Keerthy Suresh: ఇది మహానటి రేంజ్.. సినిమాల్లోకి వచ్చాకా కీర్తి సురేష్ ఎంత సంపాదించిందంటే..

ప్రస్తుతం వరుణ్ సందేశ్ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తున్న కీర్తి అప్పుడే మరో ఆఫర్ అందుకుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం 17.7 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో కీర్తి ఒకరు. కోలీవుడ్ మూవీ నిర్మాత సురేశ్ కుమార్, నటి మేనక దంపతుల చిన్న కుమార్తే కీర్తి సురేష్. బాలనటిగా సినీ ప్రయాణం మొదలుపెట్టింది.

Keerthy Suresh: ఇది మహానటి రేంజ్.. సినిమాల్లోకి వచ్చాకా కీర్తి సురేష్ ఎంత సంపాదించిందంటే..
Keerthy Suresh
Follow us
Rajitha Chanti

|

Updated on: May 15, 2024 | 9:18 PM

దక్షిణాదిలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్లలో కీర్తి సురేశ్ ఒకరు. అతి తక్కువ సమయంలోనే సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ బ్యూటీ.. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో అనేక చిత్రాల్లో నటించింది. తెలుగులో మహానటి సినిమాతో ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకుంది కీర్తి. అందం, టాలెంట్ ఎంతగా ఉన్నా.. ఈ బ్యూటీకి ఇప్పుడు అవకాశాలు రావడం లేదు. ప్రస్తుతం కీర్తి బాలీవుడ్ పై ఫోకస్ పెట్టంది. అక్కడే వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం వరుణ్ సందేశ్ సరసన ఓ ప్రాజెక్ట్ చేస్తున్న కీర్తి అప్పుడే మరో ఆఫర్ అందుకుందని టాక్ వినిపిస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం 17.7 మిలియన్స్ ఫాలోవర్స్ ఉన్నారు. సినీ పరిశ్రమలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్లలో కీర్తి ఒకరు. కోలీవుడ్ మూవీ నిర్మాత సురేశ్ కుమార్, నటి మేనక దంపతుల చిన్న కుమార్తే కీర్తి సురేష్. బాలనటిగా సినీ ప్రయాణం మొదలుపెట్టింది.

2013లో మలయాళంలో తెరకెక్కించిన హార్రర్ కామెడీ గీతాంజలి చిత్రంలో కథానాయికగా నటించింది. అలాగే నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసుల అందుకున్న కీర్తి.. ఆ తర్వాత మహానటి సినిమాతో విమర్శకులను మెప్పించింది. ఆ తర్వాత దక్షిణాదిలోని అన్ని భాషలలో వరుస ఆఫర్స్ అందుకుంటూ అగ్రకథానాయికగా నిలిచింది. ఇప్పటివరకు కీర్తి నికర విలువ సుమారు రూ.41 కోట్లు అని సమాచారం. నెలకు దాదాపు రూ..35 లక్షలు సంపాదిస్తుంది. సంవత్సరానికి రూ.4 కోట్లు. సినిమాలు మాత్రమే కాకుండా ప్రకటనలు, టెలివిజన్ కార్యక్రమాలతో రాబడుతుంది. ఒక్కో సినిమాకు రూ.4 కోట్ల వరకు పారితోషికం తీసుకుంటుంది.

కీర్తి సురేష్ ప్రతి ఎండార్స్‌మెంట్‌కు INR 30 లక్షల వరకు వసూలు చేస్తుంది. ఇన్ స్టాలో ప్రతి స్పాన్సర్ చేసిన పోస్ట్‌కు రూ.25 లక్షలు తీసుకుంటుందట. చెన్నైలో విలాసవంతమైన ఇల్లు కలిగి ఉంది. హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ ప్రాంతంలో ఓ అపార్ట్‌మెంట్ కూడా ఉంది. కీర్తి వద్ద 60 లక్షల విలువైన వోల్వో S90, INR 1.38 కోట్ల విలువైన BMW 7 సిరీస్ 730Ld , INR 81 లక్షల ధర కలిగిన Mercedes Benz AMG GLC43 , ఒక Toyota ఇన్నోవా కలిగి ఉంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.