War 2 Pre Release Event Highlights: గ్రాండ్‌గా వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్.. ఆయన ఆశీస్సులు ఉన్నంతకాలం నన్ను ఎవరూ ఆపలేరు.. ఎన్టీఆర్..
వార్ 2. ప్రస్తుతం భారతీయ సినీప్రియులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాల్లో ఇది ఒకటి. బాలీవుడ్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఇందులో కియారా అద్వానీ కథానాయికగా కనిపించింది. స్పై యాక్షన్ డ్రామాగా వస్తున్న ఈ మూవీ ఇద్దరు స్టార్ హీరోల స్టైల్, యాక్షన్, డైలాగ్స్ అభిమానులను ఆకట్టుకున్నాయి.

మ్యాన్ ఆఫ్ మస్సెస్ ఎన్టీఆర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ వార్ 2, దేవర లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలు నెలకొన్నాయి. అలాగే ఈ సినిమాలో తారక్ తో పాటు బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ కూడా నటిస్తున్నాడు. దాంతో ఈ సినిమాపై హైప్స్ తారా స్థాయికి చేరాయి. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా సాంగ్స్, పోస్టర్స్, టీజర్స్ సినిమా పై ఆసక్తి పెంచాయి. కాగా ఈ భారీ సినిమాను ఆగస్టు 14న వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల చేయనున్నారు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమా ప్రమోషన్స్ స్పీడ్ పెంచారు చిత్రయూనిట్. ఈ క్రమంలోనే వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో గ్రాండ్ గా ఏర్పాటు చేశారు.
ఈ ఈవెంట్ కు తారక్ అభిమానులు భారీగా తరలి వచ్చారు. అభిమానులకు ఇబందులు కలగకుండా ఈవెంట్ నిర్వాహకులు చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. YRF స్పై యూనివర్స్ లో భాగంగా తెరకెక్కించిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల విడుదల హక్కులను దక్కించుకున్నారు నిర్మాత నాగవంశీ. ఈ సినిమాను స్పెయిన్, జపాన్, అబుదాబి వంటి ప్రాంతాల్లో చిత్రీకరించారు. వార్ 2 సినిమాను రూ.210 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.
ఈ సినిమా నయా రికార్డ్స్ క్రియేట్ చేయడం ఖాయం అంటున్నారు తారక్ అభిమానులు. వార్ 2లో యాక్షన్ సీన్ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడతాయిని చిత్రయూనిట్ చెప్తుంది. మరి ఈ మూవీ విడుదల తర్వాత ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
LIVE NEWS & UPDATES
-
సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి.. ఎన్టీఆర్.
సినిమాలో చాలా ట్విస్టులు ఉన్నాయి..కానీ వాటిని మీరు బయటకు పెట్టకండి. దయచేసి ఈ సినిమాను ఎంజాయ్ చేయండి. డబుల్ కాలర్ ఎత్తాను.. కుమ్మేద్దం. మళ్లీ వార్ 2 సక్సెస్ మీట్ కు కలుద్దాం.
-
25 ఏళ్ల క్రితం అభిమానిని గుర్తుపెట్టుకున్న తారక్.
25 సంవత్సరాల క్రితం నిన్ను చూడాలని అనే సినిమాతో నా కెరీర్ స్టార్ట్ అయ్యింది. శ్రీ రామోజీరావు గారు నన్ను ఆయన బ్యానర్ లో నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. 25 ఏళ్ల క్రితం ఆ సినిమా ఓపెనింగ్ కోసం వెళ్లినప్పుడు మా నాన్న, మా అమ్మ మాత్రమే ఉంది. కానీ మొట్ట మొదటి సారి మూజీబ్ అనే అభిమాని.. ఇప్పటికీ నాతోనే ఉన్నాడు.
-
-
హృతిక్ రోషన్ బెస్ట్ డ్యాన్సర్.. ఎన్టీఆర్..
25 సంవత్సరాల క్రితం కహో నా ప్యార్ కో సినిమా చూసినప్పుడు హృతిక్ డ్యాన్స్ చూసి మెస్మరైజ్ అయ్యాను. 25 ఏళ్ల తర్వాత ఆయన పక్కన ఆయనతోపాటు యాక్ట్ చేయడానికి.. ఆయనతో డ్యాన్స్ చేసినప్పుడు.. హృతిక్ రోషన్ ఇండియాలోనే బెస్ట్ డ్యాన్సర్. ఆయనతో కలిసి డ్యాన్స్ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను.
-
వార్ 2 నేను చేయడానికి కారణం అదే.. ఎన్టీఆర్..
“ఈరోజు ఇంత అద్భుతంగా మీ అందరితో ఈ పండగ జరుపుకోవడానికి నన్ను బాగా బలవంతపెట్టిన నాగవంశీకి థాంక్స్. బాద్షా ఈవెంట్ సమయంలో వరంగల్ లో తొక్కిసలాటలో ఓ అభిమాని చనిపోవడం నన్ను ఎంతో బాధపెట్టింది. అందుకే నేను పబ్లిక్ ఈవెంట్స్ అంటే భయపడతాను. వార్ 2 నేను చేయడానికి కారణం ఆదిత్య చోప్రా. ఈ సినిమాను నేను చేసేందుకు ఆయన నన్ను ఎంతో ఒప్పించారు. నాకు ఈ సినిమా చేసేందుకు భరోసా ఇచ్చిన ఆదిత్య చోప్రా గారికి థాంక్స్”
-
తారక్ మీకు అన్న.. నాకు తమ్ముడు.. హృతిక్..
హృతిక్ మాట్లాడుతూ.. తారక్ మీకు అన్న.. నాకు తమ్ముడు.. మనం అందరం ఒకే కుటుంబం. చాలా కాలం క్రితం క్రిష్ షూటింగ్ కోసం ఇక్కడకు వచ్చాను. తెలుగు ప్రజల అభిమానం, ప్రేమ చూసి ఆశ్చర్యపోయాను. ఇప్పుడు మరోసారి మీ ముందుకు వచ్చాను. తారక్ నేను.. కోస్టార్స్ గా స్టార్ట్ చేశాము. కానీ చివరకు ఇద్దరం బ్రదర్స్ అయ్యాం అని అన్నారు.
-
-
వార్ 2 బ్లాక్ బస్టర్ అవుతుంది.. దిల్ రాజు..
డైరెక్టర్ అయాన్ ముఖర్జీ.. కుర్రాడిలా కనిపిస్తున్నాడు.. కానీ ఇప్పటికే ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ క్రియేట్ చేశాడు. ఆగస్ట్ 14న ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంటుంది.
-
నేను ఎంతో అభిమానించే వ్యక్తి ఎన్టీఆర్.. త్రివిక్రమ్..
అందరికి నమస్కారం..ఇక్కడున్నవాళ్లంతా నాకు చాలా ఇష్టమైనవాళ్లే. నేను ఎంతో అభిమానించే వ్యక్తి నందమూరి తారకరామరావు గారు. ఆయనతో నా ప్రయాణం పాతికేళ్లు. నేను సినిమాల్లోకి రాకముందు థియేటర్లోకి వెళ్లి చూసిన సినిమా కహా నో ప్యార్ కో. మొన్న మ్యాడ్ ఫంక్షన్ లో కలిసినప్పుడు దేవర నామ సంవత్సరంగా చెప్పాను.. ఇప్పుడు హృతిక్ తారక్ నామ సంవత్సరంగా చెప్పుకుందాం. ఈ సినిమాను మీరు ఫైట్స్, యాక్షన్ సినిమాగా కాకుండా.. అందుకు మించిన సర్ ప్రైజ్ మాత్రం ఉంది. ఎన్టీఆర్ కు ఉన్న పేరే ఎలాంటి ఎమోషన్ అయినా పండిస్తారు.. ఇదొక మంచి సినిమా అవుతుందని నాకు ట్రైలర్ చూసిన తర్వాత అనిపిస్తుంది. ఒకరు హిమాలయ పర్వతం.. ఇంకొకరు వింధ్య పర్వతం. ఇద్దరిని బ్యాలెన్స్ చేస్తూ సినిమా తీయడం అంత సులభం కాదు.
-
టీజర్, ట్రైలర్‌కుమించి సినిమా ఉంటుంది: అయాన్ ముఖర్జీ
టీజర్, ట్రైలర్‌కుమించి సినిమా ఉంటుంది. సినిమా అద్భుతంగా ఉంటుంది. మీరు సినిమాలో కథను ఊహించలేరు. ఇద్దరు పెద్ద హీరోలను తీసుకొచ్చి సినిమా చేయడం అనేది పెద్ద బాధ్యత.. దానిని మేము చాలా జాగ్రత్తగా చిత్రీకరించాం అని దర్శకుడు అయాన్ ముఖర్జీ చెప్పుకొచ్చాడు
-
వార్ 2తో హృతిక్ తెలుగు సినిమాకు వస్తున్నారు..
సినిమా మాములుగా ఉండదు.. దేవరకు మించి ఈ సినిమా కలెక్షన్స్ సాధిస్తుంది. ఈ సినిమా మిమ్మల్ని ఆకట్టుకోకపోతే.. ఇంకొక సారి నా సినిమా చూడండి అని నేను అడగను అని నాగవంశీ చెప్పుకొచ్చారు. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ కు వెళ్లడం లేదు.. హృతిక్ తెలుగు సినిమాకు వస్తున్నారు.. అని చెప్పుకొచ్చారు నాగవంశీ
-
బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్‌లో అదరగొట్టిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్..
