Jayamma Panchayathi : రెండ్రోజుల్లో తేల్చకపోతే పంచాయితీ ఉండదు.. పెద్దలు ఉండరు!.. “జయమ్మ పంచాయితీ”

స్టార్ యాంకర్‌గా రాణిస్తున్న సుమ ఇప్పుడు వెండితెరపై కూడా ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. బుల్లితెరపై సుమ తిరుగులేని యాంకర్‌గా దూసుకుపోతున్నారు.

Jayamma Panchayathi : రెండ్రోజుల్లో తేల్చకపోతే పంచాయితీ ఉండదు.. పెద్దలు ఉండరు!.. జయమ్మ పంచాయితీ
Suma
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 12, 2021 | 2:54 PM

Jayamma Panchayathi : స్టార్ యాంకర్ గా రాణిస్తున్న సుమ ఇప్పుడు వెండితెరపై కూడా ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. బుల్లితెరపై సుమ తిరుగులేని యాంకర్ గా దూసుకుపోతున్నారు. యాంకర్ గానే కాకుండా బుల్లితెర రియాలిటీ షోల నిర్మాతగానూ సత్తా చాటుతున్నారు సుమ. తన మాటలతో ఆకట్టుకుంటున్న సుమ ఇప్పుడు జయమ్మగా వెండి తెరపై సందడి చేయనున్నారు. సుమ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న సినిమా జయమ్మ పంచాయితీ. నిజానికి సుమ పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించి ఆకట్టుకున్నారు. ఆతర్వాత ఆమె సినిమాలకు దూరమై.. టీవీషోలకు పరిమితం అయ్యారు. ఇప్పుడు తిరిగి పెద్ద స్క్రీన్ పై సందడి చేయనున్నారు. జయమ్మ పంచాయితీ సినిమా పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన కథ. తాజాగా ఈ సినిమానుంచి టీజర్ ను విడుదల చేశారు.

ఇప్పుడు ఈ టీజర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. జయమ్మ  అసలు ఈ చుట్టుపక్కల ఊళ్లలో ఇలాంటి గొడవ జరిగి ఉండదు అని ఊరి పెద్దలు చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ఆతర్వాత రెండురోజుల్లో ఈ గొడవ తేల్చేద్దామ్ అని అంటే దానికి జయమ్మ రెండ్రోజుల్లో తేల్చకపోతే పంచాయితీ ఉండదు పెద్దలు ఉండరు! అంటూ  గట్టిగానే వార్నింగ్ ఇచ్చింది. మంచాన పడినోడి గురించి రోజు ఈ పంచాయితీ ఏంటి అని ఓ ఉరి పెద్ద అడగ్గా.. నా మొగుడు నా మంచాన పడ్డాడు! అంటూ గడుసుగానే సమాధానమిచ్చింది. ఇక ఈ టీజర్ ను టాల్ హీరో రానా విడుదల చేశారు. ఈ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. విజయ్ కుమార్ ఈ చిత్రానికి దర్శకుడు. ఎంఎం కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ మూవీ టీజర్ లో సుమ పాత్ర తీరుతెన్నులు ఆకట్టుకున్నాయి.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Akhanda: 100 కోట్ల ‘అఖండ’.. కలెక్షన్లతో సింహగర్జన చేస్తోన్న బాలయ్య.. షేకయిన బాక్సాఫీస్

Manchu Vishnu: మంచు విష్ణు సంచలన నిర్ణయం.. ప్రకాష్‌ రాజ్ ప్యానల్ సభ్యుల రాజీనామాలు ఆమోదం

Senapathi: ఆహా సరికొత్త ఒరిజిన‌ల్ ఫిలిం ‘సేనాప‌తి’.. క్రైమ్, డ్రామా సిరీస్‌తో న‌ట కిరిటీ రాజేంద్రప్రసాద్‌ ఓటీటీ ఎంట్రీ !