నిర్మాతలు సారీ చెప్పారు..కంగనా మాత్రం డోంట్ కేర్ అంటుంది!

ముంబై: మంచి నటిగా కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది హీరోయిన్ కంగనా రనౌత్. తాజాగా ఆమె ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ అనే మూవీలో నటించింది. రీసెంట్ ఈ సినిమాలోని ఓ పాటను ముంబయిలో విడుదల చేశారు. ఆ సందర్భంలో ఓ జర్నలిస్టుపై కంగన నోరుపారేసుకున్నారు. సదరు జర్నలిస్ట్ ‘మణికర్ణిక’ సినిమాకు తక్కువ రేటింగ్‌ ఇచ్చారని, సినిమాకు వ్యతిరేకంగా రివ్యూ రాశాడని ప్రెస్ మీట్‌లో మండిపడ్డారు. కంగనా వ్యాఖ్యలకు ఆ జర్నలిస్ట్ కూడా ఘాటుగానే బదులిచ్చాడు. కాసేపు […]

నిర్మాతలు సారీ చెప్పారు..కంగనా మాత్రం డోంట్ కేర్ అంటుంది!
Follow us
Ram Naramaneni

|

Updated on: Jul 10, 2019 | 3:16 PM

ముంబై: మంచి నటిగా కంటే వివాదాలతోనే ఎక్కువగా వార్తల్లో నిలుస్తుంది హీరోయిన్ కంగనా రనౌత్. తాజాగా ఆమె ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ అనే మూవీలో నటించింది. రీసెంట్ ఈ సినిమాలోని ఓ పాటను ముంబయిలో విడుదల చేశారు. ఆ సందర్భంలో ఓ జర్నలిస్టుపై కంగన నోరుపారేసుకున్నారు. సదరు జర్నలిస్ట్ ‘మణికర్ణిక’ సినిమాకు తక్కువ రేటింగ్‌ ఇచ్చారని, సినిమాకు వ్యతిరేకంగా రివ్యూ రాశాడని ప్రెస్ మీట్‌లో మండిపడ్డారు. కంగనా వ్యాఖ్యలకు ఆ జర్నలిస్ట్ కూడా ఘాటుగానే బదులిచ్చాడు. కాసేపు ప్రెస్ మీట్ ప్రాంగణం గందరగోళంగా మారింది.

దీంతో కంగన క్షమాపణలు చెప్పాలని ‘ఎంటర్‌టైన్‌మెంట్‌ జర్నలిస్ట్స్‌ గిల్డ్ ఆఫ్ ఇండియా’ డిమాండ్ చేసింది. లేనిపక్షంలో కంగనను బహిష్కరిస్తామని, ఆమె సినిమాలకు  సంబంధించి ఎటువంటి ప్రచారం చేయమని పేర్కొంది. దీంతో ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ నిర్మాణ సంస్థ బాలాజీ మోషన్‌ పిక్చర్స్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. ఈ సంఘటనపై క్షమాపణలు కోరుతున్నామని పేర్కొంది. సినిమా పాట విడుదల కార్యక్రమంలో వివాదం తలెత్తిన కారణంగా క్షమాపణలు చెబుతున్నట్లు స్పష్టం చేసింది. ఇతరుల మనోభావాల్ని దెబ్బతీయడం తమ ఉద్దేశం కాదని తెలిపింది. తమ సినిమా ‘జడ్జ్‌మెంటల్‌ హై క్యా’ జులై 26న విడుదల కాబోతోందని, మీడియా ఈ సంఘటనను మర్చిపోయి ఎప్పటిలాగే సహకరించాలని కోరింది.

మరోపక్క కంగన క్షమాపణలు చెప్పే ప్రసక్తే లేదని ఆమె సోదరి రంగోలి ట్వీట్‌ చేశారు. ‘కంగన సారీ చెప్పదు. ఆమెను క్షమాపణలు చెప్పమని అడిగే అర్హత మీకు లేదు. మీలాంటి దేశ ద్రోహుల్ని, తప్పుడు వ్యక్తుల్ని కంగన సరైన మార్గంలో పెడుతుంది’ అని పోస్ట్‌ చేశారు. అయితే కంగన, రంగోలి తీరును నెటిజన్లు తప్పుపట్టారు.