Fiber Rich Foods: జీర్ణ ఆరోగ్యానికి మేలు చేసే ఫైబర్ అధికంగా ఉండే ఆహారాలు ఇవే.. తప్పక తీసుకోండి
ఆహారంలో పీచు లేకపోతే కొలెస్ట్రాల్, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు దండెత్తుతాయి. దీంతో మలబద్ధకం సమస్య తలెత్తుతుంది. బరువు కూడా పెరుగుతారు. మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే పోషకాహారం చాలా అవసరం. ఫైబర్ నీటిలో కరిగి ఒక జెల్‌ను ఏర్పరుస్తుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. విటమిన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు, ఇతర పోషకాలను గ్రహించడంలో కూడా ఇది సహాయపడుతుంది..