బ్లాక్ అండ్ బ్లాక్ డ్రస్‌లో అదరగొట్టిన ఎన్టీఆర్, హృతిక్ రోషన్..
-
ఎన్టీఆర్ కాళ్ళమీద పడ్డ అభిమాని..
ఎన్టీఆర్ ను చూడటానికి ఓ అభిమాని అత్యుత్సహం చూపించాడు.. తారక్ దగ్గరకు వచ్చి కాళ్లకు దండం పెట్టాడు. ఎన్టీఆర్ వద్దు అంటున్నా వినకుండా ఆ అభిమాని తారక్ కాళ్ళమీద పడ్డాడు
-
మ్యాన్ ఆఫ్ మాసెస్ గ్రాండ్ ఎంట్రీ
ఈవెంట్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ ఈవెంట్ కు గ్రాండ్ ఎంట్రీ ఇచ్చారు .హృతిక్ రోషన్ తో కలిసి ఎంట్రీ ఇచ్చాడు తారక్. ఇద్దరూ బ్లాక్ కలర్ డ్రస్ లో అదరగొట్టారు. తన ఎంట్రీతోనే ప్రీ రిలీజ్ ఈవెంట్ ను షేక్ చేశారు తారక్.
-
గెస్ట్‌గా హాజరైన త్రివిక్రమ్
ప్రీ రిలీజ్ ఈవెంట్ కు గెస్ట్ గా హాజరైన త్రివిక్రమ్ హాజరయ్యారు. త్రివిక్రమ్ తో పాటు నాగవంశీ ఈవెంట్ కు హాజరయ్యారు.
-
ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అయాన్ ముఖర్జీ..
వార్ 2 ఈవెంట్ కు ఎంట్రీ ఇచ్చిన దర్శకుడు అయాన్ ముఖర్జీ.. ఈ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకోనున్నారు ఈ యంగ్ డైరెక్టర్
-
టెంట్ అడ్డంగా ఉంది తీసేయండి: సుమ
అభిమానులకు స్టేజ్ కనిపించకుండా అడ్డంగా ఉన్న ఓ టెంట్ ను తీసేయాలని సుమ కోరారు. తమ ఇబ్బందిని అర్ధం చేసుకున్న సుమకు థాంక్స్ అక్క అంటూ ఆనందం వ్యక్తం చేశారు ఫ్యాన్స్
-
యాంకర్‌గా సుమ..
యాంకర్ సుమ తన యాంకరింగ్ తో అభిమానులను ఉత్సహపరుస్తున్నారు.
-
జనసందోహం
వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరుగుతుంది. అభిమానులతో నిండిపోయిన పోలీస్ గ్రౌండ్స్..

-
తారక్ పాటలకు అభిమానుల స్టెప్పులు
ఈవెంట్ లో తారక్ సాంగ్స్ కు అభిమానులు ఊగిపోతున్నారు. ఎన్టీఆర్ జెండాలతో హోరెత్తించారు.
-
తారక్ అభిమానుల కోలాహలం..
#WAR2 Pre Release Event is all set to shake the city! 🔥
📍Police Grounds, Yousufguda, Hyderabad
Stay tuned to ▶️ https://t.co/iUeByWn7h9
Massive Events and Promotions by @shreyasgroup✌️#WAR2PreReleaseEvent pic.twitter.com/qbTiHTxXGL
— Shreyas Sriniwaas (@shreyasmedia) August 10, 2025
-
మారుమ్రోగుతున్న జై ఎన్టీఆర్ నినాదం
ప్రీ రిలీజ్ ఈవెంట్ కు సర్వం సిద్ధం.. జై ఎన్టీఆర్ నినాదంతో మారుమ్రోగుతున్న పోలీస్ గ్రౌండ్స్.. తారక్ ఫొటోలతో అభిమానుల సందడి
-
కటౌట్ అదిరిపోయింది..
వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏర్పాట్లు అదిరిపోయాయి. ముఖ్యంగా తారక్, హృతిక్ కటౌట్ ఆకట్టుకుంటుంది
“Everything is ready to roll… Bhuvaneswari Matha is with us 🙏 Everything has gone well – tonight will be unforgettable! 🔥 #War2 #War2PreReleaseEvent” pic.twitter.com/LQqsXc7ugQ
— Shreyas Sriniwaas (@shreyasmedia) August 10, 2025
-
పోలీస్ బందోబస్త్..
ఎన్టీఆర్ సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన ఆవరసం లేదు.. ప్రీ రిలీజ్ ఈవెంట్ కు భారీగా ఫ్యాన్స్ వస్తుండటంతో పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. అలాగే పదుల సంఖ్యలో పోలీసుకు బందోబస్త్ చేస్తున్నారు..
-
భారీగా తరలి వస్తున్న ఎన్టీఆర్ అభిమానులు..
వార్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలి వస్తున్నారు. అభిమానులకు ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు.
Published On - Aug 10,2025 5:02 PM



