Gangubai Kathiawadi case: ఆలియా భట్, సంజయ్‌ లీలా భన్సాలీకి ఊరట.. ‘గంగుబాయి కఠియావాడి’ కేసులో మధ్యంతర స్టే విధించిన బాంబే హైకోర్టు..

Gangubai Kathiawadi defamation case: అలియాభట్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గంగూబాయ్ కతియావాడి’

Gangubai Kathiawadi case: ఆలియా భట్, సంజయ్‌ లీలా భన్సాలీకి ఊరట.. 'గంగుబాయి కఠియావాడి' కేసులో మధ్యంతర స్టే విధించిన బాంబే హైకోర్టు..
Gangubai Kathiawadi
Follow us
uppula Raju

| Edited By: Ravi Kiran

Updated on: Aug 20, 2021 | 6:32 AM

Gangubai Kathiawadi defamation case: అలియాభట్, దర్శకుడు సంజయ్ లీలా బన్సాలీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘గంగూబాయ్ కతియావాడి’ సినిమా విషయంలో ఇద్దరిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు విచారణపై మధ్యంతర స్టే విధించాలని బాంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో అలియా భట్, చిత్రనిర్మాత సంజయ్ లీలా భన్సాలీలకు కొంచెం ఊరట లభించింది. ముంబై మాఫియా క్వీన్ ‘గంగూబాయి’ జీవిత కథ ఆధారంగా తెరకెక్కిస్తు ఈ సినిమాపై గంగూబాయి కుమారుడు బాబూజీ రాజీ షా అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టుకెక్కారు. దీంతో గతంలో ఈ ఇద్దరికీ కోర్టు షోకాజ్ నోటీసులు జారీ చేసింది.

ఈ విషయంపై ఆలియా, సంజయ్ తరపు న్యాయవాది బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. అక్కడ ఆగష్టు 10 న విచారణ జరిగింది. దీంతో స్థానిక కోర్టులో జరుగుతున్న కేసు విచారణపై మధ్యంతర స్టే విధిస్తూ తదుపరి విచారణ అంటే సెప్టెంబర్ 7 వరకు జరగాలని బోంబే హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయితే ఈ చిత్రం మొదట గత ఏడాది సెప్టెంబర్‌లో థియేటర్లలో విడుదల కావాల్సి ఉంది అయితే అనుకోని కారణాలవల్ల వాయిదా పడింది. ఆతర్వాత కరోనా మహమ్మారి కారణంగా మరింత ఆలస్యం అయ్యింది. ఇలాంటి సమయంలో ఈ సినిమా విడుదల పై ఉత్కంఠ నెలకొంది.

ఈ సినిమాపై బాబూజీ రాజీ షా మాట్లాడుతూ.. ఈ సినిమా ది మాఫియా క్వీన్స్ ఆఫ్ ముంబై నవల ఆధారంగా నిర్మిస్తున్నారని పేర్కొన్నారు. నవలలో చెప్పిన కొన్ని విషయాలు అవమానకరంగా ఉన్నాయని, ఇవి గంగుబాయి కాథివాడి ప్రతిష్టను దిగజార్చుతున్నాయని ఆరోపించారు. ఈ విషయంపై చిత్ర నిర్మాతలు, కాపీ రైటర్‌ హుస్సేన్ జైదీపై ఆయన ఫిర్యాదు చేశారు. ఇది మాత్రమే కాదు గంగుబాయి కఠివాడి పేరు మళ్లీ వినిపించిన తర్వాత అతని కుటుంబం ప్రజల నుంచి దూషణలు, వేధింపులను ఎదుర్కొంటోందని పేర్కొన్నాడు.

Viral Photos: కుక్కల పెళ్లికి మనుషుల హడావిడి..! BMW కారు.. కమ్మని విందు..

పదో తరగతి పాస్‌ కాలేదు కానీ ముఖ్యమంత్రిగా పని చేశాడు..! 86 ఏళ్ల వయసులో ఇంగ్లీష్ పరీక్ష రాస్తున్నాడు..

Crime News: సంబరాల కోసం అంబులెన్స్‌లను వాడుకున్న యువకులు.. డ్రైవర్లతో సహా నలుగురిపై కేసు నమోదు

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే