AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Photo: కళ్లతోనే కట్టిపడేస్తోన్న ఈ చిన్నది మెగా హీరోలతో ఆడిపాడింది.. ఎవరో గుర్తుపట్టారా.!

కళ్లతోనే హావభావాలను పలికిస్తూ.. తన చెల్లితో కలిసి ఫోటోకు పోజిస్తున్న ఈ చిన్నది ఇప్పుడొక స్టార్ హీరోయిన్. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది..

Viral Photo: కళ్లతోనే కట్టిపడేస్తోన్న ఈ చిన్నది మెగా హీరోలతో ఆడిపాడింది.. ఎవరో గుర్తుపట్టారా.!
Tollywood Heroine
Ravi Kiran
|

Updated on: Feb 09, 2022 | 6:19 PM

Share

కళ్లతోనే హావభావాలను పలికిస్తూ.. తన చెల్లితో కలిసి ఫోటోకు పోజిస్తున్న ఈ చిన్నది ఇప్పుడొక స్టార్ హీరోయిన్. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగులోనే కాదు తమిళంలోనూ స్టార్ హీరోల సరసన నటించింది. ఈమెకు అబ్బాయిల్లో ఫాలోయింగ్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఫ్యాన్స్ ముద్దుగా ఈ అందాల భామను ‘చందమామ’ అని పిలుచుకుంటారు. పైన పేర్కొన్న ఫోటోలోని చిన్నది ఎవరో ఈపాటికి అర్ధమై ఉంటుంది.

కాజల్ అగర్వాల్.. మన తెలుగు ప్రేక్షకులకు ఈ పేరు సుపరిచితమే. తొలి సినిమాతోనే అటు అందం.. ఇటు అభినయంతో టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. రెండో చిత్రంతోనే ఫ్యాన్స్ కాజల్‌కు ‘చందమామ’ అనే నిక్‌నేమ్ ఇచ్చారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ భాషల్లో సుమారు 50కి పైగా సినిమాల్లో నటించి మెప్పించింది. 2020వ సంవత్సరంలో కాజల్ అగర్వాల్ సింగపూర్‌లోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు బొమ్మగా కొలువు తీరింది.

2004లో హిందీలో ‘క్యు.! హో గయా నా’ అనే చిత్రంతో సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కాజల్ అగర్వాల్.. తెలుగులో 2007లో ‘లక్ష్మీ కళ్యాణం’తో ఎంట్రీ ఇచ్చింది. ఫస్ట్ సినిమాలో కాజల్‌కు నటనకు గానూ మంచి మార్కులు పడ్డాయి. ఆ తర్వాత ‘చందమామ’ సినిమాతో ఎంతోమంది ఫ్యాన్స్ హృదయాలను కొల్లగొట్టింది. ‘మగధీర’, ‘ఆర్య 2’, ‘డార్లింగ్’, ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘బిజినెస్ మాన్’, ‘ఎవడు’, ‘టెంపర్’, ‘సర్దార్ గబ్బర్ సింగ్’, ‘జనతా గ్యారేజ్’, ‘ఖైదీ నెంబర్ 150’ లాంటి బ్లాక్‌ బస్టర్ హిట్స్ అందుకుంది. 2020 అక్టోబర్ 30వ తేదీన తన స్నేహితుడు గౌతమ్ కిచ్లూను వివాహమాడింది కాజల్ అగర్వాల్. కాగా, ప్రస్తుతం కాజల్ నటించిన ‘ఆచార్య’, ‘హే సినమికా’, ‘కరునగాపియం’, ‘ఘోస్టీ’, ‘ఉమ’ సినిమాలు విడుదలకు సిద్దమయ్యాయి.

Follow Us
నవరాత్రుల స్పెషల్ స్వీట్.. కమ్మని రుచితో సగ్గుబియ్యం సేమియా పాయసం
నవరాత్రుల స్పెషల్ స్వీట్.. కమ్మని రుచితో సగ్గుబియ్యం సేమియా పాయసం
గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
గరుడ పురాణం: మరణించిన వ్యక్తుల వస్తువులు వాడకూడదా? నియమాలేంటి?
ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..
ఢిల్లీలో హైటెన్షన్.. అమల్లో BNS సెక్షన్‌ 163.. భారీ బందోబస్తు..
రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. పొందటం ఈజీ
రూ.40 చెల్లిస్తే వాట్సప్‌లోనే క్యాస్ట్ సర్టిఫికేట్.. పొందటం ఈజీ
కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన తెలుగోడు
కోహ్లీ రికార్డుకే ఎసరు పెట్టిన తెలుగోడు
వెంకటేశ్, ఐశ్వర్య రాయ్ కాంబోలో మిస్సైన సినిమా అదే..
వెంకటేశ్, ఐశ్వర్య రాయ్ కాంబోలో మిస్సైన సినిమా అదే..
కాలీఫ్లవర్ Vs బ్రోకలీ.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?
కాలీఫ్లవర్ Vs బ్రోకలీ.. ఆరోగ్యానికి ఏది మేలు చేస్తుంది?
శరీరానికి ఎన్నో పోషకాలను అందించే అద్భుతమైన కూరగాయ..నెలకొసారైనా
శరీరానికి ఎన్నో పోషకాలను అందించే అద్భుతమైన కూరగాయ..నెలకొసారైనా
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
రేషన్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయలేదా..?
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..
డీజిల్‌ ధరలు వేగంగా తగ్గుతాయ్.. రష్యాతో అమెరికా బిగ్ డీల్..