Mamitha Baiju: ప్రేమలు బ్యూటీని లాగిపెట్టి కొట్టిన దర్శకుడు.. అసలేం జరిగిందంటే

మలయాళం నుంచి వచ్చిన ప్రేమలు సినిమా మంచి విజయం అందుకుంది. ఈ సినిమాలో నటించిన హీరోయిన్ మమిత బైజు పై ప్రశంసలు కురిపిస్తున్నారు సినిమా చూసిన వారు. చక్కటి నటనతో ఆకట్టుందని అంటున్నారు. అయితే ఈ బ్యూటీ ఇప్పుడు ఓ దర్శకుడి పై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఓ పేరున్న దర్శకుడు తాను తిట్టాడని అంతే కాకుండా చెయ్యి కూడా చేసుకున్నాడని తెలిపింది.

Mamitha Baiju: ప్రేమలు బ్యూటీని లాగిపెట్టి కొట్టిన దర్శకుడు.. అసలేం జరిగిందంటే
Mamitha Baiju
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 31, 2024 | 10:17 AM

మలయాళ ఇండస్ట్రీ నుంచి వచ్చిన సినిమాలు కూడా టాలీవుడ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ క్రమంలోనే రీసెంట్ గా ప్రేమలు అనే సినిమా రిలీజ్ అయ్యింది. ప్రేమలు సినిమా మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచింది. అలాగే ఈ సినిమా తెలుగులోనూ రిలీజ్ అయ్యింది. తెలుగులోనూ ఈ సినిమాకు మంచి స్పందన వచ్చింది. ఇదిలా ఉంటే ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన మమిత బైజు కు మంచి క్రేజ్ వచ్చింది. ఈ చిన్నదాన్ని చూసిన ఆడియన్స్ ఎవరు ఈ అమ్మడు అంటూ సోషల్ మీడియాను గాలిస్తున్నారు. ప్రేమలు సినిమాతో మమిత బైజు ఓవర్ నైట్ లో క్రేజ్ సొంతం చేసుకుంది. అయితే మమిత బైజును ఓ డైరెక్టర్ చెంపదెబ్బ కొట్టాడట. ఇప్పుడు ఇదేటి టాక్ సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.

ఇప్పుడు ఈ చిన్నదానికి ఆఫర్స్ క్యూ కడుతున్నాయి. బ్యాక్ టు బ్యాక్ ఈ అమ్మడికి అదిరిపోయే ఆఫర్స్ వస్తున్నాయి. ఈ క్రమంలోనే దర్శకుడు బాల దర్శకత్వంలో ఓ సినిమా ఆఫర్ కూడా అందుకుందని టాక్. అయితే షూటింగ్ లో బాల మమిత ను కొట్టారని.. దాంతో ఆమె సినిమా నుంచి బయటకు వచ్చేసిందని తెలుస్తుంది. సూర్య, మమిత ప్రధాన పాత్రల్లో బాల దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడని టాక్. బాలా ప్రాజెక్టులను సూర్య చేస్తున్న సినిమా ప్రయోగాత్మకంగా ఉండనుందని తెలుస్తుంది. ఈ సినిమాలో సూర్య ద్విపాత్రాభినయం చేయనున్నాడని టాక్. ఈ సినిమాలో ఓ పాత్రలో సూర్య చెవిటి – మూగ పాత్రలో కనిపిస్తాడని చెబుతున్నారు.

అయితే ఈ సినిమా సెట్ లో బాల మామితాను కొట్టాడని వస్తున్న వార్తల పై బాల క్లారిటీ ఇచ్చాడు. మమిత తన కూతురు లాంటిది. అలాంటిఅమ్మాయిని నేను కొడతానా.? అని బాలా అన్నారు. ఆయన మాట్లాడుతూ.. అమ్మాయిలను ఎవరైనా కొడతారా.? ఆమె చిన్న పిల్ల. అయితే మేకప్ ఆర్టిస్ట్ బొంబాయి నుండి వచ్చారు. ఆ సమయంలో మమితకు షూట్ లేదు. ఊరికే కూర్చున్నాం అంటూ మమితకి మేకప్ వేశారు. అయితే తన సినిమాల్లో నటీనటులు అనవసరంగా మేకప్ వేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. అది మమితకు తెలుసు. ఆ విషయాన్ని మేకప్ ఆర్టిస్టుకు చెప్పలేదు మమిత. షాట్‌కి రెడీ అని పిలిస్తే మమిత మేకప్‌తో వచ్చింది. మేకప్ ఎవరు చేశారంటూ అడిగి అరిచాను. అంతే కానీ ఆమెను కొట్టలేదు అని క్లారిటీ ఇచ్చారు బాల. ఈ సినిమా సెట్ లో మమిత 40 రోజులు నటించింది. ఇప్పుడు ఆమె సినిమా నుంచి తప్పుకోవడంతో సినిమాను రీ షూట్ చేస్తున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
కొత్త ఏడాది 2025లో వచ్చే మార్పులు ఇవే.! ఆధార్ నుండి UPI వరకు..
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
వివాదంలో బాలీవుడ్ సూపర్‌స్టార్ ఫ్యామిలీ.! కోర్టుకెక్కిన రాజేశ్‌ఖన
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఐస్‌క్రీమ్‌ బిర్యానీ.. చూస్తే దిమ్మ తిరగాల్సిందే. కాంబినేషన్ ఏంటి
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
ఎవర్రా మీరంతా.. 30 సెకన్లలోనే షాపింగ్ మాల్‌ను ఖాళీ చేసేశారు.!
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
పదేళ్లు ఆగండి.. ఆ గ్రహంపై సిటీనే కట్టేద్దామన్న మస్క్.! వీడియో..
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
చిన్న వయసులోనే జుట్టు తెల్లబడుతోందా.? అయితే ఇలా చేయండి.!
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
మీరు OG OG అంటుంటే బెదిరింపుల్లా ఉన్నాయి.! పవన్‌ రియాక్షన్..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఆకాశంలో అద్భుతం.. అరుదైన ‘బ్లాక్​ మూన్’.. ఇప్పుడు మిస్సయితే..
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
ఈ పండు తింటే వృద్ధాప్యం రమ్మన్నా రాదంట.ట్యాబ్లెట్ల తయారీలో ఫ్రూట్
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!
మరో అదిరిపోయే రీఛార్జ్‌ ప్లాన్‌ ను తీసుకొచ్చిన బీఎస్‌ఎన్‌ఎల్‌.!