‘క్వీన్‌’గా శివగామి.. వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ

ఇది బయోపిక్‌ల కాలం.. ఇప్పటికే తెలుగునాట ఎన్టీఆర్, సావిత్రి, వైఎస్సాఆర్ వంటి వారిపై బయోపిక్‌లు వచ్చాయి. బాలీవుడ్‌లో కూడా బయోపిక్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళులచేత అమ్మ అని పిలిపించుకున్న మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ వెబ్‌సిరీస్‌గా తెరకెక్కుతోంది. ఆమె బయోపిక్‌పై దక్షిణాదిన క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇందులో జయలలిత క్యారెక్టర్ చేసేది ఎవరు అనే సస్పెన్స్ కొనసాగుతోంది. అయితే పాత్రకు న్యాయం చేయగల నటి రమ్యకృష్ణ మాత్రమేనని చిత్ర యూనిట్ భావించింది. ఈ […]

'క్వీన్‌'గా శివగామి.. వెబ్ సిరీస్‌లోకి ఎంట్రీ
Follow us

| Edited By:

Updated on: Sep 07, 2019 | 7:36 PM

ఇది బయోపిక్‌ల కాలం.. ఇప్పటికే తెలుగునాట ఎన్టీఆర్, సావిత్రి, వైఎస్సాఆర్ వంటి వారిపై బయోపిక్‌లు వచ్చాయి. బాలీవుడ్‌లో కూడా బయోపిక్‌లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా తమిళులచేత అమ్మ అని పిలిపించుకున్న మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత బయోపిక్ వెబ్‌సిరీస్‌గా తెరకెక్కుతోంది. ఆమె బయోపిక్‌పై దక్షిణాదిన క్రేజ్ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇందులో జయలలిత క్యారెక్టర్ చేసేది ఎవరు అనే సస్పెన్స్ కొనసాగుతోంది.

అయితే పాత్రకు న్యాయం చేయగల నటి రమ్యకృష్ణ మాత్రమేనని చిత్ర యూనిట్ భావించింది. ఈ బయోపిక్ ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. జయలలిత బయోపిక్‌ ‘ క్వీన్‌’గా వస్తోంది.  ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. ఇందులో రమ్యకృష్ణ ముఖం ఎక్కడా కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. క్వీన్ ఎవరనే విషయాన్ని రివీల్ చేయకుండా సస్పెన్స్ కంటిన్యూ చేశారు. ప్రముఖ దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ బయోపిక్ మొత్తం దక్షిణాది భాషల్లో విడుదల చేయబోతున్నారు.