Bell Bottom: విడుదలైన గంటల్లోనే బెల్ బాటమ్ లీక్.. ఆన్‏లైన్‏లో అక్షయ్ కుమార్ సినిమా..

కరోనా వైరస్ కారణంగా సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించింది. మొదటి వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ

Bell Bottom: విడుదలైన గంటల్లోనే బెల్ బాటమ్ లీక్.. ఆన్‏లైన్‏లో అక్షయ్ కుమార్ సినిమా..
Bell Bottom
Follow us
Rajitha Chanti

|

Updated on: Aug 20, 2021 | 7:03 AM

కరోనా వైరస్ కారణంగా సినీ పరిశ్రమపై తీవ్ర ప్రభావం చూపించింది. మొదటి వేవ్ తర్వాత థియేటర్లు తెరుచుకున్నప్పటికీ సెకండ్ వేవ్ రూపంలో మరోసారి చిత్రపరిశ్రమ తీవ్ర ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంది. ఇక కోవిడ్ కేసులు తగ్గడంతో థియేటర్లు ఓపెన్ అయ్యి ఇప్పుడిప్పుడే సినిమాలు విడుదలవుతున్నాయి. కేవలం దక్షిణాదిలో మాత్రమే కాకుండా.. బాలీవుడ్ సినిమాలు కూడా థియేటర్లలో విడుదలవుతున్నాయి. ఈ క్రమంలో రోటీన్ కథలకు భిన్నంగా కంటెంట్ ప్రాధాన్యత స్టోరీలతో ప్రేక్షకులను మెప్పించే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. తాజాగా అక్షయ్ కుమార్, లారా దత్తా, వాణి కపూర్, హుమా ఖురేషి ప్రధాన పాత్రలలో నటించిన చిత్రం బెల్ బాటమ్. ఈ మూవీ ఆగస్ట్ 19న థియేటర్లలో విడుదలైంది. దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు రంజిత్ ఎం. తివారి దర్శకత్వం వహించారు. అయితే ఈ సినిమాకు లీకుల బాధ తప్పలేదు.

విడుదలైన కొన్ని గంటలలోనే ఆన్‏లైన్ సైట్స్‏లలో సినిమా మొత్తం ప్రత్యక్షమయ్యింది. తమిళ రాకర్స్, ఫిల్మ్ వాప్, ఇతర పైరేటెడ్ వెబ్‏సైట్స్‏లో బెల్ బాటమ్ hd నాణ్యతతో అందుబాటులో ఉంది. మొదటి షో ద్వారా హిట్ అందుకుని.. విమర్శకుల ప్రశంసలు పొందింది ఈ సినిమా. కానీ ఇప్పడు సోషల్ మీడియాలో ఈ మూవీ లీక్ కావడంతో థియేటర్ల కలెక్షన్స్ పై తీవ్ర ప్రభావం చూపనుంది. ఈ సినిమా దేశ వ్యా్ప్తంగా విడుదలై హిట్ టాక్ అందుకుంది. కానీ మహారాష్ట్రలో మాత్రమే విడుదల కాలేదు. అయితే సినిమా విడుదలైన గంటలలో లీక్ కావడం ఇదేం మొదటి సారి కాదు.. గతంలోనూ భారీ బడ్జెట్ చిత్రాలు లీక్ అయ్యాయి. దీంతో కలెక్షన్లపై తీవ్ర ప్రభావం చూపించింది. ఇటీవల సల్మాన్ ఖాన్ నటించిన రాధే సినిమా సైతం లీక్ అయ్యింది.

View this post on Instagram

A post shared by Akshay Kumar (@akshaykumar)

ప్రస్తుత పరిస్థితులలో అక్షయ్ తన సినిమాను ధైర్యంగా థియేటర్లలో విడుదల చేయడంతో పలువురు సినీ ప్రముఖులు బెల్ బాటమ్ చిత్ర యూనిట్‎కు అభినందనలు తెలిపారు. 1984 ఆగస్ట్ 24న కొందరు ఉగ్రవాదులు డిల్లీ విమానాశ్రయం నుంచి విమానాన్ని హైజాక్ చేస్తారు. అలా ఐదు విమానాలను హైజాక్ చేస్తుంటారు. వరుసగా విమానాలను హైజాక్‌ చేసి పాకిస్థాన్‌లోని వివిధ ప్రాంతాల్లో ల్యాండ్‌ చేస్తుంటారు. హైజాకర్స్‌కు, భారత ప్రభుత్వానికి మధ్య పాకిస్థాన్‌ అధికారులు సమన్వయం చేస్తూ ప్రయాణికులను విడిపిస్తుంటారు. ఇక ఇందిరా గాందీ (లారా దత్త) రా ఏజెంట్ అన్షుల్ మల్హోత్ర అలియాస్‌ బెల్‌బాటమ్‌ (అక్షయ్‌కుమార్‌) హైజాక్ అయిన విమానాన్ని ఎలా కాపాడాడు అనేది బెల్ బాటమ్.

Also Read: Sai Dharam Tej – Vaishnav Tej: మెగా బ్రదర్స్ మధ్య బాక్సాఫీస్ వార్.. వారం గ్యాప్‌లో రిలీజ్ అవుతున్న సినిమాలు..

Nayanthara : మెగాస్టార్ లూసిఫర్ రీమేక్‌లో నయనతార పాత్ర అదేనా..? క్లారిటీ వచ్చేసినట్టే.. ?