- Telugu News Photo Gallery Chiru Vishwambhara in the action sequence.. that scenes turning point of the movie
Vishwambhara: యాక్షన్ స్వీక్వెన్స్ లో విశ్వంభర.. ఆ సీన్స్ సినిమాకే టర్నింగ్ పాయింట్!
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం విశ్వంభర మరోసారి వార్తల్లో నిలిచింది. వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది.
Updated on: Apr 02, 2024 | 10:12 PM

మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం విశ్వంభర మరోసారి వార్తల్లో నిలిచింది. వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. త్రిష కృష్ణన్ కథానాయికగా నటిస్తోంది.

హైదరాబాద్ అల్యూమినియం ఫ్యాక్టరీలో చిరంజీవితో పాటు ఫైటర్స్ తో కూడిన యాక్షన్ సీక్వెన్స్ సన్నివేశాలపై షూట్ చేసింది చిత్ర బృందం. ఫైట్ మాస్టర్స్ ద్వయం రామ్-లక్ష్మణ్ పర్యవేక్షణలో సాగే ఈ సన్నివేశం ప్రేక్షకులను కట్టిపడేయడం ఖాయమని టాక్.

యువీ క్రియేషన్స్ పతాకంపై విక్రమ్, వంశీ, ప్రమోద్ నిర్మిస్తున్న ఈ చిత్రం అత్యున్నత స్థాయి, సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కుతుండటంతో ఈ మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

ఆస్కార్ అవార్డు గ్రహీత ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, శ్రీ శివశక్తి దత్తా, చంద్రబోస్ సాహిత్యం అందిస్తున్నారు. 2025 జనవరి 10న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకురానుంది.

మెగాస్టార్ చిరంజీవి చాలా రోజుల తర్వాత సొషియో ఫాంటసీ చేస్తుండటంతో విశంభర మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమా జగదేకవీరుడు, అతిలోక సుందరి సినిమా స్టైల్ లో ఉంటుందని టాక్ వినిపించడంతో అభిమానుల్లో మరింత బజ్ ఉంది.





























