సైకిల్‌పై షూటింగ్‌కు..ఎవరా స్టార్ హీరో?
బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌లో పూర్తి ఛేంజోవర్ కన్పిస్తుంది. అతడు ఇంతకుముందులా ఎక్కువ కోపం ప్రదర్శించడంలేదని బీ టౌన్ టాక్. ఫ్మాన్స్‌తో కూడా సరదాగా గడుపుతున్నారు. వివాదస్పద వ్యాఖ్యలకు కాస్త డిస్టెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. తాజాగా సల్లూ భాయ్ ముంబయి వీధుల్లో సైకిల్‌పై చక్కర్లు కొడుతూ అందర్ని ఆశ్యర్యానికి గురిచేశారు. సల్మాన్‌ని చూసిన అభిమానులు అతనితో సరదాగా సెల్ఫీలు దిగారు. ప్రస్తుతం సల్మాన్ ‘దబాంగ్ 3’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. రెండు రోజలు […]

బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌లో పూర్తి ఛేంజోవర్ కన్పిస్తుంది. అతడు ఇంతకుముందులా ఎక్కువ కోపం ప్రదర్శించడంలేదని బీ టౌన్ టాక్. ఫ్మాన్స్‌తో కూడా సరదాగా గడుపుతున్నారు. వివాదస్పద వ్యాఖ్యలకు కాస్త డిస్టెన్స్ మెయింటేన్ చేస్తున్నారు. తాజాగా సల్లూ భాయ్ ముంబయి వీధుల్లో సైకిల్‌పై చక్కర్లు కొడుతూ అందర్ని ఆశ్యర్యానికి గురిచేశారు. సల్మాన్‌ని చూసిన అభిమానులు అతనితో సరదాగా సెల్ఫీలు దిగారు.
ప్రస్తుతం సల్మాన్ ‘దబాంగ్ 3’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్ ముంబయిలో జరుగుతోంది. రెండు రోజలు నుంచి ముంబయిలో భారీ వర్షాలు కురుస్తున్న విషయం తెలిసిందే. వరదల కారణంగా అక్కడ తీవ్ర ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఆ కష్టాలను దాటేందుకు భాయ్ సైకిల్‌ని ఫ్రిపర్ చేశారు. చిటపట చినుకులు పడుతూ ఉంటే సైకిల్‌పై సవారీ తీశారు. ఈ సందర్భంగా తీసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ‘సల్మాన్ ఏంటి..? ఇలా సైకిల్‌పై వెళ్లడమేంటి..’ అని మరికొందరు ఆశ్చర్యపోతున్నారు. ఇటీవల బాలీవుడ్ తారలు కియారా అద్వాణీ, సారా అలీఖాన్ కూడా ఆటోలో ప్రయాణించారు. అప్పట్లో వారిని కూడా నెటిజన్లు ప్రశంసించారు. కాగా సల్మాన్ లాంటి స్టార్ హీరో ఎక్కడైనా ఫ్యాన్స్‌కి దొరికిపోతే మాత్రం ఉక్కిరి బిక్కిరి అవ్వడం ఖాయం.
ప్రభుదేవా దర్శకత్వం వహిస్తున్న ‘దబాంగ్ 3’ చిత్రంలో సోనాక్షి సిన్హా కథానాయికగా నటిస్తున్నారు. 2010లో ‘దబాంగ్’ సినిమా విడుదలై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సీక్వెల్‌గా వచ్చిన ‘దబాంగ్ 2’ కూడా మంచి విజయం సాధించింది. సగానికిపైగా చిత్రీకరణ పూర్తైన ‘దబాంగ్ 3’ సినిమా డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Mumbai city in d rains . . Off to the location to shoot for #dabangg3 pic.twitter.com/sVY9Sa3Zdq
— Salman Khan (@BeingSalmanKhan) September 6, 2019