Ghost: ఎట్టకేలకు నాగ్ సినిమా అప్డేట్ వచ్చేసింది.. ఘోస్ట్ ఫస్ట్ విజువల్ వచ్చేది అప్పుడే అంటున్న మేకర్స్..
ఇందులో నాగ్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్
అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) ప్రధాన పాత్రలో నటిస్తోన్న చిత్రం ది ఘోస్ట్ (The Ghost). ఈ సినిమా షూటింగ్ ప్రారంభమై చాలా రోజులు గడుస్తున్నప్పటికీ.. ఎలాంటి అప్డేట్ రాలేదు. డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు తెరకెక్కిస్తున్న ఈ సినిమా అప్డేట్స్ కోసం నాగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇందులో నాగ్ సరికొత్త మేకోవర్‌లో కనిపించనున్నాడు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్.
ఈ సినిమా ఫస్ట్ విజువల్ ను జూలై 9న విడుదల చేయనున్నట్లు ప్రకటిస్తూ నాగ్ ఇంట్రెస్టింగ్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. అందులో నాగ్ వింటేజ్ లుక్స్ లో కచేతిలో కత్తి పట్టుకుని కనిపిస్తున్నారు. కత్తి పట్టుకున్న నాగ్ ఒక కిల్లింగ్ మెషిన్ అంటూ తెలియజేస్తున్నారు మేకర్స్. ముందునుంచి ఈ సినిమా పై ప్రేక్షకులలో క్యూరియాసిటి నెలకొంది. ఈ క్రమంలో తాజాగా విడుదలైన నాగ్ పోస్టర్ మరిన్ని అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో ముందుగా కాజల్ హీరోయిన్ గా ఎంపికైనప్పటికీ.. ఆమె అనుహ్యంగా తప్పుకోవడంతో సోనాల్ చౌహన్ కథానాయికగా కనిపించనుంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పీ, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
ALERT⚠️#TheGHOST is now geared up to give u all a spine chilling thrill with the FIRST VISUAL❤️?
Unleashing the #KILLINGMACHINE ? on 09-07-22@iamnagarjuna @sonalchauhan7 @PraveenSattaru @AsianSuniel #NarayanDasNarang @puskurrammohan @sharrath_marar @SVCLLP @nseplofficial pic.twitter.com/3qEhBAtBFR
— Sree Venkateswara Cinemas LLP (@SVCLLP) July 7, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.