AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Year Ender 2024: ఏంటీ..! 2024లో ఈ ముద్దుగుమ్మలు ఒక్క సినిమా కూడా చేయలేదా..!

2024 సంవత్సరం ముగుస్తున్న తరుణంలో కొందరు ప్రముఖులు నటించిన సినిమాలేవీ ఈ ఏడాది విడుదల కాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. కొంతమంది హీరోయిన్స్ వరుస సినిమాలతో దూసుకుపోతుంటే మరికొంతమంది మాత్రం ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయకుండా సినిమాలకు దూరంగా ఉన్నారు. ఈ ఏడాది సినిమాలు చేయకుండా ఉన్న హీరోయిన్స్ ఎవరో తెలుసా.?

Year Ender 2024: ఏంటీ..! 2024లో ఈ ముద్దుగుమ్మలు ఒక్క సినిమా కూడా చేయలేదా..!
Actress
Rajeev Rayala
|

Updated on: Dec 31, 2024 | 9:50 AM

Share

చూస్తూ చూస్తూనే 2024కూడా అయిపొయింది. 2024కు గుడ్ బై చెప్పి.. 2025కు వెల్కమ్ చెప్పనున్నాం.. దాంతో ప్రపంచమంతా న్యూ ఇయర్ వేడుకలకు సిద్ధం అవుతుంది. ఇక ఈ ఏడాది విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్న భామలు చాలా మంది ఉన్నారు. కుర్రహీరోయిన్స్ తమ అందచందాలతో ఆకట్టుకున్నారు. అలాగే సీనియర్ భామలు బడా సినిమాలతో భారీ హిట్స్ అందుకున్నారు. కానీ కొంతమంది ముద్దుగుమ్మలు మాత్రం ఈ ఏడాది సినిమాలకు దూరంగా ఉన్నారు. 2024లో ఒక్క సినిమా కూడా చేయని హీరోయిన్స్ ఎవరో తెలుసా.?

నయనతార: ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయని హీరోయిన్స్ లో మొదటిగా చెప్పుకోవాల్సింది నయనతార గురించే. ఈ లేడీ సూపర్ స్టార్ ఈ ఏడాది ఒక్క సినిమా కూడా చేయలేదు. గత సంవత్సరం 2023 లో ఆమె బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటించింది. ఆతర్వాత మరో సినిమా చేయలేదు. 2024మొత్తం ఆమె సినిమాలకు దూరంగా ఉంది.

శృతి హాసన్ : నటుడు కమల్ హాసన్ కుమార్తె అయిన ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ నటిస్తున్న కూలీ చిత్రంలో శృతి హాసన్ కథానాయికగా నటిస్తోంది.2023లో ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీలో కనిపించింది. సలార్ మూవీ పాన్ ఇండియా హిట్ అవ్వడంతో ఈ చిన్నదానికి మంచి క్రేజ్ వచ్చింది. 2024లో ఈ చిన్నది ఒక్క సినిమాలో కూడా నటించలేదు.

త్రిష: తమిళ చిత్రసీమలో అగ్ర కథానాయిక త్రిష ఈ ఏడాది ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. విజయ్ నటించిన గోట్  సినిమాలో ఆమె ఒక్క పాటకు మాత్రమే డ్యాన్స్ చేసింది. 2025లోవరుస సినిమాలు లైనప్ చేసింది. అలాగే  సూర్య 45 సినిమా కూడా చేస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
ఇలా చేస్తే.. భలే కరకరలాడుతూ వస్తాయ్..
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
వానాకాలంలో వచ్చే ఎన్నో సమస్యల నుండి కాపాడే మోస్ట్ పవర్ఫుల్ లడ్డు
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ప్రపంచంలో ట్రాఫిక్ సిగ్నల్స్ లేని ఏకైక దేశం ఏదో తెలుసా?
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
ఇంట్లో చిలుకను పెంచుతున్నారా? వాస్తు ప్రకారం శుభమా? అశుభమా?...
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
విద్యార్థినితో టీచర్ అసభ్య చాటింగ్..!
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
200ఏళ్ల నాటి రాజమహల్‌ రహస్యం.. 52గదులు, 53 తలపుల వెనుక అంతులేని
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
సూర్య గ్రహణం వచ్చేస్తోంది.. దానికి ముందు తప్పక చేయాల్సిన పనులివే
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్ రీఎంట్రీ? ఒక్క ఫొటోతో..
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
బోగాపురం అల్లూరి ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవానికి ప్రధాని మోదీ..!
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా
నాన్నకు ప్రేమతో తాటి చెట్టుకు నిచ్చేన..! 55 అడుగుల ఎత్తు హాయిగా