RRR Movie: హైదరాబాద్ చేరుకున్న ఆర్ఆర్ఆర్ బ్రదర్స్.. ఫోటోస్ వైరల్..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీకి దర్శకధీరుడు

RRR Movie: హైదరాబాద్ చేరుకున్న ఆర్ఆర్ఆర్ బ్రదర్స్.. ఫోటోస్ వైరల్..
Charan Ntr
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 20, 2021 | 8:03 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తోన్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ మూవీకి దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో అలియా భట్, ఒలివియా మోరీస్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. డీవీవీ ఎంట‌ర్ టైన్ మెంట్స్ బ్యాన‌ర్‌పై డీవీవీ దాన‌య్య ఈ మూవీని నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‏తో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే దాదాపు పూర్తైన ఈ సినిమాలోని రెండు పాటలను చిత్రీకరించడానికి రామ్ చరణ్, ఎన్టీఆర్, చిత్రయూనిట్ ఉక్రెయిన్ వెల్లిన సంగతి తెలిసిందే. అక్కడి వీరిద్దరితో కలిసి తీసే పాటల చిత్రీకరణ పూర్తి కావడంతో బుధవారం రాత్రి ఆర్ఆర్ఆర్ బృందం తిరిగి హైదరాబాద్‏కు చేరుకుంది. వీరిద్దరు ఎయిర్ పోర్ట్‏లో నుంచి వస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఉక్రెయిన్ నుంచి నిన్న రాత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టులో తారక్, చరణ్ నడిచివస్తున్న ఫోటోలను అక్కడున్న కొందరు తమ కెమెరాలో బంధించి నెట్టింట్ల అప్‏లోడ్ చేశారు. అలాగే ఇటీవల షూటింగ్ కంప్లీట్ చేసుకుని సెలబ్రెషన్స్ జరుపుకున్న ఫోటోలు సైతం నెట్టింట్లో తెగ హల్‏చల్ చేశాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతరామరాజు పాత్రలో, ఎన్టీఆర్ కొమరం భీం పాత్రలో నటిస్తుండగా.. బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ సీత పాత్రలో కనిపించనుంది. అలాగే ఈ సినిమాలో శ్రియా శరణ్, అజయ్ దేవ్‏గన్‏లు కీలక పాత్రలలో నటించారు. ఇద్దరు స్టార్ హీరోలు ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ మల్టీస్టారర్ మూవీ పై మొదటి నుంచి అంచనాలు భారీగానే ఉన్నాయి. ఈ సినిమాను చూసేందుకు తారక్, చరణ్ అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఆర్ఆర్ఆర్ సినిమాను అక్టోబర్ 13న విడుదల చేయబోతున్నట్లుగా ఇప్పటికే చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఇటీవల ఈ మూవీ నుంచి విడుదలైన ప్రమోషన్ సాంగ్ దోస్తీకి మంచి రెస్పాన్స్ వచ్చింది.

Also Read: Bell Bottom: విడుదలైన గంటల్లోనే బెల్ బాటమ్ లీక్.. ఆన్‏లైన్‏లో అక్షయ్ కుమార్ సినిమా..

Naveen Polishetty: మరో ప్రాజెక్ట్‏కు నవీన్ పోలిశెట్టి గ్రీన్ సిగ్నల్, డైరెక్టర్ ఎవరంటే..

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే