Shruti Haasan: తన ఫేవరేట్ కోస్టార్ ఎవరో చెప్పిన శ్రుతి హాసన్.. ఆ స్టార్ హీరో బెస్ట్ అంటూ కాంప్లిమెంట్..

ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న శ్రుతి హాసన్ తన ఫేవరెట్ కోస్టార్ గురించి ఆసక్తిక విషయాలను చెప్పుకొచ్చింది.

Shruti Haasan: తన ఫేవరేట్ కోస్టార్ ఎవరో చెప్పిన శ్రుతి హాసన్.. ఆ స్టార్ హీరో బెస్ట్ అంటూ కాంప్లిమెంట్..
Shruti Haasan
Follow us
Rajitha Chanti

|

Updated on: Jul 07, 2022 | 12:25 PM

క్రాక్ సినిమాతో మళ్లీ ఫాంలోకి వచ్చింది అందాల తార శ్రుతి హాసన్ (Shruti Haasan). చాలా కాలం తర్వాత ఈ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ఈ చిన్నది.. ప్రస్తుతం చేతి నిండ సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ప్రభాస్, మెగాస్టార్, బాలయ్య వంటి స్టార్ హీరోలతో కలిసి నటిస్తోంది శ్రుతి. వీరి కాంబోలో రాబోతున్న చిత్రాలు ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్నాయి. ప్రస్తుతం శ్రుతి.. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కాంబోలో రాబోతున్న సలార్ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న శ్రుతి హాసన్ తన ఫేవరెట్ కోస్టార్ గురించి ఆసక్తిక విషయాలను చెప్పుకొచ్చింది.

ప్రజెంట్ కేజీఎఫ్ ఫేం ప్రశాంత్ నీల్‌ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సలార్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు ప్రభాస్‌. ఈ సినిమాలో డార్లింగ్‌కు జోడిగా మల్టీ టాలెంటెడ్ బ్యూటీ శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ టైమ్ ప్రభాస్‌తో జోడి కడుతున్న ఈ బ్యూటీ ఆయన రిసెప్షన్‌కి ఫిదా అయ్యారు. అందుకే ఛాన్స్ దొరికిన ప్రతీసారి… డార్లింగ్ గురించి మళ్లీ మళ్లీ చెబుతూ తెగ సంబరిపడిపోతున్నారు. సలార్ షూటింగ్ మొదలైన కొత్తలోనే ప్రభాస్ ఇంటి నుంచి వచ్చే ఫుడ్ గురించి చెప్పారు శృతి. ఆ తరువాత డార్లింగ్ డౌన్‌ టు ఎర్త్ పర్సన్ అని… బాహుబలి రేంజ్ ఇమేజ్‌ ఉన్నా… అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉంటారని… ప్రభాస్‌ క్వాలిటీస్ గురించి ఎన్నో విషయాలు షేర్ చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి అదే విషయాన్ని మరింత గట్టిగా చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి, నటసింహం బాలకృష్ణతో సినిమాలు చేస్తున్నారు శృతి హాసన్‌. అయితే ఈ ఇద్దరూ… సీనియర్‌ స్టార్సే కావటంతో శృతి అంతగా క్లోజ్‌ అవ్వలేకపోతున్నారు. వరుసగా భారీ చిత్రాలు చేస్తున్నా… తనకు బాగా దగ్గరైన కోస్టార్ మాత్రం ప్రభాసే అని అంటున్నారు శృతి. రీసెంట్ ఇంటర్వ్యూలోనూ ప్రభాస్‌ ఇంటి నుంచి వచ్చే క్యారేజ్‌ గురించి, సెట్‌లో డార్లింగ్ బిహేవియర్‌ గురించి చెప్పి మురిసిపోయారు. ఇక తన ఫేవరేట్ కోస్టార్ ప్రభాస్ అని.. సెట్ లో తన ప్రవర్తన.. ఫ్రెండ్లీగా ఉంటారని చెప్పుకొచ్చింది.

మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.