Devara Movie: దేవర మాస్ జాతర షురు.. ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది.. ఇక విధ్వంసమే..

ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ చూస్తుంటే ఈసారి థియేటర్లలో తారక్ ఏ స్థాయిలో తుఫాన్ సృష్టించనున్నాడో అర్థమవుతుంది. ఇందులో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే.. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. దీంతో ఇప్పుడే సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ సందడి మొదలు పెట్టారు. అలాగే ఈసారి బర్త్ డే కానుకగా దేవర అప్డేట్ రావడం ఖాయమని తెలుస్తోంది.

Devara Movie: దేవర మాస్ జాతర షురు.. ఫస్ట్ సింగిల్ అప్డేట్ వచ్చేసింది.. ఇక విధ్వంసమే..
Jr.NTR's Devara
Follow us
Rajitha Chanti

|

Updated on: May 15, 2024 | 9:35 PM

ప్రస్తుతం పాన్ ఇండియా మూవీ లవర్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో దేవర ఒకటి. ట్రిపుల్ ఆర్ తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న ఈ మూవీపై ఓ రేంజ్ లో హైప్ నెలకొంది. డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో తారక్ పూర్తిగా మాస్ అవతారంలో కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్, గ్లింప్స్ చూస్తుంటే ఈసారి థియేటర్లలో తారక్ ఏ స్థాయిలో తుఫాన్ సృష్టించనున్నాడో అర్థమవుతుంది. ఇందులో బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ కథానాయికగా ఎన్టీఆర్ సరసన నటిస్తుంది. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది. ఇదిలా ఉంటే.. మే 20న ఎన్టీఆర్ పుట్టినరోజు. దీంతో ఇప్పుడే సోషల్ మీడియాలో తారక్ ఫ్యాన్స్ సందడి మొదలు పెట్టారు. అలాగే ఈసారి బర్త్ డే కానుకగా దేవర అప్డేట్ రావడం ఖాయమని తెలుస్తోంది.

తారక్ పుట్టినరోజు సందర్భంగా దేవర నుంచి సాంగ్ లేదా టీజర్ వస్తుందని అభిమానులు అనుకున్నారు. అయితే ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ రాబోతుందని టాక్ నడిచింది. ఈ క్రమంలోనే ఫ్యాన్స్ ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ దేవర ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. మే 20న తారక్ బర్త్ డే సందర్భంగా మే 19న ఫీయర్ సాంగ్ విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ రిలీజ్ చేశారు. పెను తుఫాను కోసం అంతా సెట్ చేశాం. #Fear Song మే 19న తీరాన్ని చుట్టుముట్టి సునామీని సృష్టిస్తుంది అంటూ చిత్రయూనిట్ రాసుకొచ్చింది. ఇక ఎన్టీఆర్ కత్తి పట్టుకున్న మాస్ పోస్టర్ షేర్ చేసింది. దీంతో ఇప్పుడు దేవర మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. దేవర చిత్రాన్ని అక్టోబర్ 10న రిలీజ్ చేయనున్నారు.

ఇదిలా ఉంటే ఎన్టీఆర్ ఇటు దేవర సినిమాతోపాటే.. అటు బాలీవుడ్ ఇండస్ట్రీలోనూ అడుగుపెడుతున్నారు. బీటౌన్ హీరో హృతిక్ రోషన్ నటిస్తున్న వార్ 2 చిత్రంలో తారక్ కీలకపాత్రలో కనిపించనున్నారు బ్రహ్మాస్త్ర మూవీ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మే 20న ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా వార్ 2 నుంచి తారక్ ఫస్ట్ లుక్ రివీల్ చేయనున్నట్లు సమాచారం. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.