ఫ్యాన్స్ తెగ కంగారు పడ్డారు. సాయిపల్లవి ఇక పై సినిమాలు చేయదా.? పెళ్లి చేసుకుంటుందా.? అంటూ రకరకాల ఆనుమానాలు వ్యక్తం అయ్యాయి. ఇక ఇప్పుడు సాయి పల్లవి కొత్త సినిమా చేస్తోంది. అక్కినేని యంగ్ హీరో నాగ చైతన్యతో కలిసి తండేల్ అనే సినిమా చేస్తుంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమా మత్యకారుల జీవిత కథతో ఉండనుంది. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా సాయి పల్లవి ఒక సినిమా కోసం రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిందనే వార్త ఇప్పుడు వైరల్ గా మారింది.

శర్వానంద్ హీరోగా నటించిన మూవీ పడి పడి లేచే మనసు. ఈ సినిమా 2018లో విడుదలైంది. అందమైన ప్రేమకథగా తెరకెక్కిన ఈ సినిమా అంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమాలో పాటలు హిట్ అయినా కూడా సినిమా ఆశించిన స్థాయిలో ఆడలేదు. అయితే ఈ సినిమా నిరాశపరచడంతో సాయి పల్లవి తన రెమ్యునరేషన్ తిరిగి ఇచ్చేసిందని అంటున్నారు. తను సైన్ చేసిన రెమ్యూనరేషన్ మొత్తాన్ని నిర్మాతల నుంచి తీసుకోవడానికి అంగీకరించలేదట. దాంతో 40 లక్షలు త్యాగం చేసి, తన వైపు నుంచి నిర్మాతలకు అండగా నిలిచింది అంటున్నారు. మరి ఈ వార్తల్లో వాస్తవమెంత అన్నది తెలియాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
గ్లాస్‌ బ్రిడ్జ్ కోసం కైలాసగిరికి క్యూ కట్టిన పర్యాటకులు
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
రాంగ్‌ రూట్‌లో వచ్చి మరీ.. మహిళా కానిస్టేబుల్‌పై బైక్ రైడర్ దాడి
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
బాలయ్య కంటే ముందే అఘోరాగా కనిపించిన చిరంజీవి..
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
జాతకంలో రాహు-కేతు పీడ ఉందా? బంగారం లాంటి చాన్స్ ఇది!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
కారు నట్స్‌ను ఇలా బిగిస్తున్నారా? జాగ్రత్త.. పేలిపోయే ప్రమాదం..!
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
ప్రైవేటు క్యాబ్‌ ట్యాక్సీల దోపిడీకి చెక్ భారత్ టాక్సీ సేవలు షురూ
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
రోజూ 15నిమిషాల పాటు రమ్‌తో మసాజ్ చేస్తే చాలు..లెక్కలేనన్ని లాభాలు
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
శ్రీలంకకు ఎక్స్‌పైరీ ఫుడ్‌ పంపిన పాక్‌.. సాయంలోనూ కల్తీనా
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
భారత్-సౌతాఫ్రికా మ్యాచ్ టికెట్ల కోసం ప్రాణాలు ఫణంగా పెడుతున్నారు
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై
కాణిపాకం ఆలయంలో ఆన్‌లైన్‌ సేవలు.. ఇకపై