AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr NTR: పుట్టిన రోజు ముందే అమ్మ కలను నిజం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. త‌ల్లితో క‌లిసి ఆ ప్రముఖ దేవాలయానికి..

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్‌ ను దర్శించుకున్నారు. అతని వెంట ఆమె తల్లి, కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్వ‌యంగా ఎన్టీఆరే వెల్ల‌డించారు. ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ విజిట్ కు సంబంధించి న ఫొటోలు షేర్ చేస్తూ..

Jr NTR: పుట్టిన రోజు ముందే అమ్మ కలను నిజం చేసిన జూనియర్ ఎన్టీఆర్.. త‌ల్లితో క‌లిసి ఆ ప్రముఖ దేవాలయానికి..
Jr NTR, Rishab Shetty
Basha Shek
|

Updated on: Aug 31, 2024 | 5:22 PM

Share

టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్‌ ను దర్శించుకున్నారు. అతని వెంట ఆమె తల్లి, కన్నడ స్టార్ హీరో రిషబ్ శెట్టి, కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా స్వ‌యంగా ఎన్టీఆరే వెల్ల‌డించారు. ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ విజిట్ కు సంబంధించి న ఫొటోలు షేర్ చేస్తూ.. అమ్మ‌ పుట్టిన రోజుకు కేవ‌లం రెండు రోజుల ఇలా చేయ‌డం ఆమెకు తానిచ్చిన అత్యుత్త‌మ బ‌హుమ‌తి అని ఎమోషనల్ అయ్యాడు. ‘నన్ను తన స్వగ్రామం కుందాపురానికి తీసుకొచ్చి ఉడిపి శ్రీకృష్ణ మఠంలో దర్శనం చేసుకోవాలనే మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది! సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు జరిగేలా చేయడం నేను ఆమెకు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి’ అని ఎన్టీఆర్ సామాజిక మాధ్యమాల వేదికగా రాసుకొచ్చారు. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైర‌ల్‌గా మారాయి. కాగా రిషబ్ శెట్టి ఎన్టీఆర్, అతని తల్లిని స్వయంగా ఉడిపికి తీసుకెళ్లి దర్శనం చేయించారు. జూనియర్ ఎన్టీఆర్ తల్లి స్వస్థలం ఉడిపి. కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కు కర్ణాటకతో ప్రత్యేక బంధం ఉంది. కన్నడలో కూడా అనర్గళంగా మాట్లాడగలడు తారక్. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కి కన్నడ చిత్ర పరిశ్రమతో ప్రత్యేక అనుబంధం ఉంది. పునీత్ రాజ్‌కుమార్, జూనియర్ ఎన్టీఆర్ మంచి స్నేహితులు. అప్పు అంతిమ సంస్కారాల్లోనూ పాల్గొన్నారు తారక్. ఇప్పుడు రిషబ్ శెట్టితో కలిసి ఉడిపి కృష్ణుడిని దర్శించుకోవడానికి వచ్చారు.

ఇక ఎన్టీఆర్, రిషబ్ శెట్టిల మధ్య మంచి అనుబంధం ఉంది. ఇటీవల జాతీయ అవార్డును సొంతం చేసుకున్న రిషబ్ కు అభినందనలు కూడా తెలిపాడు తారక్. ఇక సినిమాల విషయానికి వస్తే…

ఇవి కూడా చదవండి

ఉడిపి శ్రీకృష్ణ టెంపుల్ లో ఎన్టీఆర్ ఫ్యామిలీ..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Jr NTR (@jrntr) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే చిత్రంలో జూ ఎన్టీఆర్ నటిస్తున్నాడు. పూజా కార్యక్రమాలతో ఇటీవలే ఈ సినిమా ప్రారంభమైంది. మరికొద్ది రోజుల్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని, ఈ సినిమా షూటింగ్ కంటే ముందే దేవుడి దర్శనం, ఆశీస్సులు పొందేందుకు జూనియర్ ఎన్టీఆర్ కర్ణాటకకు వచ్చారు. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ ‘దేవర’ అనే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. అలాగే హిందీలో హృతిక్ రోషన్ తో కలిసి ‘వార్’ సినిమా షూటింగ్‌ లోనూ తారక్ పాల్గొనాల్సి ఉంది.

రిషబ్, ప్రశాంత్ నీల్ లతో ఎన్టీఆర్..

Instagramలో ఈ పోస్ట్‌ని వీక్షించండి

Jr NTR (@jrntr) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..