AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jr.NTR: కొత్త కారు కొన్న గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్.. ధర ఎంతో తెలుసా ?..

ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మూవీపై అంచనాలను క్రియేట్ చేసింది. ఇటీవలే గోవాలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ కొత్త కారు కొన్నట్లు తెలుస్తోంది. తన న్యూకార్ రిజిస్ట్రేషన్ కోసం ఈరోజు ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి వచ్చారు

Jr.NTR: కొత్త కారు కొన్న గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్.. ధర ఎంతో తెలుసా ?..
Jr.ntr
Rajitha Chanti
|

Updated on: Apr 02, 2024 | 8:53 PM

Share

గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర షూటింగ్‏లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మాస్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ మాస్ యాక్షన్ మూవీలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుంది. అలాగే ఇందులో బీటౌన్ హీరో సైఫ్ అలీ ఖాన్ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మూవీపై అంచనాలను క్రియేట్ చేసింది. ఇటీవలే గోవాలో ఈ మూవీ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన సంగతి తెలిసిందే. త్వరలోనే మరో కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుంది. ఈ చిత్రాన్ని అక్టోబర్ నెలలో రిలీజ్ చేయనున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఎన్టీఆర్ కొత్త కారు కొన్నట్లు తెలుస్తోంది. తన న్యూకార్ రిజిస్ట్రేషన్ కోసం ఈరోజు ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి వచ్చారు తారక్. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ వైరలవుతున్నాయి.

అందులో తారక్ బ్లాక్ టి షర్ట్, కూలింగ్ గ్లాసెస్ ధరించి స్టైలిష్ గా కనిపిస్తున్నారు. ఎన్టీఆర్ కొత్తగా కొన్న కారు నౌటిక్ బ్లూ లా కనిపిస్తుంది. ఇక కారు ఫీచర్స్ విషయానికి వస్తే… Mercedes-Benz Maybach S-Class S 580 అని తెలుస్తోంది. ఈ కారు విలువ మార్కెట్ లో దాదాపు రూ. 2.72 కోట్లకు పైగా ఉంటుందని అంచనా. నిజానికి తారక్ కు కార్లంటే చాలా ఇష్టం. ఇప్పటికే ఆయన దగ్గర చాలా కార్లు ఉన్నాయి. దేశంలోనే అత్యంత ఖరీదైన కార్లు కూడా ఉన్నాయి. అందులో Mercedes-Benz GLS, Lamborghini Urus, Range Rover Vogue, BMW 7-Series, Porsche 718 Cayman ఉన్నట్లు సమాచారం. ఇక ఇప్పుడు తారక్ గ్యారెజీలోకి మరో కారు వచ్చి చేరింది.

ఇదిలా ఉంటే.. దేవర సినిమానే కాకుండా తారక్ బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. హిందీలో రూపొందుతున్న వార్ 2లో ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో తారక్ తోపాటు.. హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నా్రు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. యష్ రాజ్ ఫిలిమ్స్ నిర్మిస్తోన్న ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీకి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో హృతిక్, తారక్ మధ్య హై-ఆక్టేన్ యాక్షన్ సన్నివేశాలు ఉండనున్నట్లు తెలుస్తోంది. ఏప్రిల్ చివరివారంలో వార్ 2 చిత్రీకరణలో తారక్ జాయిన్ కానున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ కోసం దాదాపు 50 రోజుల డేట్స్ కేటాయించాడు ఎన్టీఆర్.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.