Kadambari Kiran: పక్షవాతంతో మంచాన పడ్డ టాలీవుడ్ కమెడియన్.. గొప్ప మనసు చాటుకున్న కాదంబరి కిరణ్
సుమారు 100 కు పైగా సినిమాల్లో నటించి నవ్వించిన రామచంద్ర ఇప్పుడు మంచానికే పరిమితమయ్యాడు. ఇటీవలే ఈ విషయం వెలుగులోకి రాగా హీరో మంచు మనోజ్ రామ చంద్రను పరామర్శించి ధైర్యం చెప్పాడు. తాజాగా నటుడు కాదంబరి కిరణ్ రామ చంద్ర ఇంటికి వెళ్లి..

టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ రామ చంద్ర ఇప్పుడు దీన స్థితిలో జీవితం గడుపుతున్నాడు. పెరాలసిస్ సోకడంతో అతను పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. కనీసం కదల్లేని స్థితిలో ఉన్న రామచంద్ర దీన స్థితి గురించి ఇటీవలే అందరికీ తెలిసింది. దీంతో ఈ కమెడియన్ ను ఆదుకోవాలని సినీ అభిమానులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరు స్పందిస్తున్నారు. ఇటీవలే మంచు మనోజ్ స్వయంగా రామ చంద్ర ఇంటికి వెళ్లి అతనిని పరామర్శించారు. సినీ పరిశ్రమ తరఫున సాయం అందించేందుకు తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు. తాజాగా మనం సైతం ఫౌండేషన్ నిర్వాహకులు, టాలీవుడ్ ప్రముఖ నటుడు కాదంబరి కిరణ్ రామ చంద్రను ఆదుకునేందుకు ముందుకొచ్చారు. రామచంద్ర అనారోగ్యంతో బాధపడుతున్న విషయం తెలుసుకున్న కిరణ్ రామచంద్రను హైదరాబాద్‌లోని అఅతని నివాసంలో కలిశారు. వైద్య ఖర్చుల కోసం రూ.25 వేల ఆర్థిక సాయాన్ని చెక్ రూపంలో అందించారు. ఈ సందర్భంగా రామచంద్రకు ధైర్యంగా ఉండాలని భరోసా కల్పించారు.
రామ చంద్ర సుమారు 100కు పైగా సినిమాల్లో నటించాడు. వెంకీ, ఆనందం, సొంతం, కింగ్, దుబాయి శీను, లౌక్యం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తన కామెడీతో ఆడియెన్స్ ను కడుపుబ్బా నవ్వించాడు. ఎక్కువగా హీరో ఫ్రెండ్ గా నటించి గుర్తింపు తెచ్చుకున్నాడీ ట్యాలెంటెడ్ యాక్టర్. అయితే కొన్నేళ్ల క్రితం రామ చంద్ర ఓ రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. అప్పటి నుంచే సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. దీనికి తోడు పెరాలసిస్ సోకడంతో ఇప్పుడు పూర్తిగా మంచానికే పరిమితమయ్యాడు. అయితే తనలో ఇంకా నటించే సామర్థ్యం ఉందని, తనకు సినిమా అవకాశాలు కల్పించాలని రామ చంద్ర కోరుతున్నాడు.
రామ చంద్రకు చెక్ అందజేస్తోన్న నటుడు కాదంబరి కిరణ్..
View this post on Instagram
అంతకు ముందు మంచు మనోజ్ రామచంద్ర దీన స్థితిని తెలుసుకుని నేరుగా అతని ఇంటి కెళ్లి పరామర్శించారు. తన వంతు సాయం చేస్తానని భరోసా ఇచ్చారు. అలాగే సినీ పరిశ్రమ తరఫున సాయం అందేలా చూస్తానని ధైర్యం కల్పించారు.
రామచంద్ర ఇంట్లో మంచు మనోజ్..
#ManchuManoj met comedian Ramachandra, who is going through health issues related to paralysis.pic.twitter.com/M84yGNvZoM
— Filmy Bowl (@FilmyBowl) September 1, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








